NewsOrbit
Entertainment News సినిమా

Kushi: విజయ్ దేవరకొండ…సమంత “ఖుషి” విడుదల తేదీ అధికారిక ప్రకటన చేసిన మేకర్స్..!!

Share

Kushi: శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా “ఖుషి” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రేమ కథ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. వాస్తవానికి ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. సమంతా కి అనారోగ్యం మయోసైటీస్ కారణంగా… ఆమె మూడు నెలలపాటు బెడ్ రెస్ట్ తీసుకోవడంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ క్రమంలో ఒకానొక దశలో ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14 వ తారీకు విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నట్టు ప్రచారం కూడా జరిగింది.

Vijay Deverakonda Samantha Kushi Movie Release Date Officially Announced by Makers

కానీ ఆ సమయానికి కూడా సమంత ఆరోగ్యం బాలేక పోవడంతో ప్రస్తుతం ఈ సినిమా సెప్టెంబర్ మొదటి తారీకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా పోస్టర్ తో కూడిన ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ప్రేమ కథ నేపథ్యం తో పాటు కుటుంబ బంధాలకు విలువిచ్చే సినిమాగా “ఖుషి” తెరకెక్కటం జరిగింది. సెప్టెంబర్ మొదటి తారీకు అని ప్రకటన చేయడంతో విజయ్ దేవరకొండ అభిమానులు కొంత నిరుత్సాహం చెందుతున్నారు.

Vijay Deverakonda Samantha Khushi Movie Release Date Officially Announced by Makers

విజయ్ దేవరకొండ లాస్ట్ సినిమా లైగర్ గత ఏడాది… ఆగస్టు నెలలో విడుదల అయ్యి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఖుషి సినిమా షూటింగ్లో ఫుల్ బిజీ అయ్యారు. అయితే సమంత అనారోగ్యం కారణంగా షూటింగ్ డిలే కావటంతో.. దెబ్బ మీద దెబ్బ అన్నట్టు విజయ్ దేవరకొండ కెరియర్ డేంజర్ జోన్ లో పడింది. ప్రస్తుతం ఖుషి తో పాటు గౌతమ్ తిన్ననూరి ఇంకా పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమాలు చేస్తున్నారు. వరుస పరాజయాలలో ఉన్న విజయ్ ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.


Share

Related posts

క‌లిసొచ్చిన సండే.. 3వ రోజు బాక్సాఫీస్ వ‌ద్ద `సీతా రామం` బీభ‌త్సం!

kavya N

బిగ్ బాస్ 4 : ఓటింగ్ సిస్టమ్ పై సర్వత్రా విమర్శలు..! ఈ సారి ఈ కంటెస్టెంట్ ని టార్గెట్ చేశారట

arun kanna

క్లాసిక్ టైటిల్‌తో నాగశౌర్య‌

Siva Prasad