NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో సీనియర్ నటి కోటాలో ఈసారి శృంగార తార..?

Advertisements
Share

Bigg Boss 7: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ సెప్టెంబర్ మూడవ తారీకు నుండి స్టార్ట్ కానున్న సంగతి తెలిసిందే. ఈసారి సీజన్ లో చాలావరకు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళనే తీసుకోవడానికి షో నిర్వాహకులు.. డిసైడ్ అయ్యారట. ఎందుకంటే వాళ్లు అందరికీ తెలిసిన మొహాలు కావటంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందట. గత కొన్ని సీజన్స్ నుండి సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించిన వారికి అవకాశాలు ఎక్కువగా ఇవ్వడం జరిగింది. దీంతో చాలామందికి వాళ్ళు తెలియకపోవటంతో బిగ్ బాస్ షో చూడటానికి జనాలకు అంత ఇంట్రెస్ట్ కలగలేదు. ఇదే సమయంలో లైవ్ ఇవ్వటంతో.. ఎక్కడా కూడా ఉత్కంఠ భరితమైన పరిస్థితులు హౌస్ లో కనిపించలేదు. దీంతో చాలా సీజన్స్ అట్టర్ ఫ్లాప్ దిశగా వెళ్లాయి.

Advertisements

Indian Actress Shakeela entering in telugu bigg boss season seven

మరో పక్క కోర్టు మొట్టికాయలు వేసిన పరిస్థితులు దాపరించడంతో.. ఇప్పుడు షో నిర్వాహకులు సీజన్ సెవెన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మేటర్ లోకి వెళ్తే ఈసారి సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లనే ఎక్కువగా తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో శృంగార తార షకీలా..బిగ్ బాస్ షోలో ఈసారి సీజన్ లో రచ్చ చేయబోతున్నట్లు టాక్. షకీలాకి సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు షకీలా సినిమా అంటే.. థియేటర్లకు జనాలు క్యూ కట్టే పరిస్థితి ఉండేది. స్టార్ హీరోల సినిమాలకు దీటుగా షకీలా సినిమాలు ఆడేవి. బోల్డ్ సీన్స్ సినిమాలలో షకీలా ఎక్కువగా నటించడం జరిగింది. తెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటించింది.

Advertisements

Indian Actress Shakeela entering in telugu bigg boss season seven

అయితే ఇప్పుడు షో నిర్వాహకులు ఈసారి సీజన్ కి షకీలా కి అవకాశం ఇచ్చినట్లు సమాచారం. తెలుగు బిగ్ బాస్ షోలో ప్రతి సీజన్ లో ఓ సీనియర్ నటికీ అవకాశం లభించింది. కరాటే కళ్యాణి, హేమ, సీరియల్ నటి ప్రియా, ఉమాదేవి, డాన్సర్ అభినయశ్రీ.. వంటి వారు గత సీజన్ లలో పోటీ పడటం జరిగింది. అయితే ఈసారి సీనియర్ నటి కోటాలో శృంగార తార షకీలా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్ మొదలయ్యాక మధ్యలో కరెక్టుగా వన్డే క్రికెట్ వరల్డ్ కప్ మొదలవుతున్న నేపథ్యంలో షోపై.. వరల్డ్ కప్ ఎఫెక్ట్ పడకుండా ఈసారి టాప్ మోస్ట్ సెలబ్రిటీలను హౌస్ లోకి షో నిర్వాహకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Share
Advertisements

Related posts

Bigg Boss 7 Telugu: రతిక జీవితంలో ఆ అబ్బాయి ఎవరు ? ఎందుకు ఆమెని మోసం చేసాడు ?

sekhar

Nuvvu Nenu Prema: తండ్రికి నిజం చెప్పాలనుకున్న పద్మావతి.. కుచలని రెచ్చగొట్టి ఆనందించిన కృష్ణ..

bharani jella

`లైగ‌ర్‌` డిజాస్ట‌ర్‌తో ఛార్మీ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఆడేసుకుంటున్న నెటిజ‌న్స్‌!

kavya N