Salaar: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన “సలార్” డిసెంబర్ 22వ తారీకు విడుదల కాబోతోంది. “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ నీ చాలా వైలెంట్ మాన్ గా చూపించడం జరిగింది. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్… ప్రభాస్ స్నేహితుడు పాత్రలో నటిస్తున్నారు. ఫ్రెండ్షిప్ నేపథ్యంలో “సలార్” తెరకెక్కటం జరిగింది. ఇదిలా ఉంటే సినిమా విడుదల కాకముందే అమెరికాలో సంచలన రికార్డు నమోదు చేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే ఈ ఏడాది అత్యంత వేగంగా వన్ మిలియన్ కి పైగా అమెరికా ప్రీమియర్స్ ప్రీ సెల్ జరిగిన సినిమాగా నిలిచింది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ సినిమా యూనిట్ ఆ పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది. “సలార్” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది. మరోపక్క డిసెంబర్ 18వ తారీకు ఉదయం 10 గంటలకు “సలార్” రెండో ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కానీ కొన్ని టెక్నికల్ కారణాలవల్ల విడుదల చేయలేకపోయారు. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు విడుదల చేస్తామని.. ప్రకటించారు. మధ్యాహ్నం రెండు గంటలకు కూడా “సలార్” సెకండ్ ట్రైలర్ విడుదల కాకపోవటంతో అభిమానులు అసహనం చెందుతున్నారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో సినిమా యూనిట్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడుతున్నారు.
“సలార్” మొదటి ట్రైలర్ డిసెంబర్ మొదటి తారీకు విడుదలయ్యింది. మూడు నిమిషాల కంటే ఎక్కువ కలిగిన ట్రైలర్లో కేవలం చివరి నిమిషంలో మాత్రమే ప్రభాస్ నీ చూపించారు. దీంతో అభిమానులు ఎంతో డిసప్పాయింట్ అయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు ఫుల్ లెన్త్ ప్రభాస్ ఉండే విధంగా సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. వరుసపరాజయాలలో ఉన్న ప్రభాస్ ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాలని అభిమానులు ఆశిస్తున్నారు. “సలార్” రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. మొదటిది డిసెంబర్ 22 కాగా రెండవది సమ్మర్ లో విడుదల కాబోతున్నట్లు సమాచారం.