Nara Lokesh Vs Kanna Babu: కొడాలి నాని భాషలో లోకేష్ దండకం.. ఘాటుగా అందుకున్న వైసీపీ మంత్రి..!!

Share

Nara Lokesh Vs Kanna Babu: గతంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు రాజకీయాల్లో హుందాతనంతో వ్యవహరించేవారు. పదేళ్ల క్రితం వరకూ కూడా కొంత మెరుగ్గానే ఉంది. కొందరు నాయకులు ప్రత్యర్థులపై వాడే భాష విషయంలో సర్వత్రా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆ నాయకుడిలో ఎటువంటి మార్పు లేకుండా ప్రత్యర్థి నాయకుడు, ఆయన కుమారుడు, ఇతర నాయకులపై అదే గ్రాంధిక భాషలో విమర్శలు, ఆరోపణలు చేయడం చూశాం. ఇక ప్రత్యేకంగా ఆ నేత పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఆ భాష మంత్రి అన్న బిరుదు కూడా ఇచ్చేశారు కదా. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే ఆ భాషను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అందిపుచ్చుకున్నట్లు కనబడుతోంది. లోకేష్ మాట్లాడిన భాషపై మంత్రి కురసాల కన్నబాబు వెంటనే రియాక్ట్ అయి కౌంటర్ ఇచ్చారు. ఎవరు ఏమన్నారంటే..

Nara Lokesh Vs Kanna Babu comments reaction
Nara Lokesh Vs Kanna Babu comments reaction

 

తూర్పుగోదావరి జిల్లా పోలవరం నిర్వసితులను నారా లోకేష్ పరామర్శించిన తరువాత  సీఎం వైఎస్ జగన్, వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంతకు ముందు కొంత మెరుగ్గా మాట్లాడే లోకేష్..భాష ఒక్కసారిగా మారిపోయింది. పోలవరం నిర్వాసితులను జగన్ రెడ్డి జల సమాధి చేస్తున్నాడంటూ విరుచుకుపడ్డారు. ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని జగన్ రెడ్డి నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. సోమవారాన్ని పోలవారంగా మార్చి చంద్రబాబు ప్రాజెక్ట్ ని పరుగులు పెట్టిస్తే ఇప్పుడు మంగళవారం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పోలవరాన్ని చంపేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాలి కబుర్లు చెప్పి, గిరిజనుల్ని మోసం చేసిన గాలి గాడు జగన్ రెడ్డి అంటూ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని వాడు పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇస్తాడా? అని ప్రశ్నించారు. నిర్వాసితులు పరిహారం కోసం ఎదురు చూస్తుంటే వైసీపీ నాయకులు మాత్రం నిర్వాసితుల పేరుతో పరిహారాన్ని దోచుకుంటున్నారనీ. నిర్వాసితులకు దక్కాల్సిన పరిహారం వైసీపీ కుక్కలు కొట్టేసారు అంటూ విమర్శించారు. నిర్వాసితులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని బతుకుతుంటే, ఈ ముఖ్యమంత్రి సిమ్లాలో ఎంజాయ్ చేయటానికి వెళ్ళారని లోకేష్ విమర్శించారుయ ఇలా ముఖ్యమంత్రిని, వైసీపీ ఎమ్మెల్యేలను లోకేష్ నాని తరహా భాషలో మాట్లాడటంతో మంత్రి కురసాల కన్నబాబు వెంటనే రియాక్ట్ అయ్యారు.

 

లోకేష్‌ నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి కన్నబాబు హెచ్చరించారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో లోకేష్ పర్యటించడంపై ఎలాంటి అభ్యంతరం లేదనీ కానీ ఆయన తన పర్యటనలో చాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కన్నబాబు మండిపడ్డారు. ఆ మాటలు వింటుంటే అతడి ఆరోగ్యంపై అనుమానం వేస్తోందనీ, సాక్షాత్తూ గౌరవ సీఎం గారిని పట్టుకుని గాలిగాడు అని మాట్లాడుతున్నాడనీ అతడి మాటలు కొవ్వెక్కి మాట్లాడుతున్నట్లు ఉన్నాయన్నారు.  రాజకీయాల్లో విమర్శలు సహజం కానీ భాషలో విచక్షణ లేకుండా ఉండొద్దని కనీస సంస్కారం కూడా లేకుండా లోకేష్‌ మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన అమెరికాలో చదువుకున్నా కనీస సంస్కారం లేదు. తండ్రి, కొడుకు ఇద్దరూ పూర్తిగా ఫ్రస్టేషన్‌లో మునిగిపోయి, ఒళ్లు మర్చిపోయి మాట్లాడుతున్నారు. చాలా దారుణంగా, చాలా హీనమైన భాషను లోకేష్‌ మాట్లాడుతున్నాడు అని కన్నబాబు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు కేవలం కాసులు కురిపించేదిగానే చూశాడని విమర్శించారు.

“సీఎం గారిని పట్టుకుని గాలిగాడు అని మాట్లాడడం. వైసీపీ నాయకులను కుక్కలు అని సంబోధించడం ఏమిటిదంతా?. లోకేష్‌ను అలా వదిలేయకుండా ఎవరికైనా చూపించాల్సిన అవసరం ఉంది. తనకు తాను ఒక పెద్ద మాస్‌ లీడర్‌గా బిల్డప్‌ ఇవ్వాలని అనుకుని, ఎవరో రాసిచ్చిన డైలాగ్‌లు చదివి వినిపిస్తున్నారు. లోకేష్‌ నీవేమైనా మీ మామ గారు అనుకుంటున్నావా’ అని కన్నబాబు విమర్శించారు. నీ మాటలకు మేము బదులివ్వాలనుకుంటే ఇంకా మాట్లాడగలం. కానీ మాకు విచక్షణ ఉంది. సంయమనం పాటిస్తున్నాం. మా నాయకుడు కూడా అదే చెబుతున్నారు. రాజకీయ విమర్శలు చేయండి. వాటికి మేము సమాధానం చెబుతాం అని కన్నబాబు అన్నారు. నీవు మాట్లాడుతున్న భాషను ఒకసారి వీడియో వేసుకుని చూడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇక్కడ ఎవరూ చేతులు కట్టుకుని లేరు. సీఎం గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే నీవసలు బయట తిరగలేవు. గుర్తు పెట్టుకో అంటూ మంత్రి కన్నబాబు లోకేష్ ను హెచ్చరించారు.

1.YS Jagan: పార్టీ ప్రక్షాళన – ప్రభుత్వ ప్రక్షాళన..!? జగన్ మదిలో బోలెడు టార్గెట్లు..!

2.AP High Court: ఏపి ప్రభుత్వానికి హైకోర్టు మరో షాకింగ్ న్యూస్..! కీలక ఆదేశాలు జారీ..!!

3.AP Capital: రాజధానిపై బీజేపీ చాటు రాజకీయం..! దొంగాట..? దొడ్డిదారా..!?

 


Share

Related posts

ఈ సంచలన నిర్ణయాన్ని జగన్ వెనక్కి తీసుకునే పరిస్థితి వస్తుందా?

sridhar

వారి మద్దతు కోసం ఎన్నడూ లేనంత హైరానా పడుతున్న జగన్?

somaraju sharma

ఏప్రియల్ లో పుట్టారా? అయితే ఇది మీకోసమే!!

Kumar