NewsOrbit
5th ఎస్టేట్

డిస్క్వాలిఫికేషన్ లేదు… కాకరగాయ లేదు….. రాజుగారికి మినిమమ్ కేరే లేదు.

డిస్క్వాలిఫికేషన్ లేదు… కాకరగాయ లేదు… వైసీపీ ఎంపీల ఫిర్యాదుపై రఘురాజు దూకుడు నవ్విపోదురుగాక నాకేంటి? ఇది వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిలాసఫీ.

 

పార్టీలోనే బలవంతమైన, సంపన్నవంతమైన ఎంపీ ఏడాది గడిచే సరికి పార్టీకి కొరకరాని కొయ్యలా మారారు. పార్టీలో తనకు స్థానం లేదని… తన విలువ పూచికపుల్లతో సమానమన్న భావనలో వచ్చిన ఆయనకు ఢిల్లీలో లభిస్తున్న మర్యాదే.. పార్టీపై దూకుడు పెంచేందుకు కారణమైనట్టు కన్పిస్తోంది. ఇష్యూలను రెయిజ్ చేయడమే నా తప్పా అంటూ మాట్లాడుతున్న రాజు… అందుకు పార్టీ నుంచి స్పందన రాకపోగా… విమర్శలు విన్పిస్తున్నాయంటున్నారు.
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు స్టైలే సెపరేట్… అవును. ఆయన తేడా అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు కొంత ఎటకారంగా విమర్శలు గుప్పిస్తున్నా ఆయన మాత్రం దూకుడు పెంచేస్తున్నారు. ఎక్కడా తొనకడం లేదు. బెదరడం లేదు. పైపెచ్చు… అసలు పార్టీ అంటే భయమే లేనట్టుగా మాట్లాడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే భయపడటం లేదని రఘురామకృష్ణరాజు కుండబద్ధలు కొడుతున్నారు. ఇక్కడ భయం అన్న మాట ఎందుకంటే… వైసీపీ సర్కారుకు ఎన్నో సమస్యలు ఉండగా… ఒక్క ఎంపీ ఢిల్లీ స్థాయిలో పార్టీని ఇరుకునపెడుతుంటే… ఏం చేయాలో పాలుపోని స్థితిలో వైసీపీ హైకమాండ్ ఉంది.
పార్టీపై ప్రేమ ఉందని… సీఎం అంటే చాలా ఇష్టమంటూ చెబుతూ వచ్చిన ఆయన లక్షణరేఖను దాటేస్తున్నారు. ఎంపీలు లేఖ ఇస్తే భయపడతానా… ఆ లేఖకు అంత సీన్ లేదంటూ మొన్నటి వరకు చెప్పిన రాజు ఇప్పుడు మరో ముందడుగేసి… రేపోమాపో కేంద్రం నుంచి సెక్యురిటీ సైతం రాబోతుందంటూ చాలా క్లారిటీతో చెబుతున్నారు. అంటే తన మాటే నిజమని… తనపై ఫిర్యాదులు తేలిపోతాయని… అందుకు లాజిక్కులు సైతం ఉన్నాయంటూ గట్టిగా చెప్పేస్తున్నారు. మొత్తంగా తన విషయం ఇప్పుడప్పుడే సమసిపోదని… సాగుతూ ఉంటుందని… అది వైసీపీకి మంచిది కాదని… ప్రభుత్వ పెద్దలు ఎందుకంత మొండిపట్టుదలతో ఉన్నారని… నిబంధనల మేరకు న్యాయమే గెలుస్తుందని… డిస్క్వాలిఫికేషన్ పిటిషనే డిస్క్వాలిఫై అవుతుందంటూ వైసీపీకి మరింత చికాకు కలిగిస్తున్నారు రఘురామకృష్ణరాజు. తనకు వ్యతిరేకంగా ఎంపీలు ఇచ్చిన ఆధారాలతో అనర్హత వేటు కుదరదని… లోక్‎సభ సభ్యత్వం రద్దు చేయడం ఎవరి వల్ల కాదని తేల్చిచెబుతున్నారు. పార్టీని వదిలేది లేదు… పార్లమెంట్‎ను వదిలేది లేదంటూ మరో ట్విస్ట్ ఇచ్చారు.
మరోవైపు వైసీపీ ఎంపీలు సైతం అసలేం చేస్తున్నారో అర్థం కానట్టుగా అన్పించింది. 20 నిమిషాల పాటు స్పీకర్ కు ఫిర్యాదు చేశామని చెబుతున్నా… ఆ తంతు అంత రెండు మూడు నిమిషాల్లోనే మిగిసిందంటూ రఘురామకృష్ణరాజు చెప్తున్నాడంటే… ఢిల్లీలో అసలేం జరగబోతుందంటూ చెప్పేస్తున్నారు. అంతలా నెట్ వర్క్ విస్తృతం చేసుకున్నారన్నమాట. ఢిల్లీలో పెద్ద ఎత్తున పరపతి ఉన్న విజయసాయిరెడ్డి లాంటి నాయకుడే అవాక్కయ్యేట్టు రఘురామరాజు మాట్లాడుతున్నారంటే… క్లారిటీ ఎవరికి మిస్సవుతుందో ఈస్టోరీ చదివినవాళ్లకి ఎవరికైనా క్లారిటీ వస్తుంది.
నిజమే… రఘురామకృష్ణరాజు స్వపక్షంలో విపక్షంలా మారారు, మనసా, వాచా పార్టీతో లేరు… విజయసాయిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల్లో చాలా అర్థముంది. ఆయన అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు… వేరీజ్ గ్యాప్ అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం వైసీపీ హైకమాండ్ కు లేదంటారా? తప్పకుండా ఉంది… ఎందుకంటే ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ… అదే సమయంలో… 22 ఎంపీలతో ఢిల్లీలో అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీకి ఇది ఎంతో తలనొప్పి.
నైతికతకు రాజకీయనేతలు చెప్పే అర్థాలు చాలా సార్లు నవ్వొచ్చేలా చేస్తాయ్… తాజాగా రఘురామకృష్ణరాజు నైతిక విలువలు కోల్పోయారంటూ వైసీపీ ఎంపీలు చేస్తున్న వ్యాఖ్యలను జాగ్రత్తగా పరిశీలించాలి. రఘురామరాజు వ్యవహారంలో పార్టీ అభాసుపాలైతే అది ఎవరికి ఇబ్బందన్నది హైకమాండ్ గుర్తుంచుకోవడం లేదా… ? ఢిల్లీ పెద్దలు అందరూ అనుకుంటున్నట్టుగా… రాజుగారికి సపోర్ట్ చేస్తారా… లేక వైసీపీ నాయకత్వానికి అనుకూల నిర్ణయం తీసుకుంటారా… ? గతంలో బీజేపీ, టీడీపీ మధ్య ప్రత్యేక హోదా అంశం చిచ్చు రాజేసింది. నిధులు వ్యవహారం మంటపెట్టింది. ఇప్పుడు బీజేపీపై దూకుడు పెంచే యోచనలో వైసీపీ సర్కారు లేదు. రఘురామరాజు వ్యవహారాన్ని ఫిర్యాదు చేసి చేతులు దులిపేసుకోవాలన్న ఆలోచన కూడా వైసీపీలో ఉందేమో… పనీపాట లేకుండా విమర్శలు చేస్తున్నారన్న ఫీలింగ్ జనంలో కలిగించడం… బీజేపీ పెద్దలు చూసిచూడనట్టుగా ఉన్నారన… చేతులు కడిగేసుకోవడమే తరువాయి అనుకోవాల్సి ఉంటుందేమో…

author avatar
Special Bureau

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau