NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

IPS AB Venkateshwara Rao: ఎట్టకేలకు ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చిన ఏపి సర్కార్..! ఎక్కడంటే..?

IPS AB Venkateshwara Rao: రెండేళ్లకు పైగా సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కు ఎట్టకేలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో గత నెలలో సస్పెన్షన్ ఎత్తివేస్తూ జీఏడి లో రిపోర్టు చేయమని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.. నేడు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రింటింగ్ స్టేషనరీ స్టోర్స్ సర్వీస్ డిపార్ట్ మెంట్ కు కమిషనర్ గా ఏబి వెంకటేశ్వరరావు ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ స్థానంలో ఇప్పటి వరకూ బాధ్యతలు నిర్వహిస్తున్న విజయకుమార్ కు హోంశాఖ స్పెషల్ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

AP government posting to IPS AB Venkateshwara Rao
AP government posting to IPS AB Venkateshwara Rao

 

ఏబి వెంకటేశ్వరరావు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హోంశాఖలో పరికరాల కొనుగోలులో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై సస్పెండ్ చేశారు. తన సస్పెన్షన్ పై అప్పట్లో ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ ను ఆశ్రయించగా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది. ఆ తరువాత ఏబీ వెంకటేశ్వరరావు ఏపి హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఆయనను విధుల్లోకి తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఆరు నెలల చొప్పున రెండేళ్లకు పైగా ఆయన సస్పెన్షన్ ను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చింది. తదుపరి ఏబీ వెంకటేశ్వరరావు సుప్రీం కోర్టును ఆశ్రయించగా రెండేళ్లకు పైగా సివిల్ సర్వీస్ అధికారిని సస్పెన్షన్ లో కొనసాగించకూడదన్న నిబంధన మేరకు ఆయనను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

 

దీనిపై సుప్రీం కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వరరావు పలు మార్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు రాశారు. సీఎస్ ను కలిసేందుకు వెళ్లిన సందర్భంలోనూ ఏబీ వెంకటేశ్వరరావుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈ విషయాన్ని ఏబీ వెంకటేశ్వరరావు అప్పట్లోనే మీడియాకు వెల్లడించారు. ఆ తరువాత సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే పోస్టింగ్ కొరకు కూడా ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి లేఖలు రాశారు. అదే క్రమంలో తన సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లోనూ తప్పులు ఉన్నాయనీ, ఈ ఏడాది మార్చి నెల నుండే సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారనీ, దాన్ని సరి చేయాలని కోరారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju