మలయాళ ముద్దుగుమ్మ పూర్ణ ఇటీవలె తనకు కాబోయేవాడిని అందరికీ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. జేబీఎస్ గ్రూప్ ఫౌండర్ షానీద్ అసిఫ్ అలీని ఈ అమ్మడు మనువాడబోతోంది. ఇప్పటికే కుటుంబసభ్యుల నడుమ వీరి నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించి ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక రేపో, మాపో పెళ్లి తేదీని కూడా పూర్ణ ప్రకటిస్తుందని అభిమానులు సంభరపడుతున్న తరుణంలో.. ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట దర్శనమిచ్చింది. పూర్ణ పెళ్లి ఆగిపోయింది అన్నదే ఆ వార్త సారాంశం. షానీద్, పూర్ణలకు మధ్య మనస్పర్థలు తలెత్తాయని.. అందుకే వీరిద్దరూ పెళ్లి వరకు వెళ్లకముందే నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
దాంతో పూర్ణ పెళ్లిపై సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చలు స్టార్ట్ చేశారు. ఇవి పూర్ణ కంటపడటంతో.. ఆమె వెంటనే ఒక్క పోస్ట్‌తో అసలు నిజాన్ని తేల్చేసింది. తాజాగా పూర్ణ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో ఆమె తనకు కాబోయే భర్త షానీద్ ను గట్టగా కౌగిలించుకుని కనిపించింది.
అలాగే తన పోస్ట్‌కు `ఎప్పటికీ నా వాడివే` అంటూ క్యాప్షన్ కూడా వచ్చింది. ఈ పోస్ట్‌తో పూర్ణ పెళ్లి ఆగిపోయింది అన్న వార్త కేవలం పుకారే అని స్పష్టంగా తేలిపోయింది. కాగా, పూర్ణ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు స్టార్ హీరోల సినిమాల్లో సహాయక పాత్రలను పోషిస్తోంది. అలాగే అప్పుడప్పుడు బుల్లితెర పలు టీవీ షోల్లో కూడా మెరుస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
https://www.instagram.com/p/ChCdWbDhmNj/?utm_source=ig_web_copy_link