సినిమా

రవితేజ మరింత కొత్తగా…

Share

ఒకప్పుడు రవితేజ మినీమమ్ గ్యారెంటీ హీరో, పెట్టిన టికెట్ డబ్బులకి గిట్టుబాటయ్యే రేంజ్ లో ఈ హీరో సినిమాలుంటాయని ప్రేక్షకులు కూడా ఫిక్సయిపోయేవారు. ఇప్పుడు వరుస ఫ్లాప్స్ తో రవితేజ సినిమా అంటేనే ప్రేక్షకులు మోహం ముడుచుకుంటున్నారు. అయితే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు ప్లాప్ అవుతున్నా రవితేజతో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు మాత్రం ఇంట్రస్ట్ చూపిస్తుస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకూ రెగ్యులర్ ఫార్మెట్‌లో సినిమాలు చేసిస మాస్ రాజా ఇక నుంచి రోటీన్‌కు భిన్నంగా సినిమాలు చేయబోతున్నాడట. ఈ క్రమంలోనే డిఫరెంట్ చిత్రాల దర్శకుడు వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ‘డిస్కో రాజా’ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి రవితేజ పుట్టిన రోజు కానుకగా టైటిల్ లోగో ని చూపిస్తూ ఒక మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు. బట్టర్ఫ్లై పైన డిజైన్ చేసిన పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఈ లోగో కింద రివైండ్, ఫాస్ట్ ఫార్వార్డ్ … కిల్ అని ఉంది. సో సింపుల్ గా పోస్టర్ తోనే ఒక కొత్త రకం రివెంజ్ సినిమాని చూడబోతున్నామే ఫీలింగ్ కలిగించారు. సైంటిఫిక్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కునున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.


Share

Related posts

Family Man 2: ఈ సిరీస్ లో సమంతా రోల్ రివిల్ చేసిన మేకర్స్..!!

bharani jella

Rashmika: ఆ స్థార్ హీరోకు భార్య కాబోతున్న‌ ర‌ష్మిక‌.. బిగ్ సీక్రెట్ లీక్‌?!

kavya N

త‌మిళ ద‌ర్శ‌కుడిపై ఆస‌క్తి

Siva Prasad

Leave a Comment