NewsOrbit
Entertainment News Telugu TV Serials న్యూస్ సినిమా

Krishna Mukunda Murari April 8 2024 Episode 439: మురారి బ్యాగ్ లోపల పెట్టిన ఆదర్శ్. భవాని ఇంట్లో హోలీ సెలబ్రేషన్స్. ముకుంద మురారి?

Krishna Mukunda Murari Today Episode April 8 2024 Episode 439 highlights

Krishna Mukunda Murari April 8 2024 Episode 439: ఆదర్శ కోపంలో మురారిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. మీ ప్లేస్ లో నేను ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇలా అయితే ఉండేవాన్ని కాదు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవాన్ని అని అంటాడు ఇక ఆ మాటలకు బాధపడిన మురారి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని డిసైడ్ అవుతాడు. ఇంట్లో నుంచి మెట్లు దిగి కిందకి వస్తు, కృష్ణ బతిమిలాడుతూ ఉంటే నేనిక నా నిర్ణయాన్ని మార్చుకో దలుచుకోలేదు ఇంట్లో ఎవరైనా సరే ఉండమని అడిగినా ఉండేది లేదు అని తేల్చి చెప్తాడు. అప్పుడేరేవతి చూస్తుంది ఎక్కడికి వెళ్తున్నారు బ్యాగ్స్ ఎత్తుకొని అని అడుగుతుంది పక్కనే ఆదర్శ్ కూడా సోఫాలో కూర్చుని ఉంటాడు. ఎంతసేపటికి రేవతి అడిగినా కానీ ఇద్దరు సమాధానం చెప్పకుండా ఉంటారు.ఏదైనా ఊరు వెళ్తున్నారా బ్యాగ్ సర్దుకొని వెళ్తున్నారు కనీసం మాట కూడా చెప్పలేదు నాకు ఇప్పటికైనా చెప్పండి ఏ ఊరు వెళ్తున్నారు అని అడుగుతుంది రేవతి ఇది ఆ కృష్ణతో ఏంటే బెల్లం కొట్టిన రా ఇలా నిలబడ్డావు నువ్వైనా చెప్పొచ్చు కదా అని అడుగుతుంది కానీ కృష్ణ మురారి ఇద్దరు ఏమీ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటారు. రేవతి మీ బాబాయి ఇంటికి వెళ్తున్నారా అని అడుగుతుంది కృష్ణా మురారి వైపు చూస్తే నేను నిన్ను అడుగుతుంటే నువ్వు వాడి వైపు చూస్తున్నావ్ ఏంటి వాడేమైనా నిన్ను వద్దంటానా ఏంటి? ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు సమాధానం చెప్పరంటే అని అంటుంది అందులో ముకుందా ఇంట్లో అందరూ అక్కడికి వస్తారు.

Krishna Mukunda Murari Today Episode April 8 2024 Episode 439 highlights
Krishna Mukunda Murari Today Episode April 8 2024 Episode 439 highlights

ఇక అక్కడికి వచ్చిన ముకుందా మురారి చేతిలో బ్యాగు చూసి షాక్ అవుతుంది. రేవతి గట్టిగా అడిగేసరికి మురారి ఎక్కడికి వెళ్తాము అమ్మ ఏదో ఒక రోజు నీకు చెప్పాలి కదా అయినా నిజం దాగదు కదా అని మా ఇంటికి వెళ్తున్నాను అని అంటాడు దానితో రేవతి షాక్ అవుతుంది. ఏంటి తల తిరుగుతుందా ఏంటి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని అంటే లేదు అత్తయ్య ఇంట్లో మేము ఉండడం కొంతమందికి ఇష్టం లేదు అందుకే మేము ఇక నుంచి వెళ్ళిపోవాలంటేసైడ్ అయ్యాము అని అంటుంది కృష్ణ. ముకుంద నేను ఇంతకాలం ప్లాన్ చేసి ఇదంతా చేసింది మురారి కోసమైతే మురారి ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అంటున్నాడు ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది.మేము ఇంట్లోంచి వెళ్లిపోతే ఇంట్లో ఉండేవారైనా సంతోషంగా ఉంటారు కదా అత్తయ్య మీకు నేను చెప్పింది అర్థమైంది కదా అని అంటుంది ఇక పక్కనే ఉన్న రజిని అదేంటి నువ్వు ఇక నుంచి వెళ్ళిపోవడానికి ఎవరు కారణం నాకేం అర్థం కావట్లేదు. అయినా మీ పెద్దత్తయిన ఎవరైనా అంటే నేను సహించను అని చెప్పావు ఇప్పుడు ఎవరు ఏమన్నారు ఇంట్లోనుండి పోతున్నావు మొత్తం కలిపి నా మీద పెడతావా ఏంటి అని అంటుంది. మధు నువ్వు కాదులే అత్తయ్య ఈ ఇంట్లో అలాంటి వాళ్ళు ఉన్నారు అది అందరికీ తెలుసులే అని మీరు కాదు అని సైలెంట్ గా ఉండండి అని అంటాడు. ముకుందా ఇప్పుడు నేను ఆపితే వీలు ఆగుతారా అయినా నేనేం చెప్ప ఆపాలి? ఈ ఆదర్శవల్ల ఇప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉండేలా ఉంది అని కంగారుపడుతూ ఎలా మురారి వల్ల ఆపాలని ఆలోచిస్తూ ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 8 2024 Episode 439 highlights
Krishna Mukunda Murari Today Episode April 8 2024 Episode 439 highlights

ఇక రేవతి ఎవరైనా ఈ మాట అనొచ్చు కానీ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అనడం ఏంట్రా అని అంటుంది అక్కడే ఉన్న రజిని మనకి ఇష్టం లేని ఇప్పుడు ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏమీ లేదు ఎవరికి నచ్చిన ఇంట్లోంచి వెళ్లిపోవచ్చు కదా అని అంటుంది. వెంటనే రేవతి మీరు అగ్గిలో అర్జున్ పోయాక్కర్లేదు మీకు ఇక్కడ జరిగేది ఏది అర్థం కాదు సైలెంట్ గా ఉండండి అని అంటుంది. రజిని మనసులో ఏది జరుగుతుందో అర్థం కాకపోయినా కృష్ణ ఇంట్లోంచి వెళ్తుంది అని మాత్రం అర్థం అయింది కాబట్టి నాకు కావాల్సింది కూడా అదే కదా ఈ కృష్ణ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నా పని సులభం అవుతుంది అని అనుకుంటుంది మనసులో, పక్కనే ఉన్న మధు అదేంటి మురారి ఇంట్లో ఈ కోపాలు కొన్ని రోజులు ఉంటాయి తర్వాత మామూలు రోజులు వస్తాయి అని చెప్పావు ఇప్పుడేంటి ఆ మాటలను ఏమయ్యాయి అని అడుగుతాడు

Krishna Mukunda Murari Today Episode April 8 2024 Episode 439 highlights
Krishna Mukunda Murari Today Episode April 8 2024 Episode 439 highlights

ఇక రేవతి మురారి కి నచ్చే చెప్పాలని చూస్తూ ఉంటుంది అయినా ఆదర్శ్ గురించి నీకు తెలిసిందే కదా వాడి మనసు నీకు తెలుసు వాడిన పరిస్థితుల్లో అలా మాట్లాడుతున్నాడు కానీ నువ్వంటే ఎంత అభిమానం నీకు తెలియదా అవన్నీ తెలుసుకోడా ఇప్పుడేంటి మురారి అని అడుగుతుంది. నాకు వాడి ఏదో అన్నాడని బాధ లేదమ్మా నన్ను అర్థం చేసుకోవట్లేదని నా బాధ అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని అంటాడు మరి ఇక అందరూ ఉంటారు కానీ అక్కడ భవాని దేవి మాత్రం ఉండదు. మురారి రేవతితో లేదా మా తను నావల్ల బాధపడడం నేను చూడలేకపోతున్నాను నేను ఇక్కడ ఉంటే ఆదర్శం కా బాధపడతాడు నాకు అది ఇష్టం లేదు అందుకే వెళ్ళిపోతున్నాను అని అంటాడు ఇక పక్కనే ఉన్న సుమలత ఆదర్శవల్ల నువ్వు నీకు బాధ కలిగింది కానీ నీవల్ల ఆదర్శ్ కి బాధపడగలిగింది రా అని అడుగుతుంది. మేము కళ్ళేదురుగ్గా ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాడు కనపడితే కసురుకుంటున్నాడు అది కూడా ఒకరకంగా బాధపడమే కదా చిన్న అత్తయ్య అని అంటుంది కృష్ణ. ఇక మధు మీరిద్దరూ పిచ్చి ఆలోచన చేయకుండా లోపలికి వెళ్ళండి అని అయినా పెద్ద పెద్దమ్మ లేకుండా ఏంటి ఇదంతా అని పెద్ద పెద్దమ్మ అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న కృష్ణ పెద్దంగా రావద్దు అని మధుని సైలెంట్ గా ఉండమని అంటుంది. మురారి అక్కడే ఉన్న ఆదర్శవైపు చూస్తూ నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేని వాడికి నువ్వు కూడా ఇంట్లో ఉండటం ఎలా ఇష్టం ఉంటుంది అమ్మ అందుకే నువ్వు కూడా మాతోపాటు చేసే అని అంటాడు ఆ మాటలుకి రేవతి షాక్ అవుతుంది ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇక మురారి ఆదర్శ వైపు చూస్తాడు ఆదర్శ లో ఏం చలనం ఉండదు. అలానే సోఫాలో కూర్చొని వీళ్ళందరూ మాట్లాడుకునేది వింటూ ఉంటాడు ఇక మురారి చూశావా అమ్మ నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు వాడు మాట్లాడలేదు నువ్వు ఉన్న తీసుకొని వెళ్తాను అన్నప్పుడు కూడా వాడే మాట్లాడట్లేదు ఇంకా అలాంటప్పుడు మనం ఎందుకు ఇక్కడ ఉండడం అని అంటాడు.

Krishna Mukunda Murari Today Episode April 8 2024 Episode 439 highlights
Krishna Mukunda Murari Today Episode April 8 2024 Episode 439 highlights

ఇక పక్కనే ఉన్న సుమలత ఆదర్శ వైపు చూస్తూ ఏంట్రా సైలెంట్ గా ఉంటావు. పెద్దమ్మ వెళ్ళిపోతాను అంటుంటే ఆపవేంటి అని అంటుంది.వాడికే వెళ్ళకుండా ఆపాలనుకుంటే నేను మా అమ్మని తీసుకెళ్తానన్నప్పుడే నువ్వు ఎవరివిరా మా పిన్నిని తీసుకెళ్లడానికి అని నా చెంపలు వాయించేవాడు అలాంటిది సైలెంట్ గా ఉన్నాడంటే వాడికి ఇక్కడ ఉండడం మేము ఇష్టం లేదు అని అంటాడు మురారి.మనం ఇంట్లో ఉండడం ఆదర్శకి ఇష్టం లేదు అత్తయ్య మనం ఇక నుంచి వెళ్ళిపోదాం పదండి అని అంటుంది కృష్ణ.ముకుంద టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంట్లో నుంచి ఎక్కడ కృష్ణా మురారి ఇద్దరూ బయటికి వెళ్లిపోతారు అని, సుమలత మీరు ఇంట్లో నుంచి వెళ్లడానికి వీల్లేదు నేను ఆదర్శ్ తో మాట్లాడుతాను ఒక రెండు నిమిషాలు వెయిట్ చేయండి అని ఆదర్శ్ దగ్గరికి వెళ్లి అరే వాళ్ళు వెళ్లిపోతున్నారు నువ్వే వాళ్ళని ఆపాలి నువ్వు చెప్తే కానీ వాళ్ళు వినరు ఇంకెవరు చెప్పినా వాళ్ళు ఆగేలా లేరు నువ్వు ఒకసారి లే ఆదర్శ్ వాళ్ళు నాకు ఆపు అని బతిమిలాడుతూ ఉంటుంది సుమలత ఇక కృష్ణ ఎవరిని బతిమిలాడాల్సిన అవసరం లేదు పిన్ని అని అంటాడు ఇక దాంతో సైలెంట్ గా పక్కకు వచ్చేస్తుంది సుమలత ఇక మీరా నువ్వు నా ప్రాణాలు కాపాడావు నేను ఇంట్లోకి రావడానికి కారణం అయ్యావు ఆ రోజే ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను కాకపోతే ఇప్పుడు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంతే అని మురారి మీరాతో మాట్లాడుతూ ఉంటాడు. కృష్ణ కూడా మీరాకీ థాంక్స్ చెప్తుంది ఏసీపీ సార్ ప్రాణాలు కాపాడినందుకు నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను అని చెప్తుంది నేను ఎంతో కష్టపడిన అంతా చేసింది మీరు ఇంట్లో ఉండడానికి అలాంటి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటే నేను ఇదంతా చేసి లాభం అని ముకుంద కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక మురారి అమ్మ మనం వెళ్దామా అని అంటాడు ఇక రేవతి కూడా వాళ్లతో పాటు బయలుదేరుతుంది ముగ్గురు కలిసి వెళ్తూ ఉండగా ఇంట్లో అందరూ ఆపుతారు కానీ వాళ్ళు మాత్రం కాకుండా గడప దాటుతారు గడప దాటి బయటికి వచ్చేసరికి ఎదురుగా భవాని దేవిని ఉంటుంది. భవానీ దేవి బాధగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది ఇక కృష్ణ మురారి ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు.

Krishna Mukunda Murari Today Episode April 8 2024 Episode 439 highlights
Krishna Mukunda Murari Today Episode April 8 2024 Episode 439 highlights

ఇక భవానీ దేవి దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. దానికి ఎవరు సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటారు మీ అమ్మని ఇక్కడికి రా తీసుకెళ్తున్నావు అని మురారిని అడుగుతుంది మురారి ఏమి మాట్లాడకుండా ఉంటాడు ఇక కృష్ణ అయితే చాలా భయపడుతూ ఉంటుంది. ఎవరు ఏం మాట్లాడారు ఏంటి అని అంటే అక్కడే ఉన్న మీరా నేను చెప్తానండి వీళ్ళు ఇంట్లో నుంచి ఎవరో ఏదో అన్నారని వెళ్లిపోవాలనుకుంటున్నారు అని అంటుంది అసలు ఏం చెప్పి వీళ్ళని ఆపాల అని అనుకుంటున్నాను అని అంటూ ఉండగా ఇంకా ఆపు అన్నట్టుగా భవాని దేవి చేయి చూపిస్తుంది ఇక మీరా సైలెంట్ అయిపోతుంది ఎక్కడికి వెళ్తున్నారు మురారి అని అడుగుతుంది భవానీ దేవి. ఆదర్శ అప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను సైలెంట్ గా ఉన్నాను కదా అని నువ్వు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నావా అని అంటుంది. అప్పుడే అక్కడికి ఆదర్శ్ లోపల నుండి బయటికి వస్తాడు ఆదర్శం చూసి భవానీ దేవి మీకు ఎవరైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పారు వాళ్లు దానికి కారణం చెప్పమను అప్పుడు నేనే నిర్ణయిస్తాను మీరు ఇంట్లోకెళ్లాలా బయటకు వెళ్లాలని అంటుంది. అక్కడే ఉన్న ముకుంద టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు కనుక నేను ఆదర్శ తో మాట్లాడటం వల్లే వీళ్ళు వెళ్లి వెళ్ళిపోతున్నట్లు భవానీ దేవికి అర్థం అయితే ఆ మాట ఆదర్శ కనుక చెప్పాడంటే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తుంది. ఆదర్శ ఏం చెప్తాడు అని ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడే ఉన్న కృష్ణ క్షమించండి అత్తయ్య నేను మీకు చెప్పకుండా బయలుదేరడం నేను చేసిన తప్పే కానీ మేము ఆగటం కూడా మంచిది కాదు వెళ్తాము అని అంటుంది. ఆ మాటలకు భవానీ దేవి కోపంగా నేను మీరెందుకు వెళ్తున్నారని అడగలేదే మిమ్మల్ని వెళ్లిపోమన్న వాళ్ళని అడుగు గురించి మాట్లాడుతున్నాను అని అంటుంది. ఆదర్శవైపు చూస్తూ ఒకే ఒక కారణం చెప్పు వీళ్ళు ఇక్కడ ఉండకుండా బయటికి వెళ్ళడానికి అని అంటుంది. ఆదర్శ ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా కృష్ణా చేతిలో ఉన్న బ్యాక్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. దాంతో అక్కడున్న వాళ్ళందరికీ ఆదర్శ్ వాళ్ళు ఇక్కడే ఉండడం ఇష్టమే అని చెప్పినట్లుగా అర్థమవుతుంది ఇక అయిపోయింది కదా ఇక లోపలికి వెళ్ళండి అని అంటుంది భవానీ దేవి. ఇక అందరూ అక్కడే సైలెంట్ గా ఉంటారు భవానీ దేవి కోపంగా మీకే చెప్తుంది లోపలికి వెళ్ళండి అని అంటుంది. అందరి లోపలికి వెళ్తారు ముకుంద మాత్రం మనసులో ఇప్పటికైతే మురారి బయటికి వెళ్లకుండా ఉన్నాడు అది చాలు అయినా ఈ సార్ నుండి ఆదష్ట మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి తను నేను చెప్పిన మాట మాత్రమే వినేటట్లు తనని నా గుప్పిట్లో పెట్టుకోవాలి అని అనుకుంటుంది.

ఇక కృష్ణ రూంలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన ముకుందా రూమ్ బయట నిలబడి ఈ కృష్ణ నీ రూమ్ లో నుంచి బయటికి పంపిస్తేనే కదా నేను మురారి భార్యగా ఈ రూమ్ లోకి వెళ్ళేది అని అనుకుంటుంది. ముకుందా అక్కడే ఆగిపోయావే లోపలికి రా అని అంటుంది కృష్ణ. లోపలికి వద్దాం అనుకున్నాను నువ్వేదో ఆలోచనలో ఉన్నావని ఆగిపోయాను అని అంటుంది ముకుందా నేనేం ఆలోచిస్తాను నేను ఆలోచించే అంత పెద్ద విషయాలు ఏమీ లేవు కాకపోతే ఇంట్లో జరుగుతున్న వాటి గురించి అని అంటుంది. మీరు ఆదర్శమైన మాటలు గురించి ఎక్కువగా ఆలోచించొద్దు కానీ ఇవాళ కాకపోతే రేపైనా మారతాడు అని అంటుంది ముకుంద ఆ మాటలకు కృష్ణ ఎన్ని రోజులు అనేది ఎదురు చూడాలి అయినా ఆగస్టులో మార్పు వస్తుందని నేను అనుకోవట్లేదు నా గురించి నేను బాధపడట్లేదు ఏసీపి సార్ గురించే బాధపడుతున్నాను అని అంటుంది. అందుకే కదా కృష్ణ ఆదర్శ్ మనసులో మురారి మీద మంచి ఒపీనియన్ కడిగేలాగా నీ మీద చెడ్డ ఒపీనియన్ కలిగేలా మాట్లాడుతున్నాను ఎప్పటికైనా ఆదర్శ్ కి బద్ధ శత్రువుగా నిన్ను మార్చి తీరుతాను అని అనుకుంటుంది ముకుందా మనసులు లో, కానీ కృష్ణ తో మాత్రం నీ మనసులో అవేం పెట్టుకోవద్దు కృష్ణ ఆదర్శం మారుతాడు నువ్వు ఈ లోపు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమీ చేయొద్దు ఇంట్లోనే ఉండాలి ఈ మాట మురారితో కూడా చెప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

రేపటి ఎపిసోడ్ లో హోలీ పండుగ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. కృష్ణ మురారి ఇద్దరు సరదాగా ఆడుతూ ఉంటారు. ఇక ముకుంద మాత్రం చాలా కోపంగా సీరియస్ గా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది ఇక అనుకోకుండా మురారి ముకుంద పైన హోలీ రంగులు చల్లుతాడు. దాంతో ముకుంద హ్యాపీగా ఫీల్ అవుతుంది వెంటనే మురారి దగ్గరికి వెళ్లి మురారి మీద ప్రేమగా రంగులు చల్లుతూ, మురారి రెండు చెంపలు పట్టుకుంటుంది. అది చూసి కృష్ణ షాక్ అవుతుంది.

Related posts

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella