చిరకాల కోరిక తీరకుండానే…

వందకు పైగా సినిమాలకి దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ టాలీవుడ్ లోని అగ్రహీరోలందరితో సినిమాలు చేసి విజయాలు అందుకున్నాడు కానీ నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చెయ్యాలనే కోరిక మాత్రం తీరకుండానే మరణించారు. ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చిన బాలకృష్ణ-కోడి రామకృష్ణలు గతంలో ‘విక్రమసింహా’ అనే సినిమాను మొదలుపెట్టారు కానీ అనేక కారణాల వలన ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది.

ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందో కారణాలైతే ఎవరికీ తెలియదు కానీ దాదాపు అరవై శాతం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుందని మాత్రం అందరికీ తెలుసు. అద్భుతమైన కథతో తెరకెక్కిన ఆ సినిమాని ఎప్పటికైనా పూర్తి చెయ్యాలని, బాలయ్యతో మళ్లీ హిట్ కొట్టాలని కోడి రామ కృష్ణ చాలా సార్లే చెప్పారు కానీ ఇప్పుడు ఆయన తన చిరకాల కోరిక తీరకుండా కన్నుమూశారు.