Krishna Mukunda Murari: కృష్ణ తనకు సంబంధించినవి ఏవి నా దగ్గర ఉండకూడదు అనుకుంటుంది. అలాంటప్పుడు తను ఇచ్చిన గిఫ్ట్ కూడా నాకెందుకు అని చెప్పి కృష్ణ ఎంతో ప్రేమగా ఇచ్చిన కృష్ణుడు బొమ్మను కూడా మురారి తిరిగి తనకు ఇచ్చేస్తాడు. కృష్ణ మురారి ఆ కృష్ణుడు బొమ్మను చూస్తూ మనసులో మూగగా రోదిస్తుంది. కృష్ణ మురారి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కానీ పైకి చెప్పలేక ఇద్దరు లోలోపల బాధపడుతున్నారు.

Krishna Mukunda Murari: ముకుందకి నిజం చెప్పేసిన కృష్ణ.. మురారికి దూరమవుతుందా.!?
అలేఖ్య ముకుంద దగ్గరకు వస్తుంది. అనుకున్న అలేఖ్య నువ్వు వస్తావని, అదేంటి నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ముందే నికే కదా తెలిసేది అందుకే అన్నాను. కృష్ణ వాళ్ళ ఊరు వెళ్లి పోతుందా, కృష్ణ క్యాంపు అని చెప్పి ఇంకా శాశ్వతంగా వాళ్ళ ఊరు వెళ్లి పోతుందా అని ముకుందని అలేఖ్య అడుగుతుంది. ఏమైనా నీ ప్లాన్ సూపర్ ముకుందా.. నువ్వు అనుకున్నది చేశావు అని అలేఖ్య అంటుంది. చూడు అలేఖ్య నేను కృష్ణ ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకోలేదు. నా ప్రేమ గెలిస్తే చాలు అనుకున్నాను. నా లక్ష్యం నా ప్రేమ గెలవడం.. అంతేకాని కృష్ణ ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోవడం కాదు అని అలేఖ్య అంటుంది. అలేఖ్య మనసులో మాత్రం తను వెళ్తేనే గా మురారి నీకు దక్కేది.. అది పైకి అంటే ఒప్పుకోవు అని మనసులో అనుకుంటుంది అలేఖ్య..

Nuvvu Nenu Prema : పద్మావతి తన కూతురు కాదని, తేల్చి చెప్పిన భక్త.. తండ్రి కోసం తపించిన పద్మావతి…
కృష్ణ మురారి నీ ఒక 15 నిమిషాలు గదిలో నుంచి బయటకు వెళ్ళమని చెబుతుంది. నేను చీర మార్చుకోవాలి అని అంటుంది. సరే అని మురారి బయటకు వెళ్తాడు. కృష్ణ తన చీర కొంగు లో దాచిన ఫ్లూటు బయటకు తీసి చూస్తుంది అందరికీ వాళ్లకు నచ్చిన విధంగా గిఫ్టులు ఇచ్చాను కానీ మీకు మాత్రం ఈ వేణువును ఇస్తున్నాను దీనిని విసిరి కొట్టకండి ఏసిపి సర్ దీనిని చూసినప్పుడల్లా నేను మీకు గుర్తు వస్తాను కదా అని కృష్ణ మనసులో అనుకుంటుంది. కాసేపటి తర్వాత కృష్ణ రూమ్ తలుపు ఓపెన్ చేస్తుంది. మురారి కృష్ణ ని తదేకంగా అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటి ఏసీపీ సర్ అలా చూస్తున్నారు. అర్థమైంది.. మీరు నేను చీర మార్చుకోలేదనే ఆలోచిస్తున్నారు కదా.. కానీ నేను ఎందుకు బయటకు వెళ్ళమన్నాను అని అనుకుంటున్నారు. ఆ విషయం నేను రేపు వెళ్ళిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది అని కృష్ణ అంటుంది.

గౌతమ్ నందిని పిలుస్తాడు. తనతో ఈ ఇంట్లో వాళ్ళందరూ నాతో చాలా చక్కగా కలిసిపోయారని, మీ కుటుంబం చాలా మంచిదని, ఇంత త్వరగా వీళ్ళందరూ నాతో కలిసిపోతారని అస్సలు అనుకోలేదు అని గౌతమ్ నందిని తో మాట్లాడుతూ ఉంటాడు. కానీ నందిని గౌతమ్ చెప్పే మాటలను పట్టించుకోదు. ఇక తనే దగ్గరికి వచ్చి ఏమైంది నందిని ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు అని గౌతమ్ అడుగుతాడు. అబ్బా ఏం లేదు గౌతం అని నందిని అంటుంది. లేదు లేదు నువ్వు మురారితో మాట్లాడిన దగ్గర నుంచి ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు. నాతో చెప్పు నేను కూడా హెల్ప్ చేస్తాను కదా అని గౌతమ్ అంటాడు. అప్పుడు నందిని మురారి కృష్ణను ప్రేమిస్తున్నాడని.. కానీ కృష్ణ మురారి ప్రేమను అర్థం చేసుకోవడం లేదని.. తనకి మురారి అంటే గౌరవం తప్ప మరే భావన లేదు అని నందిని అంటుంది. ఎలాగైనా వాళ్ళిద్దరినీ ఒకటిగా చేయాలి అని నందిని చెబుతుంది. ఈ విషయంలో నేను నీకు హెల్ప్ చేస్తాను. వాళ్ళిద్దరూ కలిసి ఉండేలాగా ఓ ప్లాన్ చేద్దాం అని నందిని తో గౌతం అంటాడు.

మరోవైపు రేవతి దేవుడు ముందు కృష్ణ మురారి ఇద్దరూ కలిసి ఉండేలాగా చేయమని వేడుకుంటుంది. మీ సమక్షంలోనే వాళ్ళిద్దరి కి సంబంధించిన ఎన్నో పూజ కార్యక్రమాలు చేశాను. అయినా నీకు కనికరం లేదా దేవుడా వాళ్ళిద్దరూ ఈ ఇంట్లో చక్కగా కలిసి ఉండేలా చూడు స్వామి, కృష్ణ ఈ గడప దాటకుండా ఈ ఇంట్లోనే ఉండేలాగా చూడమని రేవతి దేవుడిని ప్రార్థిస్తుంది.

కృష్ణ మురారి కంటే ముందే లేచి తనని చూస్తూ ఉండిపోతుంది. తనకు దగ్గరగా వెళ్లి మురారి కి దిష్టితీస్తుంది. అంతలో మురారి లేచేసరికి తనకి దూరంగా జరిగి గుడ్ మార్నింగ్ ఏసిపి సార్ అని చెబుతుంది. ఇక ఒకరినొకరు చూసుకోవటంలో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.