NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మహాసేన రాజేష్ ఈ నెల 16న టీడీపీలో చేరిక.. జనసేన పార్టీ శ్రేణులకు నాగబాబు కీలక సూచన.. ఏమిటంటే..?

దళిత వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన మహాసేన రాజేష్ ఈ నెల 16న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా పెద్దాపురంలో జరిగే కార్యక్రమంలో చంద్రబాబు సమక్షంలో రాజేష్ టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. అయితే మహాసేన రాజేష్ తొలుత జనసేన పార్టీలో చేరతారని భావించారు. అధికార వైసీపీకి వ్యతిరేకంగా, జనసేన, టీడీపీకి అనుకూలంగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మహాసేన రాజేష్ గళం విప్పుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా మహాసేన రాజేష్ టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

Nagababu

 

మహాసేన రాజేష్ టీడీపీలో చేరడంపై పలువురు జనసేన శ్రేణులు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆయనను వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రాజేష్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పాలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మహాసేన రాజేష్ గురించి జనసైనికులు ఎవరూ తప్పుగా మాట్లాడవద్దని సూచించారు. అతను ఏ పార్టీలో చేరాలనుకున్నారనేది అతని ఇష్టమనీ, అది తన ప్రజాస్వామ్య హక్కు అని నాగబాబు స్పష్టం చేశారు. అతని నిర్ణయం ఎలాంటిదైనా గౌరవించాలన్నారు. అతనికి శుభాకాంక్షలు తెలపాలని నాగబాబు సూచించారు.

Mahasena Rajesh

 

2019 ఎన్నికలకు ముందు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన మహాసేన రాజేష్.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరైన గుర్తింపు గౌరవం లభించకపోవడంతో ఆ పార్టీకి వ్యతిరేకంగా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తన యూట్యూట్ ఛానల్ ద్వారా ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. గతంలో జనసేనకు అనుకూలంగా వ్యవహరిస్తూ కామెంట్స్ చేయడంతో ఆ పార్టీలో చేరతారని భావించారు. అయితే అక్కడి స్థానిక పరిస్థితుల నేపథ్యంలో పార్టీ అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ రాకపోవడమో లేక ఇతరరత్రా కారణాలు ఏమి ఉన్నాయో తెలియదు కానీ టీడీపీ చేరడానికి నిర్ణయాన్ని ప్రకటించారు. రీసెంట్ గా చంద్రబాబును కలిసి మాట్లాడినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది.

గవర్నర్ గా న్యాయకోవిదుడు నియామకంతో ఇక ఏపీ సీఎం జగన్ కు తలనొప్పులు తప్పవా..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju