NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: ఆ నలుగురిపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డ సీఎం వైఎస్ జగన్

YS Jagan: చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నేతన్న నేస్తం పథకం అయిదవ విడత నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా బీసీలు, నేతన్నలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించిన సీఎం జగన్..వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. ఇప్పటి వరకూ ప్రతి సభల్లోనూ చంద్రబాబు, దత్తపుత్రుడు, ఎల్లో మీడియా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన జగన్ .. ఈ సారి మాత్రం లోకేష్, బాలకృష్ణను ఆ జాబితాలో చేర్చారు. యువగళం పాదయాత్రలో లోకేష్.. సీఎం జగన్ ను ఏకవచనంతో సంభోదిస్తూ విమర్శలు చేస్తున్నారు. దీంతో ఇవేళ సభలో జగన్ .. ఓ రేంజ్ లో వారిపై విమర్శలు చేశారు. సేవా భావంతో పని చేసే వాలంటీర్ల గురించి చంద్రబాబు, పవన్ సంస్కారం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

AP CM YS Jagan Serious Comments on chandrababu, pawan kalyan, lokesh and balakrishna

 

“కొన్ని జరుగుతున్న పరిస్థితులు చూసినప్పుడు, మాట్లాడకూడదు అని ఉన్నా కూడా మాట్లాడాల్సి వస్తొంది. ఎక్కడైనా మంచి చేస్తున్న వ్యవస్థలను, మనుషులను సంస్కారం ఉన్న ఏ ఒక్కరూ అవమానించరు. కానీ మంచి చేస్తున్న మన వాలంటీర్ల గురించి ఇటీవల సంస్కారం కోల్పోయి కొందరు మాట్లాడుతున్నందు వల్ల ఈ నాలుగు మాటలు కూడా మాట్లాడాల్సి వస్తొంది. వాలంటీర్లు ఎవరూ కొత్త వారు కాదు, మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నారు. వాలంటీర్లంతా మీ అందరికీ తెలిసినవాళ్లే. సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి గడప దగ్గరకు కాళ్లకు బలపం కట్టుకుని వెళ్లి.. కులం, వర్గం, ప్రాంతం, పార్టీలు చూడకుండా మీ ఇంటికి చేర్చే ఇలాంటి మనవళ్లు, మనవరాళ్ల వ్యవస్థ, అదే గ్రామంలో సేవలు చేసే మన ఊఉరి పిల్లల మీదే కొందరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. స్క్రిప్టు ఈనాడు రామోజీది అయిదే నిర్మాత చంద్రబాబు, నటన, మాటలు, డైలాగులు అన్నీ దత్తపుత్రుడివి” అంటూ విమర్శించారు. వాలంటీర్లు మహిళలను లోబర్చుకుంటారనీ, ట్రాఫికింగ్ చేస్తున్నారని, మహిళలను ఎక్కడికో  పింపిస్తున్నారని నిసిగ్గుగా ఒకరంటారు. వాలంటీర్లలో 60 శాతం మహిళలే ఉన్నారు పైగా సిగ్గు లేకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఆ రాతలను ప్రచురిస్తున్నాయి అని దుయ్యబట్టారు.

చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, సొంత పుత్రుడు, బావమర్ది క్యారెక్టర్ ఎలాంటివో అందరికీ తెలుసు. యూట్యూబ్ లో చూస్తే ఒకరు అమ్మాయిలతో డ్యాన్సులు చెస్తూ స్విమ్మింగ్ ఫూల్ లో అమ్మాయిలతో కనిపిస్తాడు, మరొకరు అమ్మాయి కనిపిస్తే ముద్దులు పెట్టాలి.. కడుపైనా చేయాలి అంటాడు. ఇంకొకరు టీవీ షోకి వెళ్లి బావా మీరు సినిమాల్లో చేశారు.. నేను నిజంగా చేశాను అంటాడు. ఇంకొకడేమో బాబుతో పొత్తు, బీజేపీతో కాపురం. ఇచ్చేది బీఫాం .. టీటీడీకి బీ టీమ్ అంటూ మండిపడ్డారు. వాలంటీర్ల క్యారెక్టర్లను పవన్ తప్పుబట్టి.. వాళ్లను అవమానించారు. మన వాలంటీర్లు అమ్మాయిలను లోబర్చుకున్నారా అని ప్రశ్నించారు. అమ్మాయిల్ని లోబర్చుకోవడం, పెళ్లిళ్లు చేసుకోవడం, కాపురాలు చేయడం, వదిలివేయడం పవన్ కళ్యాణ్ క్యారెక్టర్..అలాంటి వ్యక్తా వాలంటీర్ల గురించి మాట్లాడేది. ఒకరిని వివాహం చేసుకుని..మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకునే వ్యక్తా వాలంటీర్ల వ్యక్తిత్వంపై మాట్లాడేది. అసలు వాలంటీర్లను తప్పుబట్టింది.. పదేళ్లుగా చంద్రబాబుకు వాలంటీర్ గా పని చేస్తున్న ప్యాకేజీ స్టార్ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీఎం జగన్.

పవన్ .. చంద్రబాబు మీద పోటీ ఓ డ్రామా, బీజేపీతో స్నేహం మరో డ్రామా, తనది ప్రత్యేక పార్టీ అనేది ఇంకో డ్రామా అంటూ విమర్శించారు. మన నేతన్నల వస్త్రాలన్నీ కూడా అమ్మే ఏర్పాట్లు జరిగింది మీ బిడ్డ ప్రభుత్వంలోనే మనసుపెట్టి చెసింది అని తెలియజేస్తున్నా. వెనుకబడిన సామాజిక వర్గాలకు అట్టడుగున ఉన్న సామాజిక వర్గాలకు అన్ని రకాలుగా చేయి పట్టుకొని నడిపించాం అని జగన్ పేర్కొన్నారు. మేం చేస్తున్న మంచి మరో చరిత్ర. ఇది మీ బిడ్డ చరిత్ర. పథకాలు నేరుగా లబ్దిదారులకు అందించడం మన చరిత్ర. గతంలో ఎన్నడూ లేనివిధంగా సామాజిక న్యాయం అందించాం. అన్నివర్గాలకు మంచి చేశాం. మేనిఫెస్టోలో 90 శాతం హామీలను నెరవేర్చిన చరిత్ర మనది. రానున్నరోజుల్లో మీ బిడ్డ గురించి.. మీ బిడ్డ ప్రభుత్వం గురించి చెడుగా మాట్లాడతారు. అబద్దాలను, మోసం చేసే వారిని నమ్మకండి. మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేది చూడండి అదరించండి అని ప్రజలకు కోరారు సీఎం జగన్.

Tirupati: ఎస్వీ ఓరియంట‌ల్ డిగ్రీ క‌ళాశాల‌లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju