NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: సీఎం జగన్ నివాసానికి కేఏ పాల్ .. కలవడానికి కుదరకపోవడంతో ఏమన్నారంటే..?

YS Jagan: ఒక నాటి ప్రముఖ సువార్తకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మంగళవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసేందుకు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అయితే ముందుగా అనుమతి తీసుకోకపోవడంతో కేఏ పాల్ ను కార్యాలయంలోకి వెళ్లేందుకు పోలీసులు అంగీకరించలేదు. దీంతో కొద్ది సేపు ఎదురుచూసిన కేఏ పాల్ అక్కడి నుండి వెనుతిరిగారు.

ప్రజా సమస్యలపై చర్చించి వచ్చే ఎన్నికల్లో కలిసి పని చేద్దామని చెప్పేందుకు వచ్చానని అన్నారు కేఏ పాల్. మంగళ, బుధవారం విజయవాడలోనే ఉండి వేచి చూస్తానని చెప్పారు. ఎంతో మంది దేశాధినేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం అడగ్గానే అపాయింట్ మెంట్ ఇచ్చారని, రీసెంట్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసినట్లుగా చెప్పుకొచ్చారు. తనను కలిసేందుకు అవకాశం ఇస్తే దీవిస్తానని అన్నారు. తనను తిరస్కరిస్తే భగవంతుడిని తిరస్కరించినట్లేనని వ్యాఖ్యానించారు.

YS Jagan

తనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే జగన్ కూడా మాజీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు కేఏ పాల్. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తారో, 75 సీట్లు గెలుస్తారో, 25 సీట్లు గెలుస్తారో తనకు తెలియదన్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేస్తూ డిపాజిట్ కూడా దక్కించుకోని కేఏ పాల్ .. తరచు ప్రముఖుల పేర్లు చెబుతూ, హాస్యాస్పద కామెంట్స్ చేస్తూ  పొలిటికల్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. సీఎం జగన్ ను ఇప్పటి వరకు కలవలేదని, ఇప్పుడు కలవడానికి వచ్చానని చెప్పుకున్నారు.

గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. అటు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనా పలు మార్లు సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఇటువంటి కేఏ పాల్ కు సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి.  ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్..ఇన్ చార్జిలు, సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పులు చేర్పులపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. నిత్యం పలు జిల్లాల ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడుతున్నారు. ఈ తరుణంలో కేఏ పాల్ కు అవకాశం ఇస్తారో లేదో మరి.

YSRCP: రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు చేసిన వైసీపీ

Related posts

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?