NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

రైతులు vs హై కమాండ్ – మధ్యలో ఇరుక్కుపోయిన పవన్ కల్యాణ్ !

మొత్తానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు అందరూ ఎప్పట్నుంచో అనుకుంటున్న గడ్డు పరిస్థితి రానే వచ్చింది. గవర్నర్ ఆమోదముద్ర వేసిన ఏపీ మూడు రాజధానులు బిల్లు విషయంలో అమరావతి రైతులు తీవ్రంగా నష్టపోయిన ఉన్న విషయం తెలిసిందే.

అయితే మొదటి నుండి రాజధాని రైతుల వైపు గళం విప్పుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు బిజెపితో పొత్తు కారణంగా ముందు ఉన్నంత దూకుడుగా ఉండలేక పోతున్నాడు అన్నది వాస్తవం.మరి ఇటువంటి సమయంలో పవన్ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్న విషయంపై ఒకసారి గమనిస్తే….

ఈ చేతకానితనం ఇప్పటిది కాదు..

గతంలో పవన్ దీక్ష శిబిరంలో రైతులకు రాజధానిని కాపాడటం కోసమే తన పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుందని చెప్పాడు. ముందు రాజధాని రైతులకు మద్దతుగా భారీ పోరాటాలకు ప్రణాళికలు వేసిన జనసేన అటు బిజెపి ఈ విషయం అధికార పార్టీ చేతిలోని విషయమని… రాష్ట్ర పరిధిలో ఉన్న వాటిపై తాము జోక్యం చేసుకోమని ప్రకటించడంతో కొద్దిగా వెనక్కి తగ్గింది. చివరికి భారతీయ జనతా పార్టీ తమ అమరావతికి కట్టుబడి ఉన్నామని రాష్ట్రస్థాయిలో తీర్మానం చేసింది కానీ దీని కేంద్రం పట్టించుకోదని చెప్పడంతో వారంతా పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు అని అర్థం అయినా కూడా జనసేన ఏమి చేయలేని పరిస్థితి అయితే. ఇక్కడే అందరి చూపు జనసేన వైపు మళ్ళింది.

దీనికీ ముందుకు రాకపోతే ఎలా?

ఇక ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు బిల్లును పంతం కొద్దీ ఎంతో చాకచక్యంగా గవర్నర్ వద్ద ఆమోద ముద్ర వేయించుకున్నారు. ఇలాంటి సమయంలో పవన్ తన గొంతు లేవనెత్తి కనీసం అమరావతి రైతులకు సరైన న్యాయం చేకూర్చే వరకు లేడా… వారికి ఏదో ఒక హామీ ఇచ్చే వరకు ఈ విషయాన్ని లాగలేదు.

అంతా రాజ్యాంగబద్ధంగా సాగింది కాబట్టి నష్టపోయిన రైతులకు ప్రతిఫలం చెల్లించాల్సింది, పరిహారం ఇవాల్సింది ప్రభుత్వమే కాబట్టి పవన్ కనీసం ఆ వైపు నుండి పోరాటం కూడా తీవ్రస్థాయిలో చేయకపోవడం ఇప్పుడు అందరినీ అతని లోని నాయకత్వ లక్షాణాలను ప్రశ్నించేలా చేసింది.

అన్న తరహా రాజకీయాలేల…?

గతంలో తెలంగాణ ఉద్యమం పీక్స్ లో ఉన్నప్పుడు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. రాష్ట్ర విభజన చేయకుండా హామీ పొంది చిరంజీవి ఇలా చేశారని అంటుంటారు. ఎందుకంటే అప్పటికి పిఆర్పి సమైక్యాంధ్ర నినాదమే తీసుకుంది. ఇప్పుడు అమరావతి విషయంలో పవన్ కూడా బిజెపితో వారు అలాంటి నిర్ణయం తీసుకునా కామ్ గా ఉన్నారు.

మూడు రాజధానులు బీజేపీ అడ్డుకోకపోగా… సహకరించిందని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. రేపు మోడీ విశాఖ అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా అఫీషియల్ గా ప్రకటించడం జరిగిన తరువాత వచ్చి అక్కడ శంకుస్థాపన చేస్తే పవన్ తన ముఖం రాష్ట్రంలో ఎవరికి చూపించుకుంటారో అతనికి, అతని పార్టీ నేతలకు మరియు జనసైనికుల కే తెలియాలి.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?