Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గేమ్ చివరికి వచ్చేసింది. ఈ క్రమంలో 14వ వారం నామినేషన్ లో ఉన్న సభ్యులు ఎవరంటే.. రేవంత్, ఇనయా, శ్రీ సత్య, రోహిత్, ఆదిరెడ్డి, కీర్తి. టికెట్టు ఫినాలే గెలుచుకున్న శ్రీ హన్ మినహా అందరూ నామినేషన్ లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు టాప్ ఫైవ్ కి చేరుతారో చూడాలి. ఇంకా రెండు వారాల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో… ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండొచ్చని ఆడియన్స్ అంచనా వేస్తున్నారు. సోమవారమే ఓటింగ్ పోల్స్ ఓపెన్ కావటంతో… యధావిధిగా రేవంత్ కి భారీగా ఓట్లు పడుతున్నాయి. రేవంత్ తర్వాత ఇనాయా, రోహిత్, ఆదిరెడ్డి ..ఈ రీతిగా ఓట్లు రాబడుతున్నారు.
మిగతావాళ్లు డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఫైనల్ సీజన్ కి వచ్చేసరికి.. ఆడియన్స్ ఓటింగ్ ఉంటది. అయితే ఈసారి ఆడియన్స్ ని … కంటెస్టెంట్లు ఓట్లు అడగకపోవడం పట్ల బయట జనాలు మండిపడుతున్నారు. ఈ సీజన్ ఫ్లాప్ అవడానికి ఇది కూడా ఒక కారణం అని అంటున్నారు. ఇంకా రెండు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. దీంతో హౌస్ లో ఉన్న తమ ఫేవరెట్ కంటెస్టెంట్లను గెలిపించుకోవడానికి బయట.. భారీగా ఓట్లు పడుతున్నాయి. ఈసారి టైటిల్ రేవంత్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు బయట గట్టిగా ప్రచారం జరుగుతుంది.
ఎందుకంటే ఇండియన్ ఐడిల్ గెలిచిన క్రేజ్.. సింగర్ కావడంతో బయట మంచి ఫ్యాన్ బెస్ ఉండటంతో… 90 శాతం రేవంత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బయట టాక్. తెలుగు బిగ్ బాస్ హౌస్ లో… చాలా వర్క్ సింగర్స్ హవా నడిచింది. స్టార్టింగ్ సీజన్ లో గీతా మాధురి… రాణించగా తర్వాత మూడో సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ కొట్టాడు. ఇక ఐదో సీజన్ కి వచ్చేసరికి శ్రీరామచంద్ర టాప్ ఫైవ్ లో ఉన్నాడు. ఆరో సీజన్ లో రేవంత్ గెలిచే అవకాశాలున్నట్టు జనాలు భావిస్తున్నారు.