NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

తాజాగా శ్రీరామ‌న‌వ‌మిని పుర‌స్క‌రించుకుని.. అనేక మీడియా సంస్థ‌లు.. రాముడితో లింకు పెట్టి… ఏపీ పాల‌న ఇలా ఉంటే బాగుంటుంది.. కాబ‌ట్టి నిర్ణ‌యం తీసుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చిందంటూ.. ప‌రోక్షంగా కూట‌మిని ప్ర‌స్తావిస్తున్నారు. ఇదేస‌మ‌యంలో గ‌త ఐదేళ్ల‌లో రాష్ట్రంలో అభివృద్ధి లేద‌ని చెబుతూ వ‌చ్చా రు. అంతేకాదు.. ప‌లు సామాజిక వ‌ర్గాలు అణిచివేత‌కు గుర‌య్యార‌నేది కూడా ఈ క‌థ‌నాల సారాంశం. దీనికి రాముడి పాల‌న‌లో జ‌రిగిన మేళ్ల‌ను వివ‌రించారు. ఇది త‌ప్పుకాదు!

కానీ, అస‌లు ఇప్పుడున్న ప‌రిస్థితిలో రామ‌రాజ్యం సాకార‌మేనా? నిజానికి రాముడే దిగి వ‌చ్చి.. పాలిస్తాన న్నా… నాటి పాల‌న‌ను అందించే సాహ‌సం ఆయ‌న చేయ‌గ‌ల‌డా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఇక్క‌డ రెండు ప్ర‌ధాన అంశాలు ప‌రిశీలించాలి. రాముడు రాజ్యం చేసింది.. వంశ‌పారంప‌ర్య రాజ‌కీయంతో వ‌చ్చి న రాజ్యం. కానీ, మ‌నం ఉన్న‌ది ప్ర‌జాస్వామ్యం. ఇక్క‌డ ప్ర‌జ‌లు నిర్ణేత‌లు. ఇక‌, నాటి రామాయ‌ణం క‌థ‌నం మేర‌కు.. రాముడి ఇద్ద‌రి త‌మ్ముళ్లు.. ఒక అన్న కూడా.. మంత్రులు. ఇది కూడా వంశ‌పారంప‌ర్య‌మే.

కానీ, ఇక్క‌డ అలా ఒకే కుటుంబం పాల‌న సాగించే అవ‌కాశం ప్ర‌జ‌లు కోరుకుంటే త‌ప్ప‌.. ఇచ్చేందుకు వీలు లేదు. కాబ‌ట్టి ఎలా చూసుకున్నా.. ప్ర‌జాస్వామ్యానికి-రాముడి పాల‌న‌కు పొంత‌న ఉండ‌దు. మ‌రో కీలక విష‌యం.. రాముడిలా పాలించాల‌ని ఆశ‌ప‌డ‌డం త‌ప్పుకాదు. కానీ, ప్ర‌జాస్వామ్య ఎన్నిక‌ల క్ర‌తువులో ఖ‌ర్చు పెట్ట‌కుండా.. నాయ‌కులు గెలిచే ప‌రిస్థితి లేన‌ప్పుడు.. రాముడిలా.. నిజాయితీగా పాల‌న అందిం చ‌డం.. కేజ్రీవాల్ , మ‌మ‌తా బెన‌ర్జీ వంటి.. కేవ‌లం సీఎంగా వచ్చే జీతంపైనే ఆధార‌ప‌డుతున్నా న‌న్న వారి వ‌ల్లే కావ‌డం లేదు.

వారు అవినీతి ప‌రులు కాదు. కానీ, చుట్టూ ఉన్న వారి ప‌రివారంలో ఉప్పుగ‌ల్లులు చాలానే ఉన్నాయి. కాబ‌ట్టి.. రామ‌రాజ్యం స్థాప‌న అనేది కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమితం. ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా.. సంపూర్ణ రామ‌రాజ్యం తీసుకువ‌స్తామని చెబితే.. అది బూట‌క‌మే. నాట‌క‌మే అవుతుంది. అంతెందుకు.. అయోధ్య‌లో రామాల‌యం క‌ట్టాం.. రాముడు మావాడే అని చెప్పుకొనే బీజేపీ.. తొలి ద‌శ ఎన్నిక‌ల్లో ఇచ్చిన టికెట్ల‌ను ప‌రిశీలిస్తే.. 24 మంది అత్యంత క‌ర‌డు గట్టిన నేర‌స్థుల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే పేర్కొంది.

మ‌రో 12 మంది అభ్య‌ర్థులు.. ఇంకా తీవ్ర నేరాలు ఎదుర్కొంటున్న‌వారే. కానీ, నాటి రాముడి పాల‌న‌లో ఇలా లేదు క‌దా! సో.. ఎలా చూసుకున్నా.. రామాయ‌ణంలో చెప్పిన‌ది ఆ కాలానికి ప‌రిమితం.. ఈ కాలానికి ఆద‌ర్శం.. అంతే!! కాబ‌ట్టి పోలిక త‌ప్పు కాదేమోకానీ.. అదే వ‌స్తుంద‌ని.. చెప్ప‌డం మాత్రం అతిశ‌యోక్తే!!!

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju