NewsOrbit
Politics ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనపై ఎంపీ మార్గాన్ని భరత్ సెటైర్లు..!!

Share

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల రెండు రోజులపాటు ఢిల్లీ పర్యటన చేపట్టడం తెలిసిందే. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. బీజేపీ పార్టీకి చెందిన కీలక నాయకులతో సమావేశం అయ్యారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా..బీజేపీ జనసేన కలసి పోరాడబోతున్నట్లు స్పష్టం చేశారు. పరిస్థితి ఇలా ఉంటే పవన్ ఢిల్లీ పర్యటనపై రాజమహేంద్రవరం ఎంపీ మార్గాన్ని భరత్ సెటైర్లు వేశారు. గురువారం ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు అజెండా మూసుకుని పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్ళాడా..? లేకపోతే వాళ్లే పిలిచారా అనే విషయం తేడాల్సి ఉంది.

MP Margani Bharat satires on Pawan Kalyan delhi tour

ఢిల్లీ పెద్దలు పవన్ కళ్యాణ్ కు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని ప్రజలు అనుకుంటున్నారు. తెలుగు ప్రజలకు గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టొద్దు అంటూ ఎంపీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో పవన్ చేసే పనులన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయి. మిత్ర ధర్మం పాటించని మిమ్మల్ని ఏ రకంగా ఢిల్లీ పెద్దలు గౌరవిస్తారు. చంద్రబాబు… పవన్ కళ్యాణ్ కి విశ్వసనీయత లేదు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ ను మిత్రపక్షంగా గెలిపించే ప్రయత్నం కూడా పవన్ చేయకపోవడం చాలా విచిత్రం. గతంలో బీజేపీ పెద్దలను ఉద్దేశించి పాచిపోయిన లడ్డూలు అని విమర్శించిన పవన్.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీ వెళ్ళాడు చెప్పాలి.

MP Margani Bharat satires on Pawan Kalyan delhi tour

రెండు రోజుల కనిపిస్తే… మూడు రోజులు కనిపించని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. చంద్రబాబుపై ప్రజలకు ఏమాత్రం నమ్మకం లేదు. రాష్ట్ర ప్రజలందరూ వైఎస్ జగన్ నాయకత్వాన్ని నమ్మి తమ భవిష్యత్తు అనుకుంటున్నారు. ఇదే నినాదంతో వచ్చే ఎన్నికలను ఎదురుకోబోతున్నట్లు ఎంపీ మార్గాన్ని భరత స్పష్టం చేశారు. డీబీటి ద్వారా నేరుగా లబ్ధిదారులకు ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది. సకాలంలో సంక్షేమ ఫలాలు అందుకుని ప్రజలు చాలా సుభిక్షంగా ఉన్నారు. రాష్ట్రంలో మహిళలకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు కాలేదు. వచ్చే ఎన్నికలలో మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవుతారు రాష్ట్ర ముఖ్యచిత్రం పూర్తిగా మారబోతుంది అని వ్యాఖ్యానించారు.


Share

Related posts

వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కేబినెట్ ర్యాంక్ తో కీలక పదవి

somaraju sharma

AP Cabinet Meeting: 2022 – 23 వార్షిక బడ్జెట్ కు ఏపి కేబినెట్ ఆమోదం.. బడ్జెట్ లో మహిళా సంక్షేమం, వ్యవసాయ, విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం.

somaraju sharma

TG Venkatesh: సీఎం కేసిఆర్ ఆ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలంటూ రాయలసీమ బీజేపీ ఎంపి కీలక వ్యాఖ్యలు

somaraju sharma