Laahe Laahe Song : శాస్త్రి సాహసం చేసావోయ్..! “లాహే లాహే”తో రామజోగయ్య మరో మెట్టు..!!

Laahe Laahe Song : Ramajogayya Sasthri Most Risky Song
Share

Laahe Laahe Song : “మంగళ గౌరీ మల్లెలు కోయడం.. శివుడి మేడలో నాగుల దండ ఆయన ఒంట్లో వేడికి ఎగిరిపడడం.. అమ్మవారి పిలుపుకి శివయ్య అత్తరు సెగలై విలవిలలాడడం. ఇక్కడ కూడా ఆ భైరగేశం ఏమిటి..? అంటూ అమ్మ కసురుకోవడం.., ఆయన గడ్డం పట్టుకుని బతిమాలాడడం..!” ఈ సందర్భాన్ని.., ఈ సన్నివేశాన్ని.. ఎవ్వరు, ఎక్కడ పద ప్రయోగం చేసినా సంఘాలు తప్పు పడతాయి. భక్తజనం తిరగబడతారు.. కచ్చితంగా వివాదానికి కేంద్ర బిందువుగా మారుతుంది..! మొన్న విడుదలైన “ఆచార్య” సినిమా లాహే లాహే పాట అంతరార్దంలో భాగం ఇది. రామజోగయ్య శాస్త్రి ఓ సాహసం చేశారు భార్య భర్తల ఏకాంత సమయాన్ని… ఆలుమగల అలకలను గౌరీ- శంకరుల మధ్య పోలుస్తూ.. వారి బంధంతో ముడి పెట్టి పాటని రాసి పడేసారు. ఆ పాట ఇప్పుడు యూట్యూబ్ ని ఊపేస్తోంది..!!

Laahe Laahe Song : Ramajogayya Sasthri Most Risky Song
Laahe Laahe Song : Ramajogayya Sasthri Most Risky Song

Laahe Laahe Song : సున్నితమైన అంశాన్ని… చక్కనైన పదాలతో..!!

శృంగారం అన్నా.., ఆ చర్చ అన్నా తెలుగు లోకం అంగీకరించదు. బయట మాత్రం వద్దు. లోలోపల నువ్వు ఎన్నైనా రాసుకో, చేసుకో.. అంటూ చీకటి సలహాలిస్తుంది.. అటువంటి తెలుగునాట కొలిచే దేవుళ్ళ మధ్య సున్నితమైన అంశాన్ని రామజోగయ్య శాస్త్రి పాటగా రాశారు. అందులో కఠినమైన భావజాలాన్ని సింపుల్ గా పదసృష్టితో ఇరికించారు. శ్రోతలను ఒప్పించారు. భక్తులు విన్నా.. అంగీకరించేలా రాయగలిగారు. “అక్కడ అయ్యవారి (శివుడి) అవతారాన్ని అమ్మ (పార్వతి) తప్పు పట్టిందని.., అయ్యవారు గడ్డం పట్టుకుని బతిమాలాడితే.. ఒకటో జామున విరహం, రెండో జామున విరసం.. మూడో జామున సరసం కుదరడం.. ఒంటిన విభూది, మెడలో నాగులు.., అన్ని దీనిలో చేర్చి జోగయ్య చేసిన సాహసంలో మార్కులు కొట్టేశారు. ఎక్కడా శృతి మించకుండా… శివపార్వతులు కూడా సాధారణ భార్యాభర్తలే.. వారి మధ్య కూడా విరహాలు, విరసాలు, అలకలు, కోపాలు, సరసాలు ఉంటాయి… శివుడే బతిమాలాడుకున్నాడు.. మనమూ అంతే.. అనే అంతరార్ధాన్ని తనదైన శైలిలో భావుకతతో వివరించగలిగారు. కచ్చితంగా ఈ పాట క్రెడిట్ శాస్త్రికి సింహభాగం దక్కుతుంది.

Laahe Laahe Song : Ramajogayya Sasthri Most Risky Song
Laahe Laahe Song : Ramajogayya Sasthri Most Risky Song

యూట్యూబ్ ని షేక్ చేస్తుంది..!!

ఆ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో షేక్ చేస్తుంది. టాప్ 2 ట్రేండింగ్ లో ఉంది. పాట విడుదలైన మూడు రోజుల్లోనే కోటి వ్యూస్ కి దగ్గర్లో ఉంది. మణిశర్మ మ్యూజిక్ కూడా పాటకి ప్లస్ గా నిలవగా.. చిరంజీవి స్టెప్పులు అదనపు ఆకర్షణ. మొత్తానికి “ఒక మాజీ నక్సలైట్ కథాంశంతో తీస్తున్న ఈ సినిమాలో.. ఈ తరహా పాట ఏమిటి..? ఏ సందర్భంలో వస్తుంది..!? అంటూ కొన్ని కొత్త అనుమానాలకు కొరటాల శివ సమాధానం ఇవ్వాల్సి ఉంది. విన్న వారే మళ్ళీ మళ్ళీ వింటుండడంతో మరో నెల రోజుల్లో 10 కోట్లు వ్యూస్ సొంతం చేసుకోవడం ఈ పాటకి పెద్ద కష్టమేమి కాదు.


Share

Related posts

Today Gold Rate : ఈరోజు బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అలర్ట్.!! ఈరోజు బంగారం, వెండి ధరలు..!

bharani jella

Tamilnadu : సీఎం పలనిస్వామి సూపర్ రాజకీయం..! పీకేకి కూడా లేని ఐడియాలతో స్టాలిన్ కి వణుకు..!!

Srinivas Manem

Ys Sharmila : షర్మిల పొలిటికల్ గేమ్ ప్లాన్ ఎవరివైపు.. ఎటువైపు..?

Muraliak