ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Districts Bifurcation: జిల్లాల విభజనపై ఆందోళనలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు..?

Share

AP Districts Bifurcation: ఏపి ప్రభుత్వం జిల్లాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తూ ప్రభుత్వ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు 30 రోజుల్లో అందజేయాలని ప్రభుత్వం పేర్కొంది. అయితే పలు జిల్లాల్లో తమ ప్రాంతాలు జిల్లా కేంద్రాలకు సుదూరం అవుతాయన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు తీసుకుంటే విజయవాడకు అత్యంత సమీపంలో ఉన్న గన్నవరం నియోజకవర్గాన్ని మచిలీపట్నం జిల్లాలో కలిపారు. గన్నవరం ఎయిర్ పోర్టును విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంగానే పిలుస్తుంటారు. ఇలా అనేక జిల్లాల్లో పరిస్థితి ఉండటంతో ప్రజల నుండి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

AP Districts Bifurcation govt key orders
AP Districts Bifurcation govt key orders

 

AP Districts Bifurcation: హిందూపూర్ ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి – నందమూరి బాలకృష్ణ

పార్లమెంటరీ నియోజకవర్గాల కేంద్రంగా జిల్లాల ఏర్పాటు అని పేర్కొన్నా కొన్ని పార్లమెంట్ కేంద్రం కాకుండా వేరే ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా ప్రకటించారు. అనంతపురం జిల్లాలో హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంగా ఉండగా శ్రీసత్యసాయి బాబా జిల్లాగా పేరు పెట్టి పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించారు. దీనిపై సత్యసాయి ట్రస్ట్ నిర్వహకులతో పాటు ఆ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తుండగా, హిందూపూర్ నే జిల్లా కేంద్రంగా ప్రకటించి సత్యసాయి బాబా పేరునే జిల్లాకు కొనసాగించాలని కోరుతున్నారు అక్కడి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. అదే విధంగా నరసరాపురం పార్లమెంట్ కేంద్రంగా ఉండగా ఆ నియోజకవర్గ పరిధిలోని భీమవరంను జిల్లా కేంద్రంగా ప్రకటించారు.

 

ఆ మండలాలలను ఏ జిల్లాలో కలపాలి

జిల్లాల విభజనపై ఆయా జిల్లాల్లో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ లకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు దూరంగా ఉన్న మండలాల వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కేంద్రాలకు సుదూరంగా ఉన్న మండలాల వివరాలు పంపాలని ఉన్నతాధికారులు కోరారు. అదే విధంగా సుదూరంగా ఉన్న మండలాలలను ఏ జిల్లాలో కలపాలో కూడా తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల విభజన చేసుకునేందుకు ఈ ఏడాది జూన్ 30 వరకు అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఏప్రిల్ రెండవ తేదీ నాటికి జిల్లాల విభజన చేసి తీరుతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Read More: AP CM YS Jagan: ఈ విషయంలో జగన్ కు మోడీ షాక్ ఇవ్వడం ఖాయమే(గా)..??


Share

Related posts

బ్రేకింగ్ :( Ysr )వైయస్ అనుచరుడు సూరీడు పై దాడి…!!

sekhar

Rashmi Gautam: సోషల్ మీడియాలో నెటిజన్లకు కొత్త పాఠాలు నేర్పిన యాంకర్ రష్మీ..!!

sekhar

అత్తగారు తిట్టింది అని మొగుడి నెత్తి మీద రాయితో … !!

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar