సినిమా

Samantha: సమంత ‘యశోద’తో మరో జాక్ పాట్ కొట్టనుందా? కంటెంట్ చూస్తే మస్తుంది!

Share

Samantha: ప్రస్తుతం సమంత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. అవును.. స‌మంత ప్ర‌స్తుతం భాషాభేదం లేకుండా వ‌రుస‌పెట్టి సినిమాలు చేస్తున్న విష‌యం అందరికీ తెలిసిందే.రీసెంట్‌గా త‌మిళ చిత్రం రిలీజై సామ్ కి మంచిపేరు కూడా తెచ్చిపెట్టింది.త్వ‌రలో శాకుంత‌లం,య‌శోద చిత్రాల‌తో ప్రేక్షకులను అల‌రించ‌నుంది.ఇక యశోద గురించి మాట్లాడుకుంటే, ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతున్నట్టు కనబడుతోంది.ఈ చిత్రానికి హరిశంకర్ మరియు హరీశ్ నారాయణ అనే ఇద్దరు దర్శకులు దర్శకత్వం వహించారు.శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక క్రిష్ణ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Is Samantha Going to get another Jackpot with Yashoda
Is Samantha Going to get another Jackpot with Yashoda

Samantha: ఇదో డిఫరెంట్ జానర్!

ఈ చిత్రంలో యశోద అనే పాత్రలో సమంత కీ రోల్ పోషిస్తోంది.కీ రోల్ మాత్రమే కాదు, దీనికి కర్త, కర్మ, క్రియ అన్ని సమంత నే. ఎందుకంటే ఆమెనే ఇందులో లీడ్.ఈమెతోపాటు ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేశ్, మురళీ శర్మలు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది.ఇదొక సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.యాక్షన్స్ సీక్వెల్స్ అబ్బురపరచనున్నాయి.తొలిసారి డిఫరెంట్ జానర్ లో సమంత నటిస్తుండటంతో అభిమానులు, ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.

Is Samantha Going to get another Jackpot with Yashoda
Is Samantha Going to get another Jackpot with Yashoda

మూవీ స్టఫ్ అదిరింది!

ఇకపోతే ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్లు, సెట్ కు సంబంధించిన ఫొటోలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫ‌స్ట్ గ్లింప్స్ అదిరిపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. ఇందులో స‌మంత స్ట‌న్నింగ్ లుక్స్ చూసి ప్రేక్షకులు ఫిదా ఐయిపోతున్నారు. ఆగస్టు 12న ‘యశోద’ చిత్రాన్ని 5 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవీ మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. సామ్ వినూత్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ వైవిధ్య పాత్ర‌ల్లో న‌టిస్తూ పాన్ ఇండియాపైన కన్నేసిందని వేరే చెప్పనక్కర్లేదు.


Share

Related posts

Devatha Serial: దేవిని కలవడానికి వచ్చిన ఆదిత్యని ఘోరంగా అవమానించిన మాధవ్..రాధ ఏం చేసిందంటే.!

bharani jella

మ‌ళ్లీ ఓకే చెప్పిన లారెన్స్

Siva Prasad

‘ ఆ నలుగురు ‘ టాప్ హీరోల ఫాన్స్ వణుకుతున్నారు .. కారణం త్రివిక్రమ్ ?? 

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar