NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

Roja Rajani: ఆ ఇద్దరికీ మంత్రి పదవి లేనట్టే ..!? రోజా, రజనిలకు మంత్రి యోగం లేదు..!

Roja Rajani: ముఖ్యమంత్రి వైెఎస్ జగన్మోహనరెడ్డి మంత్రివర్గ ప్రక్షాళనకు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 11వ తేదీ నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో నూతన మంత్రుల జాబితాను దాదాపు సిద్దం చేసినా అని వార్యమైన చిన్న చిన్న మార్పులు, చేర్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొందరు సీనియర్ మంత్రులను పక్కన బెట్టడంతో వారు అసంతృప్తితో ఉండటం, అసమ్మతి రగుల్చుతుండటం, కాస్త అసహనం వ్యక్తం చేయడం, అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తుండటం, కొంత మంది ఎమ్మెల్యేలతో చర్చలు నిర్వహించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చర్యలు పార్టీకి నష్టం జరుగుతుందని భావంచిన సీఎం జగన్ కాస్త తగ్గి మంత్రివర్గం నుండి పక్కన బెట్టాలనుకున్న కొందరు సీనియర్ లను మళ్లీ మంత్రివర్గంలోనే ఉంచుతున్నారు. తొలుత నలుగురు సీనియర్ లను కొనసాగించాలని భావించారు. ఆ తరువాత ఆరుగురు, చివరకు పది మంది సీనియర్ లను కొనసాగించాలని నిర్ణయానికి వచ్చారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Roja Rajani no chance in new cabinet ?
Roja Rajani no chance in new cabinet

Roja Rajani: విడతల రజని పేరును ఫైనల్ చేసినా..మళ్లీ హోల్డ్ లో

అయితే గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడతల రజని, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాలో మంత్రి పదవులపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. విడతల రజని విషయానికి వచ్చే సరికి ఆమె బీసీ మహిళ, విద్యావంతురాలు. సామాజిక చైతన్యం ఉన్న చిలకలూరిపేట నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఓ సీనియర్ నాయకుడిని ఓడించి వైసీపీలో ఓ బ్రాండ్ ఇమేజ్ (గుర్తింపు) తెచ్చుకున్నారు. సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. తను బీసీ మహిళ, తన భర్త కాపు సామాజికవర్గం కాబట్టి రెండింటి కోటాలో మంత్రిపదవిని ఆశిస్తున్నారు. మంత్రి పదవి కోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయినప్పటికీ ఆమె ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనబడటం లేదు. ఈ జిల్లా నుండి సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మరో పక్క నంబూరి శంకరరావు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు మంత్రిపదవులను ఆశిస్తున్నారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పిన్నెల్లి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.ఇలా సీనియర్ నేతలను కాదని ఎన్నికలకు ముందు చేరి మొదటి సారి ఎమ్మెల్యే అయిన విడతల రజిని మంత్రి పదవి ఇస్తే సీనియర్ లు హర్ట్ అయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి విడతల రజని పేరును ఫైనల్ చేసినప్పటికీ మళ్లీ హోల్డ్ లో పెట్టినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఆ జిల్లా నుండి వేరే వాళ్లకు మంత్రిపదవి ఇస్తున్నారని అంటున్నారు.

Roja Rajani: చిత్తూరు జిల్లా నుండి పెద్దిరెడ్డిని కొనసాగిస్తుండటంతో..

ఇక ఆర్కే రోజా విషయానికి వస్తే ఆమె కూడా మంత్రిపదవిపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఆమెకు మొదటి సారే మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారని అందరూ భావించారు. అప్పుడు అవకాశం రాకపోయే సరికి అసంతృప్తి బహిరంగంగా వ్యక్తం చేయడంతో ఏపిఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఆ తరువాత ఎమ్మెల్యేలకు రెండు పదవులు ఉండకూదన్న అభిప్రాయంతో ఆ పదవి నుండి తొలగించారు. ఇప్పుడు ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలంటే చిత్తూరు జిల్లాలో వేరే ఎవరికీ ఇవ్వకూడదు. ఒక వేళ ఇచ్చినా వేరే సామాజికవర్గం వారికి ఇవ్వాలి. కానీ ఆ జిల్లాలోని సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కొనసాగిస్తున్నారు. ఆయనను మంత్రిగా కొనసాగించాలంటే అదే సామాజికవర్గానికి చెందిన రోజాను మంత్రి వర్గంలోకి తీసుకోలేరు. ఈ కారణంగా రోజాకు ఈ సారి కూడా అవకాశం ఇవ్వడం లేదనీ, వేరే ఏదైనా కేబినెట్ ర్యాంక్ ఉండే విప్, చీఫ్ విప్ లాంటి కీలక పదవి అప్పగిస్తారని అంటున్నారు. రోజా పార్టీ ఆవిర్భావం నుండి జగన్ వెన్నంటి ఉన్నారు. పార్టీ వాయిస్ గట్టిగా వినిపిస్తూ వచ్చారు. మంత్రి పదవి ఇవ్వాల్సిన నేతే కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో రోజాకు చుక్కెదురు అవుతోంది. ఇటు ఆర్కే రోజా, అటు విడతల రజనీ ఇద్దరూ గట్టిగా ట్రై చేస్తున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో..?

 

author avatar
Srinivas Manem

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N