అనుష్క‌, ప్రియ‌మ‌ణి పారితోష‌కంపై ప్రియ‌మ‌ణి కామెంట్స్‌


ద‌క్షిణాది హీరోయిన్‌గా రాణించిన ప్రియ‌మ‌ణి ప్ర‌స్తుతం వెబ్ సిరీస్‌లు, టీవీ షోస్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా ఇప్పుడు హీరోయిన్స్‌కి సంబంధించిన చ‌ర్చ వ‌చ్చిన‌ప్పుడు ప్రియ‌మ‌ణి త‌న‌దైన రీతిలో స్పందించారు. “ఒక‌ప్పుడు సినిమాలు చాలా పెద్ద విజ‌యాలు సాధించి అందులో హీరోయిన్స్‌కు గుర్తింపు ఉన్నా వారికి పారితోష‌కాలు పెంచేవారు కాదు. కానీ ఇప్పుడు న‌టీమ‌ణులు చాలా మారారు. త‌మ పారితోష‌కం ఎంతో తెలుసుకుని దాన్ని బ‌ట్టి పారితోషకం తీసుకుని మ‌రీ న‌టిస్తున్నారు. దీనికి న‌య‌న‌తార‌, అనుష్క‌, స‌మంత మంచి ఉదాహ‌ర‌ణ‌లు. మ‌హిళ‌లు ఇప్ప‌టికైనా త‌మ అర్హ‌త‌ను తెలుసుకుని మాట్లాడటం గొప్ప విష‌యం“ అని తెలిపారు ప్రియ‌మ‌ణి.