మరో 11 ఏళ్ల పాటు నేను సేఫ్ అని అంటున్నారు నేచురల్‌స్టార్ నాని. ఇంతకు ఈయన తనని తాను ఎందుకు సేఫ్ అని అనుకుంటున్నారు? అనే విషయం తెలియాలంటే మాత్రం చదవాల్సిందే. వైజాగ్ వేదికగా మంగళవారం `నాని`స్ గ్యాంగ్ లీడర్` ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో నాని మాట్లాడుతూ “పది సంవత్సరాలక్రితం వైజాగ్ అమ్మాయితో ప్రేమలో పడ్డాను. అప్పటినుండి ఇప్పటి దాకా ఈ సిటీతోలవ్లోనే ఉన్నాను. మనోళ్ల్లు పాటలకి విదేశాలకు వెళ్తుంటారు కానీ ఇంతకంటే మంచి ప్లేస్ ఎక్కడుంటుంది చెప్పండి?. ‘అష్టాచమ్మా’ కి మూడు రోజుల ముందు ప్రీమియర్ షో ఇక్కడే జరిగింది. ఎలా గడిచిందో తెలీదు కానీ నా కెరీర్ స్టార్ట్ చేసి 11 సంవత్సరాలు పూర్తి అయింది . మళ్ళీ ‘గ్యాంగ్‌లీడర్’ కి మూడు రోజుల ముందు ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. అంటే నేను ఇంకా 11 సంవత్సరాలు సేఫ్. సెప్టెంబర్ 13 నుండివైజాగ్లో ఏ థియేటర్స్‌లో టికెట్స్ దొరకకుండా చూసుకునే భాద్యత మీదే. ‘మనం’ తరువాత నేను, విక్రమ్ ఓ సినిమా చేద్దాం అనుకున్నాం అది ‘గ్యాంగ్‌లీడర్ ‘తో కుదిరింది. అలాగే మైత్రి మూవీస్ ఎంతో ఫ్యాషనేట్‌గా ఈ సినిమాను సపోర్ట్ చేసిఎంకరేజ్ చేశారు. సెప్టెంబర్ 13న వారికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
previous post
next post