Salaar: ఈ ఏడాది మరో నాలుగు రోజులలో ముగియనుంది. అయితే ఈసారి ఎక్కువ అవకాశాలతో హీరోయిన్ శృతిహాసన్.. తెలుగు ప్రేక్షకులను పలకరించింది అని చెప్పవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మూడు సినిమాలతో 2023లో… హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు శృతిహాసన్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే సీనియర్ హీరోలు చిరంజీవితో “వాల్తేరు వీరయ్య” బాలకృష్ణతో “వీరసింహారెడ్డి”.. సినిమాలు చేసి రెండు విజయాలు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. కాగా సంవత్సరం చివరిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో “సలార్”తో మరో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. 2023లో అతిపెద్ద హిట్ సినిమాగా “సలార్” కలెక్షన్లతో దూసుకుపోతోంది.
డిసెంబర్ 22వ తారీకు విడుదలైన ఈ సినిమా ఈ ఏడాది విడుదలైన సినిమాల ఓపెనింగ్స్ అన్నిటిలో కంటే.. అత్యధికంగా వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ ఆద్య పాత్రలో అందరినీ అలరించడం జరిగింది. మొదటి భాగంలో పాత్రకి కొద్దిగా తక్కువ ప్రాధాన్యత ఉన్నా గాని రెండో భాగంలో ఆద్య పాత్ర అత్యంత కీలకమని సినిమా యూనిట్ తెలియజేయడం జరిగింది. “సలార్” సూపర్ హిట్టు కావడంతో.. సక్సెస్ ప్రమోషన్ కార్యక్రమాలలో శృతిహాసన్… గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సలార్ ప్రమోషన్స్ లో… నా డాన్స్ రాజమౌళి చూసి మెచ్చుకోవటం చాలా ఆనందాన్ని కలిగించింది. ఆయన పొగడ్తలు మర్చిపోలేనని తెలియజేసింది.
ప్రభాస్ తో నటించాలని చాలా కాలం నుండి ఎదురు చూడటం జరిగింది. ఈ క్రమంలో “సలార్” తో ఆ అవకాశం దొరికింది. ప్రభాస్ అందరితో చాలా స్నేహంగా ఉంటారు అంటూ శృతిహాసన్ చెప్పుకొచ్చింది. ఇక ఇదే సమయంలో పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. బాయ్ ఫ్రెండ్ శాంత హాజరీకాను… సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు వస్తున్న వార్తలను ఖండించింది. మేము ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్రతి విషయం చెప్పిన నేను పెళ్లి విషయాన్ని ఎందుకు దాస్తాను. ఇకనైనా ట్రోలర్స్ శాంతించండి అను శృతిహాసన్ పెళ్లిపై వస్తున్న వార్తలు క్లారిటీ ఇవ్వటం జరిగింది.