NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ సూటి పోటి మాట‌లు.. చంద్ర‌బాబుకు భ‌యం ఎందుకు..?

ఏపీ రాజ‌కీయాలు వేడెక్కాయి. అస‌లే ఎన్నికల స‌మ‌యం కూడా దీనికి తోడ‌వ‌డంతో మ‌రింత కాక రేపుతున్నాయి. ప్ర‌ధానంగా అధికార పార్టీ వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం రాటు దేలుతోంది. పార్టీల అధినేత‌లే.. మాట‌ల తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు.. సీఎం జ‌గ‌న్ పాల‌న‌ను, ఆయ‌న పార్టీ నాయ‌కుల‌ను టార్గెట్ చేస్తున్నారు. అరాచ‌క పాల‌న సాగుతోంద‌ని.. తాను వ‌స్తే.. మంచి పాల‌న అందిస్తాన‌ని చెబుతున్నారు. అంతేకాదు, ప్ర‌స్తుతం ఉన్న ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తాన‌ని కూడా చెబుతున్నారు.

ఇక‌, పించ‌నును రూ.4000 చేస్తాన‌ని చంద్ర‌బాబు గ‌త నాలుగు రోజులుగా చెబుతున్నారు. అంతేకాదు, మ‌రో అడుగు ముందుకు వేసి.. ప్ర‌స్తుతం పింఛ‌ను తీసుకుంటున్న వారికి కూడా దీనిని అమ‌లు చేస్తామ‌ని చిత్ర‌మైన వాద‌న తెచ్చారు. అంటే, చంద్ర‌బాబు ఉద్దేశం ప్ర‌కారం.. ఏప్రిల్‌ నుంచే రూ.4000 చొప్పున పింఛ‌ను అమ‌లు చేయ‌నున్నారు. దీనిలో ప్ర‌స్తుత ప్ర‌భుత్వం రూ.3000 ఇస్తుండ‌గా.. మిగిలిన రూ.1000ని తాను అధికారంలోకి వ‌చ్చాక లెక్క‌గ‌ట్టి (ఏప్రిల్‌+మే+జూన్‌) మూడు మాసాల‌ది జూలైలో ఇస్తాన‌ని చంద్ర‌బాబు చెప్పారు.

ఇక‌, కామ‌న్‌గా మారిపోయిన వివేకానంద‌రెడ్డి హ‌త్య‌.. జ‌గ‌న్ కోడిక‌త్తి.. అనంత‌బాబు శ‌వం డోర్ డెలివ‌రీ.. సుధాక‌ర్ మృతి ఇలా కొన్నింటిని ఎక్క‌డికి వెళ్లినా చంద్ర‌బాబు చెబుతున్నారు. అయితే.. జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే.. చెప్పిన మాట‌ను ఎక్క‌డా చెప్ప‌డం లేదు. ఒక చోట చేసిన విమ‌ర్శ‌లు మ‌రో చోట చేయ‌డం లేదు. దీంతో జ‌గ‌న్ ప్ర‌సంగాల్లో కొత్త‌ద‌నం క‌నిపిస్తోంది. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబును ఆయ‌న చేస్తున్న టార్గెట్ కూడా.. రోజు రోజుకు మారుతోంది. `ఏదైనా గుర్తుండిపోయే ఒక్క ప‌థ‌క‌మైనా ఉందా చంద్ర‌బాబూ` అనే మాట కొన్నాళ్లు వినిపించారు. త‌ర్వాత‌.. దీనిని వ‌దిలేసి.. త‌న ప‌థ‌కాల‌ను ఏక‌రువు పెట్టారు.

వీటిలోనూ కొత్త పుంత‌లు తొక్కుతున్నారు. తానకు పేద‌ల‌కు మ‌ధ్య ఫెవికాల్ బంధం ఉంద‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను దీనికి ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొంటున్నారు. అంతేకాదు.. ఇలాంటి బంధం చంద్ర‌బాబుకు ఉందా? అనేది జ‌గ‌న్ సంధిస్తున్న ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఇది క్షేత్ర‌స్థాయిలో పెను చ‌ర్చ‌కు దారితీస్తోంది. అయితే.. ఇలాంటి ప్ర‌శ్న‌లు వ‌చ్చిన‌ప్పుడే బ‌ల‌మైన గ‌ళం వినిపించాల్సిన చంద్ర‌బాబు.. ఎక్క‌డో విఫ‌ల‌మ‌వుతున్నారు. నిజానికి 2014-19 మ‌ధ్య టీడీపీ హ‌యాంలోనూ కొన్ని ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్టారు.

అవి కూడా పేద‌ల‌తో ముడిప‌డ్డాయి. ఉదాహ‌ర‌ణ‌కు రంజాన్‌, క్రిస్మ‌స్ కానుక‌లు, సంక్రాంతి కానుక‌లు.. పేద‌ల ఇళ్ల‌లో పండుగ‌లు తెచ్చాయి. ఇక‌, అన్నా క్యాంటీన్ ఒక అద్భుత ప‌థ‌క‌మ‌నే చెప్పాలి. మ‌రి వీటిని క్లెయిమ్ చేసుకోవ‌డంలో చంద్ర‌బాబు మౌనంగా ఎందుకు ఉంటున్నార‌నేది ప్ర‌శ్న‌. ఇప్ప‌టికైనా.. బ‌ల‌మైన గ‌ళం వినిపించ‌క‌పోతే.. జ‌గ‌న్ నిజం.. అయిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju