ఏపి ఎస్సీ హాస్టల్స్ కు చెందిన పలువురు విద్యార్ధులకు అరుదైన అవకాశం లభించింది. పలువురు హాస్టల్ విద్యార్ధినీ విద్యార్ధులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమైయ్యారు. ఈ విద్యార్ధులతో ప్రదాని కాసేపు ముచ్చటించారు. పార్లమెంట్ లో ప్రధాని మోడీని విద్యార్ధులు కలుసుకున్నారు. ఇండియన్ మా బ్యాంకు తన సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ఎస్సీ హాస్టల్స్ లోని ప్రతిభావంతులైన 42 మంది విద్యార్ధులను ఎంపిక చేసి విజ్ఞాన యాత్రకు తీసుకువెళ్లింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ వెళ్లిన విద్యార్ధులు ప్రధాని మోడిని కలిశారని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జన తెలిపారు.

అన్ని వ్యవస్థలను పాడు చేసే వైరస్ లాంటిది తెలుగుదేశం పార్టీ అంటూ సజ్జల ఘాటు కామెంట్స్
ఈ విజ్ఞాన యాత్రలో రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన ఎస్సీ హాస్టల్ విద్యార్ధినీ విద్యార్ధులు 42 మంది పాల్గొన్నారని చెప్పారు. ఈ నెల 14వ తేదీ నుండి 19వ తేదీ వరకూ కొనసాగిన ఈ యాత్రలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న విద్యార్ధులు అక్కడి పార్లమెంట్ భవనంలో ప్రధాని మోడిని కలుసుకున్నారు. ఈ సందర్భంలో విద్యార్దులతో కొద్ది సమయాన్ని గడిపిన ప్రధాని మోడీ వారితో ముచ్చటించారు. వారి ప్రయాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలు, స్వామి వివేకానంద వంటి మహానీయుల జీవిత గాధలు చదివి వాటి ద్వారా స్పూర్తి పొందాలని ప్రధాని మోడీ విద్యార్దులకు వివరించారని మంత్రి తెలిపారు. పరీక్షల విషయంలో భయాలకు విడనాడాలని, కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని తమ భవిష్యత్తును ఉజ్వలంగా మలచుకోవాలని మోడీ విద్యార్దులకు సూచించారని చెప్పారు.
పొత్తుల కోసం ఎందుకీ వెంపర్లాట అంటూ ప్రతిపక్షాలపై సీఎం జగన్ విసుర్లు