Samantha: తెలుగు చిత్ర పరిశ్రమలో ది బెస్ట్ కపుల్ అని పేరుతెచ్చుకున్న అక్కినేని నాగ చైతన్య మరియు సమంతలు ఇటీవల విడాకులు తీసుకోవడం మనకు తెలిసిందే. కాగా అప్పటినుండి అక్కినేని అభిమానులు సమంత మీద చాలా గుర్రుగా వున్నారు. తప్పంతా సమంతదే అన్నట్టు వారు సమంతను సోషల్ మీడియాలో వేధించిన సంగతి మనకు తెలిసినదే. అలాగే దీన్ని తప్పుబడుతూ సమంత అభిమానులు కూడా అక్కినేని అభిమానులపై విరుచుకు పడటం మనం చూసాం. అయితే కొందరు మాత్రం మధ్యస్థంగా వీరు కలిస్తే బావుంటుందని అని అనుకున్నారు.
వీరు కలవడం సాధ్యమేనా?
వీరు కలవడం మాట దేవుడెరుగు! ఇటీవల కొన్ని కారణాల చేత నాగ చైతన్య, సమంత అమ్మ నాన్నల ఇంటికి వెళ్లడం జరిగింది. దాంతో ఆ తంతు చూసిన పలు మీడియా సంస్థలు ఇలా.. ‘సమంత ఇంట్లో నాగ చైతన్య’ కారణం దేనికో? అని తెగ హెడ్డింగులు పెడుతున్నారు. అది చూసిన పలువురు కొన్ని మీడియా పత్రికలపై మండి పడుతున్నాయి. దాంతో ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. కారణం ఏదైనప్పటికీ ఈ విషయం అక్కినేని అభిమానులకు తీవ్ర సంతోషాన్ని కలిగిస్తుంది. తమ అభిమాన దంపతులు త్వరలో కలవబోతున్నారని వారు కలలు కంటున్నారు.
ఇంతకీ చైతన్య అక్కడికి ఎందుకెళ్ళాడు?
ఆ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఆ విషయం వారు బహిరంగంగా తెలిపితే గాని మనకు తెలియదు. సో.. వారు బయటకి చెప్పరు. ఆ విషయం మనకి ఎప్పటికీ తెలియదు. అందుకని మిత్రులారా దయచేసి.. సోషల్ మీడియాలోని వార్తలు చూసి మైండ్ పాడుచేసుకోవడం మానేయండి. మీ ఎనర్జీ ని మీ భవిష్యత్తు మీద పెట్టండి. అని కొందరు శ్రేయోభిలాషులు అక్కినేని అభిమానులకు హితబోధ చేస్తున్నారు.