Brahmamudi Serial జూన్ 5th 114 ఎపిసోడ్: స్టార్ మా లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతూ ముందుకు దూసుకుపోతుంది. ఇక ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో ఏమి అయ్యిందో చూద్దాము.
Brahmamudi june 2nd Episode : రాహుల్ – స్వప్న పెళ్ళికి ముహూర్తం సిద్ధం చేసిన కుటుంబ సభ్యులు
మేకప్ కిట్ కోసం డబ్బులు దొంగతనం చేసిన స్వప్న :
కనకం సేటుకి ఇవ్వాల్సిన వడ్డీ డబ్బులను కాజేసి స్వప్న మేకప్ కి కొనుక్కుంటుంది. కనకం ఆ డబ్బులు ఏమి అయ్యాయా అని కంగారు పడుతున్న సమయం లో అప్పు స్వప్న మేకప్ కిట్ కోసం 11 వేల రూపాయిలు ఇచ్చింది గుర్తుకు వచ్చి, స్వప్న ని గదిలో నుండి బయటకి లాక్కొచ్చి, ఇది ఈమధ్య దొంగ వేషాలు వెయ్యడమే కాదు, దొంగతనాలు కూడా చేస్తుంది, ఇందాక నీ డబ్బులు దొంగతనం చేసి ఇది మేకప్ కిట్ కొనుక్కుంది అని అంటుంది. అప్పుడు స్వప్న మా అమ్మ డబ్బులు నేను తీసుకుంటే అది దొంగతనం ఎలా అవుతుంది అని అనగా, అప్పుడు కనకం ఎవరు నీకు అమ్మ?, నా భర్త ఎంతో కస్టపడి సంపాదించిన డబ్బులు అవి అంటుంది. భలే సంపాదించాడులే, ఎదో కోట్ల రూపాయిలు దాచిపెట్టినట్టు చెప్తావేంటి, రెండు రోజుల్లో నేను దుగ్గిరాల కుటుంబ మనిషి అవుతాను. అప్పుడు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అని అంటుంది.
నువ్వు ఎప్పటికీ నా శత్రువే అంటూ కావ్య కి షాక్ ఇచ్చిన రాజ్ :
మరోపక్క ధాన్య లక్ష్మి కావ్య ని బాగా రెడీ చేసి , చేతిలో పాలగ్లాసుని పెట్టి రాజ్ రూమ్ లోకి పంపిస్తుంది. ఆయన నన్ను ఇంకా భార్య గా అంగీకరించలేదు అనిపిస్తుంది అత్తా అని అంటుంది కావ్య, నువ్వు నీ తప్పు ఏమి లేదని నిరూపించుకున్నావు కదా, ఇప్పుడెందుకు రాజ్ నిన్ను అంగీకరించడు అని అంటుంది. అప్పుడు కావ్య ఏమో అలా అనిపిస్తుంది అని అంటూ, రాజ్ రూమ్ లోకి వెళ్తుంది. ఊహించినట్టుగానే రాజ్ కావ్య ని అంగీకరించడు. నువ్వు నీ నిజాయితీని నిరూపించుకొని ఉండొచ్చు, కానీ నువ్వు ఎప్పటికీ నాకు ఆగర్భ శత్రువు లాగానే అనిపిస్తావు అని అంటాడు రాజ్.ఎందుకంటే నువ్వు నాలాగే ఆలోచిస్తావు, నాకు ఉన్న అహంకారం కంటే నీకు వంద రెట్లు ఎక్కువ అహంకారం ఉంటుంది, అలాంటి పిల్లతో నేను కాపురం చెయ్యలేను అని అంటాడు రాజ్. అప్పుడు కావ్య ఈ ఇంట్లోకి మీ ఇష్టం మీదనే వచ్చానా, నీ గదిలోలోకి నీ ఇష్టం మీదనే వచ్చానా ?, ఎదో ఒకరోజు మీ మనసులోకి అలాగే రాకుండా ఉంటానా ఏంటి!, ఏమో మీరు నన్ను ప్రేమించొచ్చు కూడా , ఆ బ్రహ్మ వేసిన ముడి ని ఎవ్వరూ చెరిపెయ్యలేరు అని అంటుంది కావ్య.
Krishna Mukunda Murari: కృష్ణ మురారిలది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని రేవతితో చెప్పేసిన ముకుంద..
తిరగబడిన రుద్రాణి :
మరోపక్క రాజ్ కావ్య తీసుకొచ్చిన పాలుని డస్ట్ బిన్ లో పారబోస్తాడు, ఇది ధాన్య లక్ష్మి గమనించి, ఇంకా రాజ్ కావ్యాన్ని అంగీకరించలేదని బాధపడుతుంది. అప్పుడు క్రింద హాల్ లో కూర్చొని కవితలు రాసుకుంటున్న కళ్యాణ్ దగ్గరకి వెళ్లి ఏమి చేస్తున్నావ్ కళ్యాణ్ అని అంటుంది. ఒక కవి ఏమి చేస్తాడు, కవితలు రాస్తాడు, అదే పనిలో ఇప్పుడు ఉన్నాను అని అంటాడు. అప్పుడు ధాన్యలక్ష్మి కొన్ని రోజులు కవితలు పక్కన పెట్టి రాజ్ మరియు కావ్యలను కలపాలి అంటుంది ధాన్య లక్ష్మి. అదేంటి కావ్య అక్క తన తప్పు లేదని నిరూపించుకుంది కదా, మా అన్నయ్య ఇంకా ఒప్పుకోలేదు ఆమెని అని అంటాడు కళ్యాణ్. అలా ఒప్పుకునే మనిషి అయితే మీ అన్నయ్య ఎందుకు అవుతాడు అని అంటుంది ధాన్య లక్ష్మి.
అయితే వీళ్ళిద్దరిని కలపడానికి ఎదో ఒకటి చెయ్యాలి అంటాడు కళ్యాణ్.ఇక రేపు జరగబొయ్యే ఎపిసోడ్ ప్రోమో లో రుద్రాణి మరోసారి ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను అని తిరగబడుతుంది, మీ అందరి మీద చీటింగ్ కేసు పెడతాను అని అనగా, ఎవరు ఎవరి మీద చీటింగ్ కేసు పెడుతారు?, కావ్య ని ముసుగు వేసి నాతో పెళ్లి చేయించినందుకు నేను పెడుతా నీ మీద చీటింగ్ కేసు అంటూ రాజ్ తిరగబడుతాడు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.