Karthikadeepam serial today episode review November 12 :బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1508వ ఎపిసోడ్లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 12న ప్రసారం కానున్న Karthika Deepam serial,1508వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్లో ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 1508 ఎపిసోడ్లోకి కార్తీకదీపం సీరియల్ అడుగుపెట్టింది.
ఇంద్రుడు, చంద్రుడుపై సౌర్య కోపం :
ఈరోజు సీన్ సౌర్య దగ్గర ఓపెన్ అవుతుంది.ఇంద్రుడు-చంద్రమ్మ విషయంలో శౌర్య ఏదో ఆలోచిస్తుంది..మీరు ఇంతకు ముందులా లేరు చాలా మారిపోయారు అంటుంది. అంతా నీకోసమే కదా అని అన్నాసరే..నా ఫంక్షన్ కి ముందు ఆ తర్వాతా చాలా మార్పొచ్చింది అనేసి అక్కడ నుంచి లేచి వెళ్లిపోతుంది.మరోవైపు మోనిత-కార్తీక్ ఇద్దరూ గుడికి వెళతారు.మోనిత చాలా సంతోషంగా నేను అడగ్గానే గుడికి వచ్చావ్ ఈ రోజంతా నాతోనే ఇలాగే ఉండు అంటుంది మోనిత..మోనిత మాటలకూ కార్తీక్ అక్కడినుంచి వెళ్లిపోతాడు.
మోనితను వదిలివెళ్ళిపోయిన కార్తీక్ :
అది గమనించిన మోనిత కార్తీక్ కోసం వెతుకుతూ ఓ దగ్గర కనిపించడంతో ఎక్కడికి వెళుతున్నావ్ అని నిలదీస్తుంది.నాతో ఉండాలి అన్నా కదా అని అంటే ఇదిగో కశ్చీఫ్ తీసుకో నా బదులు ఉంచుకుని దీపాలు పెట్టుకో అనేసి వెళ్లిపోతాడు. గుడిలో కార్తీకదీపం వెలిగిస్తున్న దీప దగ్గరకు వెళ్లి ప్రేమగా మాట్లాడతాడు..మీకోసమే చూస్తున్నా డాక్టర్ బాబు దీపాలు విలిగించండి అని అడుగుతుంది.
కలిసి దీపాలు వెలిగిస్తున్న కార్తీక్, దీప :
కార్తీక్ కూడా వెలిగిస్తాడు..వెలిగించిన దీపం కొండెక్కిపోతుండగా ఆ దీపానికి దీప-కార్తీక్ ఇద్దరూ కూడా చేతులు అడ్డం పెడతారు…అప్పుడే అక్కడకు ఎంట్రీ ఇచ్చిన మోనిత వాళ్ళను చూసి నాతో కలసి దీపం వెలిగించమంటే కశ్చీఫ్ చేతిలో పెట్టి ఇక్కడ దీపతో కలసి దీపం వెలిగిస్తావా..నేను పిలవగానే గుడికి బయలుదేరగానే ఏదో అనిపించింది..దీనికోసం వచ్చావన్నమాట..ఏ దీపం అయితే వెలిగించావో ఆదీపంతోనే దాన్ని తగలబెట్టేస్తా అనుకుంటుంది..
కార్తీక్, దీపల అన్యోన్యత చూసి కోపంతో రగిలిపోతున్న మోనిత :
ఇంతలో శివలత వచ్చి మోనితను లాక్కెళుతుంది.. గుడిలో గొడవవద్దు వెళదాం రండి అని తీసుకెళ్లిపోతుంది. ఇక కార్తీక్ దీపాలు వెలిగించడం అయిపోయిందా అని అడిగితే.. పొద్దుపోయాక నీళ్లలో వెలిగించేదే కార్తీకదీపం అది కూడా మీ చేత్తో వెలిగిస్తారా అని అడుగుతుంది. సరే పద అంటాడు… మెట్లపై నుంచి దీప తూలిపడబోతుంటే కార్తీక్ పట్టుకుంటాడు. మళ్లీ చూసిన మోనిత గొడవకు సిద్ధమవుతుండగా శివలత లాక్కెళ్లిపోతుంది.నిన్న పూజకోసం పదివేలు ఇచ్చాడు..ఇప్పుడు తనతో కలసి దీపం వెలిగించాడు అని మనసులోనే రగిలిపోతుంది.
మోనితను కూల్ చేసిన శివలత :
కళ్లముందే భర్త…వేరే ఆడదానితో తిరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటారు.. మీ దగ్గర లేనిదేంటి తన దగ్గర ఉన్నదేంటి అంటుంది శివలత. ఇక మోనిత మనసులో ఆ దీప..కార్తీక్ భార్య అన్నవిషయం శివలతకు తెలియదు అనుకుంటా అని అనుకుంటుంది.ఇక దీప…మోనితకు ఎదురుపడుతుంది.నువ్వు ఎన్నిదీపాలు వెలిగించినా కార్తీక్ నీ సొంతం కాలేడు అంటుంది మోనిత.ఆయనకు ఏమీ గుర్తులేకపోయినా..నా పక్కనే ఉండి దీపం వెలిగించేలా చేశాడు దేవుడు..ఇంతకన్నా కావాల్సింది ఏంటి. అదీ భార్య భర్త బంధం అని అంటుంది దీప.
మోనిత, దీపల మధ్య మాటల యుద్ధం :
డాక్టర్ బాబు నా పక్కనే ఉన్నారు రక్షణగా..ఇప్పుడేం చేస్తావ్ అంటుంది.ఆ రక్షణ గోడనే కూల్చేస్తాను..నాకు నచ్చింది దక్కించుకునేందుకు ఎంత పోరాటం అయినా చేస్తాను.. నాకు దక్కనిది ఇంకెవ్వరికీ దక్కనివ్వను అంటుంది మోనిత.మోనిత అని దీప గట్టిగా అరిసి… నా భర్త నాతో కలసి దీపం వెలిగిస్తే నువ్వు తట్టుకోలేకపోవడం ఏంటి అంటుంది.. కార్తీక్ నా భర్త…నా ప్రియుడు అంటుంది మోనిత… ఇక రేపటి ఎపిసోడ్ లో దీప గుడిలో దీపాలు వెలిగిస్తుండగా నీటిలో తోసేయ్యాలని మోనిత ప్రయత్నిస్తుండగా కార్తీక్ వెళ్లి మోనితను లాక్కొస్తాడు.