NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan : మోడీ ఇరుకున ప‌డేలా జ‌గ‌న్ మాస్ట‌ర్ స్ట్రోక్ ?!

AP Special Status : Special Word for Politics

YS Jagan : ఏపీ ముఖ్య‌మంత్రి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోమారు త‌న రాజ‌కీయ చాణ‌క్యాన్ని చాటుకున్నారు. గ‌త కొద్దికాలంగా త‌న‌ను ఇరుకున పెడుతున్న అంశంలో ఏకంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీని టార్గెట్ చేశారు.

YS Jagan
YS Jagan

విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో కాక రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నారు.. ఈ తరుణంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్మిక సంఘాల నాయకులతో చర్చించిన ఆయన.. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ఒకవైపున చేయాల్సినవన్నీ చేస్తాం.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం పెడతామని తెలిపారు. త‌ద్వారా బాల్ కేంద్రం కోర్టులోకి నెట్టారు.

YS Jagan జ‌గ‌న్ భ‌లే మాట చెప్పారే…

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు చేయాల్సిందంతా చేస్తాం.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు .
కార్మికుల ఆందోళనల వల్ల ప్లాంటు మూతబడింది, ఉత్పత్తి సరిగ్గా జరగడంలేదన్న మాట అవతలివాళ్ల నుంచి రానీయకుండా చూసుకోండి అని సూచించిన ఆయన.. విరామం సమయంలో మాత్రమే ధర్నాలు, ఆందోళనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒడిశా రాష్ట్రంలో ఈ ప్లాంటుకు సొంతంగా గని కేటాయించాలని, ఆ రాష్ట్రంలో పుష్కలంగా ఇనుపఖనిజం నిల్వలు ఉన్నాయని చెప్పామని గుర్తు చేశానారు. మనం ప్రయత్నాలు చేసి ఈ గనులనుంచి ఖనిజాన్ని పొందేలా లీజులను పునరుద్ధరణ చేసుకోవాల్సిన అసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఒక సానుకూలమైన నిర్ణయం వస్తుందని గట్టిగా నేను నమ్ముతున్నానని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

పోస్కో గురించి సైతం….

వైజాగ్ స్టీల్ విష‌యంలో కీల‌క‌మైన పోస్కో పై సీఎం వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. పోస్కో వాళ్లు విశాఖ రావడానికి తీవ్రంగా యత్నిస్తున్నారన్నది సరికాదన్న సీఎం జగన్.. కృష్ణపట్నం, భావనపాడు, కడపల్లో ఎక్కడకు వచ్చినా పర్వాలేదన్నారు. పోస్కోవాళ్లు రాష్ట్రానికి రావడం వాస్తవం, త‌న‌ను కలవడం కూడా వాస్తవమేనన్న ఆయన.. కడప, కృష్ణపట్నం, భావనపాడు లాంటి చోట్ల ఫ్యాక్టరీ పెట్టమని వారిని కోరినట్టు తెలిపారు. ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడైనా పర్వాలేదని చెప్పాను.. కడప అయితే బాగుంటుందని కూడా వారికి చెప్పానని వెల్లడించారు. నిన్నకూడా వాళ్లు కృష్ణపట్నం వెళ్లారని.. కృష్ణపట్నం, భావనపాడుల్లో పెట్టేందుకు సీరియస్‌గా ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు.

author avatar
sridhar

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju