NewsOrbit
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

జగన్ ని జైల్ కి పంపించేదాకా ఈయన నిద్రపోయేలా లేడు !

పాపం ఏబీఎన్ రాధాకృష్ణ పరిస్థితి రాష్ట్రంలో చాలా ఘోరంగా తయారైంది. తన అసలు భావాలు ఏమిటో బయటకు మింగలేక కక్కలేక లోలోపల మదనపడుతూ…. ఆ ఆక్రోషం నుండి వస్తున్న రాతలను తన పత్రికలో రాసుకుంటున్నారు. అవి జనాల చదివి ఎంత వరకూ అతనితో ఏకీభవిస్తారో తెలియదు కానీ అవి కాస్తా ఆయన తలరాతను మార్చకపోతే చాలు అని పలువురు అనుకుంటున్నారు.

 

తదుపరి ముఖ్యమంత్రి ఎవరో సెలవిచ్చేశారు..!

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కు జగన్ అర్జెంటుగా జైలు కి వెళ్లాలని ఉంది. అయితే అతను జైలు కి వెళ్తే పార్టీ అన్యాయం అయిపోతుందని అతనికి మంచి సలహా కూడా ఇచ్చాడు. సీఎం పదవిలో భారతి ని కూర్చోపెట్టి జైలు కి వెళ్ళమని ఏపీ ముఖ్యమంత్రికి సూచించాడు. ఇంకా నయం.. బిజెపి సహకారంతో చంద్రబాబు కూర్చుంటారని మాత్రం చెప్పలేదు. రాసే వాళ్ళు ఉంటే చదివే వారులోకువ అన్నట్లు చంద్రబాబు పార్టీని పూర్తిగా బిజెపి కబలిస్తుంది అన్న ప్రచారాన్ని తిప్పికొట్టి.. పసుపు క్యాడర్ లో ధైర్యం నింపేందుకే ఈ భరోసా పలుకులు అని అందరికీ అర్థమైంది.

మోదీకి జగన్ వద్దట.. బాబు ముద్దట

అటు వైపు చూస్తే చంద్రబాబు కైనా బిజెపి తనతో కలిసే ఆశలు అసలు ఉన్నాయో లేదో తెలియదు కానీ రాధాకృష్ణ మాత్రం చాలా ఆశలే పెట్టుకున్నాడు. కానీ రియాలిటీ లోకి వస్తే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజుని నియమించినప్పుడే హైకమాండ్ మనస్తత్వం అర్థం చేసుకుని ఉండాలి. రాం మాధవ్ వంటి సీనియర్ నేతలు సైతం అపోజిషన్ ఖాళీగా ఉందని వ్యాఖ్యానించారు. బిజెపి బలంగా ఉన్న జగన్ ను కాదనుకొని తిరిగి తమను ఇన్నాళ్ళు ఎదగనివ్వకుండా చేసిన చంద్రబాబుని అక్కున చేర్చుకుంటుంది అన్నది అతని ఎలానో అతని అజ్ఞానానికే తెలియాలి. రాజ్యసభలో బిజెపికి జగన్ అవసరం మరికొన్నేళ్ళ పాటు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే కేంద్రంలో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో వారికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ తో శత్రుత్వం భాజపాకి ఎంతవరకు మేలు?

బిజెపి ని కాంగ్రెస్ లా మారమంటున్నాడు

ఇక జగన్ జైలు విషయం అంటారా… బిజెపి అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీని కూలదోసే పరిస్థితిలో ఉందా..? జగన్ ప్రభుత్వం బలం ఏమిటో రాధాకృష్ణ కు తెలియంది కాదు. అలాంటి బిజెపి జగన్ ను ఏరకంగా ఢీ కొట్టే ధైర్యంతో ఉంటుంది..? ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినాడు బిజెపి అతని కేసులను బయటకు తెస్తుందని చెబుతున్నారు ఆర్కే. అలాంటి పనులు చేసే ఏపీలో కాంగ్రెస్ ఇప్పటికే అడ్రెస్ లేకుండా పోయిన విషయం రాధాకృష్ణ మర్చిపోయినట్లున్నాడు. ఈ రాతలు కూడా ఆయనే అంతకు ముందు తన పత్రికలో రాశాడు. వాటిని గుర్తు చేసుకుంటే మంచిది.

మొత్తానికి బిజెపి అంత సాహసం ఇప్పట్లో చేయలేదు. ఇక రాధాకృష్ణ ఇటువంటి రాతలు రాసేప్పుడు జాగ్రత్తగా లేకపోతే జగన్ తీసుకొచ్చిన సొత్త చట్టాం ద్వారా నిరాధార ఆరోపణలు…. అవాస్తవాలు రాయడం మూలంగా అతనే జైలుకు వెళ్లే ప్రమాదం రావచ్చు. ఈ శీర్షికకి అని కాదు కాని ప్రభుత్వం కన్ను అతని పై పూర్తిగా కేంద్రీకరించకముందే జాగ్రత్త పడాలి. మరి రాధాకృష్ణ ఎంత వరకు తెగిస్తాడో…. ఎప్పటి వరకు ఇలా భ్రమలో బ్రతుకుతాడో అతనికే తెలియాలి అంటున్నారు విశ్లేషకులు.

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!