Sreemukhi: టాలీవుడ్ లో ఉన్న స్టార్ ఫిమేల్ యాంకర్స్ లో అందాల భామ శ్రీముఖి ఒకటి. అదుర్స్ అనే టీవీ షో ద్వారా వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించిన శ్రీముఖి.. తనదైన ప్రతిభతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ పాపులారిటీని సంపాదించుకుంది. స్టార్ యాంకర్ గా ముద్ర వేయించుకుంది. ప్రముఖ టీవీ ఛానెల్స్ అన్నిటినీ కవర్ చేస్తూ అనేక షూస్ ను ముందుండి నడిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా శ్రీముఖి కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ చిన్నది రీసెంట్గా ఓ బంపర్ ఆఫర్ ను కొట్టేసిందట. ఏకంగా పాన్ ఇండియా సినిమాలో నటించే ఛాన్స్ ను అందుకుందట.
కెరీర్ ఆరంభం నుంచి శ్రీముఖి బుల్లితెరకు మాత్రమే పరిమితం కాలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెర పై కూడా అలరిస్తోంది 2012లో జులాయి మూవీతో శ్రీముఖి సినీ రంగ ప్రవేశం చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి చెల్లెలుగా శ్రీముఖి నటించించి మెప్పించింది. ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, చంద్రిక, ధనలక్ష్మి తలుపు తడితే, ఆంధ్ర పోరి, నేను శైలజ, జెంటిల్ మేన్, మనలో ఒకరు, బాబు బాగా బిజీ, కుటుంబ కథా చిత్రమ్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, క్రేజీ అంకుల్స్, మాస్ట్రో మరియు రీసెంట్గా భోలా శంకర్ చిత్రాల్లో శ్రీముఖి నటించింది.
హీరోయిన్ గా కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం యాంకర్ గా ఫుల్ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తూనే.. మరోవైపు అడపా తడపా చిత్రాల్లో నటిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీముఖి చెంతకు ఓ భారీ ప్రాజెక్టు వచ్చిందట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ పాన్ ఇండియా సినిమా రాబోతోందంటూ గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అనిరుధ్ ఈ మూవీకి సంగీతం అందించబోతున్నాడని.. సమంత హీరోయిన్ గా ఎంపిక అయిందని వార్తలు వస్తున్నాయి.
అంతేకాకుండా అల్లు అర్జున్, అనిరుధ్, అట్లీ కలయికలో రాబోతున్న చిత్రానికి AAA అనే వర్కింగ్ టైటిల్ కూడా అనుకుంటున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే. అదే రోజు ఆయన అట్లీతో చేయబోయే ప్రాజెక్ట్ ను అఫీషియల్ ప్రకటనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ చిత్రంలో శ్రీముఖి ఓ కీలక పాత్రలో కనిపించబోతోందట. అల్లు అర్జున్ సిస్టర్ క్యారెక్టర్ కోసం ఇటీవల శ్రీముఖిని సంప్రదించారట. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం.. పైగా అల్లు అర్జున్- అట్లీ కాంబో మూవీ అవ్వడంతో శ్రీముఖి వెంటనే ఓకే చెప్పేదట. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. నెట్టింట మాత్రం అల్లు అర్జున్- అట్లీ సినిమాలో శ్రీముఖి యాక్ట్ చేయబోతోందనే న్యూస్ మాత్రం బాగా వైరల్ అవుతోంది.