Regina Cassandra: కొంతమంది హీరోయిన్లు 13 ఏళ్లకే చిత్రరంగంలో అడుగుపెడితే మరి కొంతమంది మాత్రం తమ 16 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. పదహారేళ్లు అనే మైండ్ సెట్ ను తన ఎంట్రీ బ్రేక్ చేసిన ముద్దుగుమ్మ రెజీనా కసాండ్రా. 14 ఏళ్లకే ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. అంత చిన్న ఏజ్ లో 21 అమ్మాయిగా గర్భవతిగా డి గ్లామర్ పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పుడు గ్లామర్ పాత్రలలో ఎక్కువగా నటిస్తుంది. హావాభావాలు...నటన తీరు తో ఇండస్ట్రీలో రాణించేందుకు ప్రయత్నిస్తుంది ఈ ముద్దుగుమ్మ. దక్షిణాది స్టార్ గా పాపులర్ అయింది. ఒకప్పుడు రెండు చిత్రాల్లో నటించి అనంతరం డిగ్రీ పూర్తి చేసింది రెజీనా. కానీ ఇప్పుడు ఖాళీ అనేదే లేనంతగా తెలుగు మరియు తమిళ్ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటుంది. ఎస్ఎంఎస్ శివ మనసులో శృతి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది రాజీనా.
తనదైన శైలిలో చిత్రాలు ఎంచుకుంటూ దూసుకుపోతుంది. 1988 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించింది రెజీనా. తల్లి తమిళ్ అయితే తండ్రి మాత్రం ఉత్తరాదికి చెందిన వ్యక్తి. రెజీనా తనకి తొమ్మిదేళ్లు వయసు ఉన్నప్పుడే స్ప్లాష్ అనే పిల్లల ఛానల్లో యాంకర్ గా మెప్పించింది. దూరదర్శన్ లోను ఓ టీవీ కార్యక్రమంలో చేసిన ఈమె ఒక్క ఎపిసోడ్ తోనే ఆగిపోయింది. ఈమె చిన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేదట. వేసవికాలంలో సినిమాల్లో నటిస్తూ మామూలు రోజుల్లో భరతనాట్యంలో ఆరితేరింది. ఇక బ్రేక్ దొరికినప్పుడు పుస్తకాలు తిరగేసేది. అలా చిన్నప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ చిత్ర పరిశ్రమ వాతావరణం లోనే ఎక్కువగా పెరిగింది. దీంతో కొన్ని కమర్షియల్ పాత్రల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. 2005లో ప్రియదర్శకత్వం వహించిన ఓ సినిమాలో లయకు సోదరిగా ఈ ముద్దుగుమ్మ నటించింది.
ఎటువంటి మేకప్ లేకుండా నటించి ఆ పాత్రకు ప్రాణం పోసింది రజీనా. అలా తన 14 ఏళ్ల వయసులోనే వెండితెరకు పరిచయమైంది. అది కూడా 21 ఏళ్ల గర్భిణీ పాత్రతో. ఆ అనంతరం యోగి తో కలిసి నటించింది. ఇక ఈ మూవీకి పెద్ద స్పందన రాకపోవడంతో మళ్లీ చదువు కొనసాగించింది. అనంతరం చెన్నైలోని ఉమెన్స్ కాలేజ్ లో తన ఎడ్యుకేషన్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే అనేక షార్ట్ ఫిలిమ్స్ లో సైతం నటించింది. సూర్యకాంతి అనే కన్నడ చిత్రం ద్వారా అక్కడ ప్రేక్షకులకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమా కాస్త విజయవంతం అవడంతో అవకాశాలు పెరుగుతాయని అనుకుంది రెజీనా. కానీ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. అవకాశాలు ఏమి రాకపోగా కొన్ని సినిమాలు చేయి జారిపోయాయి.
దీంతో ఈ అమ్మడు చూపు తెలుగు సినీ రంగంపై పడింది. అలా శివ మనసులో శృతి చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సంపాదించుకుంది. ఆ అనంతరం రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జెండా, రారా కృష్ణయ్య, పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాలు ఈ అమ్మడి కెరీరే మార్చేశాయి. అలా కొంతకాలం టాలీవుడ్ ని షేక్ చేసిన ఈ భామ ప్రస్తుతం అవకాశాలు లేక సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. తాజాగా బ్రౌన్ కలర్ కోర్ట్ ధరించి యధా అందాలను స్పష్టంగా చూపిస్తూ ఎక్స్పోజింగ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. అక్కడ ఏమీ లేదు.. అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.