NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP Mahanadu: టీడీపీ శ్రేణులకు బూస్ట్ .. కొందరు నేతలకు షాక్

TDP Mahanadu: ఒంగోలులో రెండు రోజుల పాటు జరిగిన మహానాడు గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో పార్టీ శ్రేణులకు బూస్ట్ ఇచ్చినట్లు అయ్యింది. అయితే ఇదే క్రమంలో పలువురు సీనియర్ నేతలకు షాక్ తప్పదు అన్నట్లు సంకేతాలు వచ్చేశాయి. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు యువతను ప్రోత్సహిస్తామని చెప్పడం, 40 శాతం యువతకే రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని చెప్పడంతో సీనియర్ నేతల ఆశలు సన్నగిల్లుతున్నాయి. దీనికి తోడు వరుసగా మూడు పర్యాయాలు ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ లను ఎన్నికల రంగం నుండి పక్కన పెట్టాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈ పరిణామం హ్యాట్రిక్ పరాజితులకు మింగుడు పడటం లేదు. మహానాడుకు అంచనాలకు అధిగమించి జనాలు రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో అధికారంపై ఆశలు చిగురిస్తున్నాయి.

TDP Mahanadu success some leaders shocked on party decision
TDP Mahanadu success some leaders shocked on party decision

TDP Mahanadu: మూడు సార్లు ఓటమి పాలైన నేతలకు షాక్

పార్టీ తీసుకున్న కీలక నిర్ణయంతో సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు లాంటి వారు పోటీ నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. టీడీపీ ఆవిర్భావం నుండి ఆరు సార్లు (డబుల్ హ్యాట్రిక్) తుని నియోజకవర్గం నుండి గెలిచిన యనమల రామకృష్ణుడు తొలి సారిగా 2009 ఎన్నికల్లో పరాజయం పాలైయ్యారు. ఆ తరువాత 2014, 2019 ఎన్నికల్లో ఆయన సోదరుడు యనమల కృష్ణుడు టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ వరుసగా మూడు సార్లు ఓడిపోయింది. అదే విధంగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుండి 1994,99 ఎన్నికల్లో టీడీపీ తరపున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ తరువాత వరుసగా నాలుగు సార్లు జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైయ్యారు. పార్టీ తీసుకున్న నిర్ణయంతో చంద్రమోహన్ రెడ్డికి పోటీ చేసే అవకాశం ఉండదు. కానీ ఆయనకే పోటీ చేయాలన్న ఉత్సాహం ఉంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కుమారుడిని రంగంలోకి దించే అవకాశం ఉంది.

 

పొత్తులతో మరి కొంత మందికి…

ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు మూడు సార్లు ఓడిపోయిన వారు ఉన్నారు. ఈ నాయకులు ఓటమి పాలు అవుతున్నా సీనియారిటీ హోదాలో పార్టీలో చక్రం తిప్పుతూనే ఉన్నారు. ప్రధానంగా పొత్తుల అంశం కూడా పలువురు టీడీపీ సీనియర్ నేతలను కలవరపెడుతోంది. 2014 ఎన్నికల్లో జనసేన మద్దతు ఉన్నప్పటికీ ఆ పార్టీ అభ్యర్ధులను పోటీకి నిలపలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే పోటీ చేసింది. ఆ రెండు ఎన్నికల్లో మొత్తం 175 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్ధులు పోటీ చేశారు. అయితే ఈ సారి జనసేనతో పొత్తు ఖాయంగా కనబడుతోంది. పార్టీ నేతలు త్యాగాలకు సిద్దం కావాలని ఇప్పటికే చంద్రబాబు సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో సుమారు 30 నుండి 40 నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతారు. పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆశలో ఉన్న నేతలకు పోటీ చేసే అవకాశం రాదని సంకేతాలు అందుతుండటంతో వారికి షాకింగ్ గా ఉంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N