NewsOrbit
5th ఎస్టేట్

‘కుల’ పిచ్చి రాజకీయాలకి జగన్ మార్క్ సంకెళ్ళు…! 

 

రాజకీయాల్లో అవతలి వారు వేయబోయే ఎత్తును ముందుగానే పసిగట్టి దానికి పైఎత్తు ను సిద్ధం చేసుకోవడం చాలా కామన్. అయితే ఎవరి ఊహకు అందకుండా ఒక మాస్టర్ ప్లాన్ వేసి అవతల వారిని సందిగ్ధతలో పడేయడం అన్నది కేవలం కొద్దిమంది వల్ల మాత్రమే అవుతుంది. అటువంటి కోవకే చెందుతారు వైసిపి పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీకి అత్యంత పట్టు ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ ను ఎలాంటి అడ్డు లేకుండా నడిపించేందుకు జగన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.

అయితే ఇన్ని రోజులు కులాల పరంగా రాజకీయాలు చేసేందుకు మొగ్గు చూపిన విపక్షాలకు చెక్ పెట్టేందుకు తగిన ఈక్వేషన్ లతో జగన్ సన్నద్ధమయ్యారు. జిల్లాలోని రెండు ప్రాంతాల్లో కూడా ఒక మంచి వ్యూహంతో అడుగుపెట్టిన జగన్ ముఖ్యంగా మెట్ట ప్రాంతంలో ఎక్కువగా ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని పెద్దపీట వేసేందుకు సన్నాహాలు జరుపుతున్నారు. మెట్ట ప్రాంతం క్రిందకు వచ్చే నియోజకవర్గాల్లో కమ్మ వర్గాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు.

అంతేకాకుండా తనకు అత్యంత సన్నిహితులైన దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరి కి ఆయన అధిక ప్రాధాన్యతను ఇవ్వడం ఇప్పటికే గమనించాం. అదే కాకుండా చింతలపూడి, దెందులూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో మండల స్థాయిలో కమ్మవారికి ప్రాధాన్యతను పెంచారు. ఏలూరు మరియు పోలవరం నియోజకవర్గంలో కూడా వ్యూహాత్మకంగా కమ్మ వర్గం వారికి ఎక్కువ పదవులు ఇస్తూ వైసీపీ వైపు తిప్పుకోవడానికి మరియు తన వ్యక్తిగత ఓటు బ్యాంకు పెంచుకోవడానికి కూడా జగన్ శ్రీకారం చుట్టారు.

ఇక ఈ జిల్లాలోని మరో కీలక ప్రాంతమైన డెల్టా రీజియన్ లో కూడా జగన్ అడ్డు లేకుండా చెలరేగి పోతున్నాడు. డెల్టా ప్రాంతం క్రిందకు వచ్చే నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాల్లో క్షత్రియ మరియు బిసి వర్గాలు బలంగా ఉన్నాయి. అక్కడ బలంగా ఉండాలంటే వారి ఓటు బ్యాంకు అత్యంత కీలకం. నిజానికి టీడీపీకి క్షత్రియ బలం పెద్దగా లేదు. అంతే కాకుండా తూర్పు కోనసీమలో కూడా రాజకీయాల్ని శాసించేది క్షత్రియులే. ఈ విషయాన్ని గమనించిన జగన్ గారికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు. ఇక బీసీ వర్గానికి చెందిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు కి మంత్రి పదవి కట్టబెట్టిన జగన్ అదే ప్రాంతంలో వైసిపి సమర్థవంతంగా ముందుకు సాగేందుకు కృషి చేసిన ముదునూరి ప్రసాదరాజు రాబోయే రోజుల్లో కేబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ చేసేసారు.

ఇక జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల త‌ర్వాత చైర్మన్ ప‌ద‌వి సైతం కౌరు శ్రీనుకే ద‌క్క‌నుంది. ఇక బీసీ వ‌ర్గానికే చెందిన య‌డ్ల తాతాజీకీ డీసీఎస్ఎంఎస్ చైర్మన్ ప‌ద‌వి ఇచ్చారు. ఇలా జ‌గ‌న్ టీడీపీకి చెక్ పెట్టే క్రమంలో ప‌శ్చిమ‌లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనికి ప్రతిగా టీడీపీ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau

Leave a Comment