ఎవరు..? ఎప్పుడు..? ఎందుకు..?

Share

(తెలుగు దేశం కార్యకర్తల సంక్షేమార్థం జారీ చేయబడినది. చదివి, అర్ధం చేసుకొనుడు)

లోకేష్ కి బాధ్యతలు అప్పగించేద్దాం…! (వామ్మో…! ఆయన ఇంకా రాజకీయ ఓనమాలు దిద్దడంలోనే ఉన్నారు. ఒక రేవంత్, ఒక కెటిఆర్, ఒక హరీష్ రావు లాంటి ప్రసంగాలు రావు, కనీసం నాయకత్వ లక్షణాలు పూర్తిస్థాయిలో లేవు. పైగా ఈ వయసులోనే అనేక ఆరోపణలు, పార్టీని మోయలేడు)
బ్రాహ్మిణి ఉందిగా అండగా…! (వామ్మో మహిళ. ఈ కులతంత్ర, కుతంత్ర, బూతుల రాజకీయాల్లో నెట్టుకురాగలరా..? ఆవిడేమైనా జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి తరహాలో నరనరాన రాజకీయం నింపుకున్నారా? ఏవో నాలుగు మాటలు చెప్తారు అంతేగా.)
బాలయ్య ఉన్నాడు గా..! (ష్… ఈ మాట ఇక్కడ అంటే అన్నావు, గట్టిగా మనమాకు. ఇంకేం మాట్లాడకు గమ్మునుండిపో. అసలు కల కూడా అలా కనకు.)
నందమూరి బుడ్డోడుని పిలుద్దాం…! (హమ్మా..! ఎంత మాట పార్టీని వారి నుండి తీసుకుని మళ్ళీ
వారికే అప్పజెప్పడమా?? ఏం నారావారికి అంత లేదా? లోకేష్ నేర్చుకోలేడా?? నందమూరి నుండి అడ్డు రాకూడదనే కదా సుదీర్ఘ ముందు చూపుతో బాలయ్యతో వియ్యం పుచ్చుకున్నది)
మరి ఎవరు? ఎవరు? ఎవరు???

ఇంతకు ఈ కథనంలో చెప్పొచ్చే విషయం ఏమిటంటే…! టీడీపీలో చంద్రబాబుకి ప్రత్యామ్నాయం గురించి. బాబు వయసు ఇప్పుడు 71 . మరో నాలుగైదేళ్ళ పాటు శారీరకంగా యాక్టీవ్ గా ఉంటారేమో. కానీ మానసికంగా మాత్రం కాస్త వీక్ అయ్యారని టీడీపీ శ్రేణులే గ్రహించాయి. అందుకే ఆయన మాటలు సాగుతున్నాయి. చాదస్తం అలముకుంది, చెప్పిందే చెప్తూ నెట్టుకొస్తున్నారు. ఆయన ప్రసంగం శ్రేణులకు బోర్ కొట్టిన వాస్తవం మాత్రం కప్పిపుచ్చలేనిది. కానీ ఆయన కష్టమూ శ్రేణులను కదిలిస్తున్నా మరో ఆయన తప్ప పార్టీకి అండ కనిపించడం లేదు.

ఇప్పుడే ప్రత్యామ్నాయం ఎందుకంటే…! పార్టీ ప్రతిపక్షంలో ఉంది. చెప్పుకోదగిన స్థానాలు లేవు. ఉన్నవారు నమ్మకంగా ఉంటారని లేదు. కానీ క్షేత్రస్థాయిలో చెమటోడ్చి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. పార్టీ అంటే గుండె నిండా నింపుకున్న ధైర్యంతో పనిచేసే శ్రామికులు ఉన్నారు. వారికి అండ కావాలి. ఆర్ధికంగా, రాజకీయంగా, అధికార పక్ష వేధింపుల నుండి రక్షణగా పార్టీ పరంగా అండగా ఉండాలి. అది లేదు. (దానికి ప్రూఫ్ గా తాజాగా కళా వెంకట్రావు అధికారిక పేస్ బుక్ పేజీలో పెట్టిన పోస్టుకి వచ్చిన కామెంట్లే నిదర్శనం. చదవండి.) ఇదే మాట టీడీపీలో అది లేదని అన్ని జిల్లాల్లోనూ నాయకుల ద్వారా వినిపిస్తుంది. క్యాడర్ నైరాశ్యంలో ఉంది. దాన్ని పైకి తీసుకొచ్చి ఇప్పుడు స్థానిక ఎన్నికలకు… కాకపోయినా మరో ఏడాదిన్నర నాటికి యాక్టీవ్ చేయగలగాలి. లేకుంటే పార్టీ చిన్నాభిన్నం అయిపోతుంది. తెలంగాణ లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ కెసిఆర్ తరహాలోనే ఇక్కడ జగన్ కూడా టీడీపీని పూర్తిగా పతనం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఎదుర్కోవాలంటే బాబుకి ప్రత్యామ్నాయం అవసరమే. తక్షణమే.

పాచికలు పారట్లేదు…! నిజానికి రాజకీయాల్లో చంద్రబాబు పాచికలు భలే ఉంటాయి. అవి పారితే ప్రత్యర్ధులు గల్లంతైపోతారు. కానీ గడిచిన రెండేళ్ల తరబడి ఆయన పాచికలు పారట్లేదు. వయసు ప్రభావమో, భవిష్యత్తుపై బెంగొ… కారణం ఏదైనా ఆయన రాజకీయ అడుగులు తడబడి, పీహెచ్డీ స్థాయి నుండి ప్రాధమికబడి స్థాయికి చేరుకున్నాయి. “మొదట ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకొనవలె…? ఒప్పుకుంటివి పో.., తర్వాత హోదా కోసం ఎందుకు విభేదించవలె…? విభేదిస్తివి పో.., అప్పటికే దూసుకెళ్తున్న బిజెపితో ఎందుకు పర్సనల్ గా గోక్కోనవలె…! గోక్కోనీతివి పో, ప్రధానంగా మోడీని ఎందుకు టార్గెట్ చేసి వ్యక్తిగతంగా విమర్శించవలె…! విమర్శించితివి పో, అదే సమయాన తెలంగాణాలో కెసిఆర్ తో ఎందుకు పెట్టుకొనవలె…! పెట్టుకుంటివి పో, ఆ చచ్చిన కాంగ్రెస్ తో ఎందుకు పొత్తు కట్టవలె…! కట్టితివి పో, వారికి ఎన్నికల పైకం ఎందుకు సమకూర్చవలె, జాతీయ స్థాయిలో ఎందుకు మళ్ళీ బిల్డప్ కొట్టవలె, శత్రువులను పెంచుకొనవలె, ఎన్నికల నాటికి ఏకాకిగా మిగలవలె…! ఇదంతయూ చంద్రబాబు స్వీయ తప్పిదము కాక, మరేమిటి? తప్పిదము మానవ సహజమే.. కానీ ఈ తప్పిదము విలువ నాయకులకు చేరిందో లేదో కానీ.., కార్యకర్తలకు అభద్రత..! అశాంతి..! అసౌకర్యం..! ఆర్ధిక కష్టం..! అష్ట అరిష్టం…! అందుకే ప్రత్యామ్నాయం రావాలి. లేకుంటే సుజనా దారిలోనే టిడిపితో దశాబ్దాలు నడిచిన వారు లోకేష్ తో విసుగు చెంది పోవుదురని రాజకీయ విశ్లేషణలు గోచరించుచున్నవి. (మీకు అర్ధమయ్యిందా…?) – శ్రీనివాస్ మానెం


Share

Recent Posts

సాంగ్స్ సూప‌ర్ హిట్‌.. సినిమాలు ఫ‌ట్‌.. పాపం ఆ ఇద్ద‌రు హీరోల ప‌రిస్థితి సేమ్ టు సేమ్‌!

టాలీవుడ్‌లో టైర్-2 హీరోల లిస్ట్‌లో కొన‌సాగుతున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ స్టార్ నితిన్ ల‌కు సేమ్ టు సేమ్ ఒకే ప‌రిస్థితి ఏర్ప‌డింది. పూర్తి…

15 mins ago

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

1 hour ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

3 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

4 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago