Salaar: 2017లో “బాహుబలి 2” తర్వాత ప్రభాస్ ఇప్పటివరకు హిట్ అందుకోలేకపోయాడు. ఆయన నటించిన సాహో, రాదేశ్యమ్, ఆదిపురుష్.. సినిమాలు అన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. పాన్ ఇండియా నేపథ్యంలో వచ్చిన ఈ మూడు సినిమాలు కనీసం యావరేజ్ టాక్ కూడా సాధించలేకపోయాయి. ఈ క్రమంలో ప్రస్తుతం “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” అనే సినిమా చేయడం జరిగింది. డిసెంబర్ 22వ తారీకు ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేయడం జరిగింది.
రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ సాంగ్ కూడా విడుదల చేశారు. అయితే విడుదలకు ఇంకా వారం రోజులు మాత్రమే ఉండటంతో “సలార్” తో ప్రభాస్ విజయం సాధించి హిట్ ట్రాక్ ఎక్కాలని ఎస్.ఎస్ రాజమౌళి బిగ్ హెల్ప్ చేయడానికి రెడీ అయినట్లు సరికొత్త వార్త సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళ్తే.. ఇంటర్వ్యూలు పరంగా “సలార్” సినిమా యూనిట్ పెద్దగా ప్రమోషన్స్.. నిర్వహించకుండా చాలా సైలెంట్ గా ఉంటుంది. ఇప్పటివరకు సినిమాకి సంబంధించి పోస్టర్లు మరియు ట్రైలర్ వీడియోలు మాత్రమే విడుదలయ్యాయి. సినిమా దర్శకుడు లేదా హీరో ప్రభాస్ ఎక్కడా కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఈ క్రమంలో సినిమా యూనిట్ తో… రాజమౌళి ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటున్నారట. ప్రశాంత్ నీల్ తోపాటు ప్రభాస్ మరియు పృధ్వీరాజ్ సుకుమారన్ నీ… రాజమౌళి ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
విడుదలకు ఇంకా వారం రోజులు మాత్రమే టైం ఉండటంతో.. సినిమా యూనిటీ సైలెంట్ గా ఉండటం పట్ల అభిమానుల నుండి విమర్శలు వస్తున్నాయి. ఈ రకంగా అయితే ఓపెనింగ్స్ కష్టమని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దీంతో “సలార్” మేకర్స్.. ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ తో… ఎక్కువ ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కాబోతోంది. మొదటి భాగం డిసెంబర్ 22వ తారీకు విడుదలవుతున్న నేపథ్యంలో.. “సలార్” పై అందరి చూపు నెలకొంది. “బాహుబలి”తో ప్రభాస్ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు బాధ్యతలు కొట్టిన హీరో.. కావటంతో “కేజిఎఫ్” దర్శకుడు ఈ సినిమా తీస్తూ ఉండటంతో.. “సలార్” రిజల్ట్ ఎలా ఉంటుందో అని సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు.