Pawan Kalyan: ఏపి పార్లమెంట్ సభ్యులకు జనసేనాని పవన్ వినూత్న రీతిలో ఝలక్..! వారు ఏలా స్పందిస్తారో..?

Share

Pawan Kalyan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు దాదాపు 300 రోజులకుపైగా నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నా కేంద్రం మాత్రం ప్రైవేటీకరణ చేయడం ఖాయమంటూ ముందుకే వెళుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి బాసటగా నిలుస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఒక్క రోజు దీక్ష చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్న అధికార పార్టీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరినా వైసీపీ నుండి స్పంధన లభించలేదు. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు ప్లకార్డులతో నిరసన తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్రంపై వైసీపీ ఎంపీలు 22 మంది, టీడీపీ ఎంపీలు ముగ్గురు పోరాడేలా ఒత్తిడి తేవాలని నిర్ణయించిన జనసేన డిజిటల్ ఉద్యమానికి పిలుపు ఇచ్చింది.

Pawan Kalyan digital campaign on against vsp sale

 

Pawan Kalyan: రాజకీయ పార్టీలు విభేదాలు పక్కన పెట్టి ముందుకు రావాలి

ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు వీడియో సందేశం ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు జనసేన డిజిటల్ ఉద్యమాన్ని చేపట్టనుందని చెప్పారు. ఈ నెల 18,19,20 తేదీల్లో ప్రజలు విశాఖ ఉక్కు ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ట్వీట్ చేసి, వైసీపీ, టీడీపీ ఎంపీలకు ట్యాగ్ చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇలా చేసి రాష్ట్ర ఎంపీలకు బాధ్యత గుర్తు చేద్దామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ అఖిలపక్షం ఏర్పాటు చేస్తే కలిసి పోరాటం చేయడానికి జనసేన సిద్దంగా ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలు విభేదాలు పక్కన పెట్టి ముందుకు రావాలని కోరారు. జనసేనాని పిలుపుపై వైసీపీ, టీడీపీ ఎంపీలు స్పందిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

32 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

34 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago