NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: నాడు తండ్రి మాట .. నేడు జగన్ నోట

Share

YS Jagan: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఎన్నికల ప్రచార సభల్లో కన్నతల్లికి అన్నం పెట్టని వాడు.. పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడా అని విమర్శించే వారు. ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. తాజాగా ఇప్పుడు ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్ ఆవే మాటలను వల్లెవేస్తూ.. కుప్పం ప్రజలకే నీళ్లు ఇవ్వని చంద్రబాబు ఇతర ప్రాంతాలను బాగు చేస్తారా అని ప్రశ్నించారు.

ఇవేళ సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు శ్రీకారం చుట్టారు. కృష్ణానది పక్కనే ఉన్నా నీళ్లు దక్కని పరిస్థితి పల్నాడులో నెలకొని ఉందని, ఈ పరిస్థితిని మార్చాలనే రూ.340 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశామన్నారు. ఎన్నికలకు కేవలం నెల ముందు ఎటువంటి అనుమతులు లేకపోయినా గత పాలకులు మనల్ని మోసం చేసేందుకు కొబ్బరికాయ కొట్టారని విమర్శించారు. ప్రస్తుతం అన్ని అనుమతులు పొంది ప్రాజెక్టును చేపట్టామన్నారు. ఈ నెల 6వ తేదీన అటవీశాక నుండి అన్ని అనుమతులు వచ్చాయన్నారు.

ఏదైనా పని చేయాలంటే పాలకులకు చిత్తశుద్ది ఉండాలన్నారు. ఈ ప్రాజెక్టును దశల వారీగా మాచర్ల, వినుకొండ, ఎర్రగొండపాలెం వరకూ తీసుకువెళతామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు, తాగునీరు అందించబోతున్నామని చెప్పారు. పల్నాడును జిల్లా చేయడంతో పాటు మెడికల్ కాలేజీ ఇచ్చామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనార్టీలు, మహిలల సాధికారత కోసం ఈ ప్రభుత్వం పని చేస్తొందని పేర్కొన్నారు. కోవిడ్ అతలాకుతలం చేసిందనీ, ఆదాయాలు తగ్గినా కూడా ఎవరి మీద సాకులు చెప్పలేదన్నారు. ఎంతటి కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలను ఆపలేదని, డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.4 లక్షల 10వేల కోట్లు అందించామన్నారు.

ఇదే సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను విమర్శించారు. చంద్రబాబుకు ప్రజల సంక్షేమం పట్టదన్నారు. చంద్రబాబు పాలనలో మోసాలు, వెన్నుపోటు, అబద్దాలేనని విమర్శించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కటైనా మంచి కార్యక్రమం చేపట్టలేదన్నారు. ఇప్పుడు కేజీ బంగారం, బెంజ్ కార్లు ఇస్తామని చంద్రబాబు ఆఫర్ లతో వస్తాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన మాటలు ఎవరూ నమ్మరని మరో నలుగురిని వెంటబెట్టుకుని వస్తున్నాడని అన్నారు. చంద్రబాబు లాగా పొత్తులు పెట్టుకోవడం తమకు తెలియదన్నారు. ప్రజలకు మంచి జరిగితేనే ఓటు వేయండి అని చెప్పే ధైర్యం తనకు ఉందని అన్నారు. అన్ని వర్గాలకు మంచి చేశాం కాబట్టే ధైర్యంగా ఉన్నామని అన్నారు సీఎం జగన్.

ఈ కార్యక్రమంలో మంత్రులు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, విడతల రజిని తదితరులు ప్రసంగించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు పాల్గొన్నారు.

Telangana Election: అచ్చంపేటలో రెండు సెంటిమెంట్లు .. ఇక్కడ గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీకి అధికారం పక్కా..మరో సెంటిమెంట్ ఏమిటంటే..?


Share

Related posts

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న జగన్ ల్యాప్ టాప్ నిర్ణయం..!!

sekhar

Black Fungus: బ్లాక్ ఫంగ‌స్.. మీరు త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సింది ఏంటంటే

sridhar

BJP MIM : బీజేపీXఎంఐఎం.. హైదరాబాద్ యూటీ కేంద్రంగా మరో రాజకీయ రగడ..!?

Muraliak