Krishna Mukunda Murari: కృష్ణ గడియారం లో ముల్లులు తిరగడం లేదని టైం కరెక్ట్ గా అడ్జస్ట్ చేయాలని అనుకుంటుంది. కానీ టైం ఎంత తెలియకుండా ఎలా అడ్జస్ట్ చేస్తాం అనుకుంటూ గడియారం సెట్ చేయడానికి కుర్చీ మీద నుంచి దూకి పడిపోతుండగా.. మురారి వచ్చి గట్టిగా పట్టుకుంటాడు ఇక కృష్ణ టైం సెట్ చేస్తుంది. అందరి టైం బాగుంటుంది కానీ నా టైం బాగోలేదు అని మురారి అంటాడు. ఇక మురారి రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్ళబోతుండగా.. కృష్ణ పెద్ద క్యారేజీ తీసుకొచ్చి తన ఎదురుగా పెడుతుంది ఏంటి కృష్ణ ఇది మా ఆఫీసులో అందరికీ భోజనాల అని మురారి అడుగుతాడు.

మీ ఒక్కరి కోసమే చికెన్ మటన్ అన్నీ కలిపి ఉండను ఈ ఇంట్లో వాళ్ళు మనం సరిగ్గా భోజనం చేయడానికి కూడా ఊరుకోవట్లేదు కదా అందుకే నేనే మీకోసం స్వయంగా చేశాను అని కృష్ణ అంటుంది హాస్పిటల్ కి వస్తుంది తను హాస్పిటల్ కి రాగానే ఎదురుగా తన ఊర్లో అంజయ్య బాబాయ్ కనిపిస్తాడు ఏమైంది. బాబాయ్ ఇలా వచ్చారంటే.. మా అబ్బాయికి బాగట్లేదు ఐసీయూలో జాయిన్ చేసాము అని కృష్ణతో చెబుతాడు ఆ అబ్బాయికి ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్ కూడా సక్సెస్ అవుతుంది. ఇక కృష్ణ ఆ అబ్బాయికి కావాల్సిన మెడిసిన్ అన్ని తీసుకువచ్చి వాళ్ళ బాబాయ్ కి ఇస్తుంది. ఎన్ని రోజుల నుంచి నువ్వు ఎలా ఉన్నావో కూడా నేను పట్టించుకోలేదు అమ్మ కృష్ణ కానీ నాకు సమస్య ఉంది అని తెలియగానే నువ్వే దగ్గరుండి పరిష్కరిస్తున్నావు. నీకు అంత మీ నాన్న లాంటి మంచి మనసు ఉండమ్మా అని ఆయన అంటాడు.

Brahmamudi: ఇంద్రాదేవి ప్లాన్ తో ఒక్కటవ్వబోతున్న కావ్య,రాజ్.. రాహుల్ కు షాక్ ఇచ్చిన కళ్యాణ్..
కృష్ణ వాళ్ళ నాన్న స్నేహితుడు కూడా అక్కడికి వస్తాడు మురారితో ఎలా ఉంటుంది. నీ లైఫ్ అని అడిగితే నాన్నను చంపారన్న బాధ తప్ప ఇంకేమీ లేదు అని కృష్ణ అంటుంది. నాన్న చావుకి ఆయనే కారణం అన్న బాధ కోపం తప్ప, ఆయనలో వెతికిన ఏ లోపము కనిపించదు అని కృష్ణ వాళ్ళ బాబాయ్ తో చెబుతుంది. మీ నాన్న చావుకి ఏసీబీ సార్ కారణమేంటమ్మా నువ్వే మాట్లాడుతున్నావ్ నాకు అర్ధం కావట్లేదు. నువ్వు ఈ విషయంలో చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అమ్మ ఏసీబీ సార్ ని. నువ్వు ఎక్కడో ఏదో పొరపాటు పడుతున్నావు. ఆరోజు ఎలాగైనా సరే శివన్నను అరెస్టు చేయాలని ఏసిపి గారు నాన్న ఇద్దరూ కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకున్నారు.

అయ్యో నువ్వు ఏసీబీ సార్ ని తప్పుగా అనుకుంటున్నావ్ అమ్మ మీ నాన్న కోడ్ లాంగ్వేజ్ లో తనని చంపమని మురారికి సైగ చేశాడు. ఆ సైగల్లోనే మురారి తనని షూట్ చేసినప్పుడు మీ నాన్న తప్పుకోవాలి కానీ అలా మిస్ ఫైర్ అయ్యింది అని ఆయన చెబుతారు. మురారి ముందు నుంచి తన తండ్రిని చంపలేదని చెబుతున్నా కానీ కృష్ణ పట్టించుకోలేదు. ఈరోజు తన బాబాయ్ నోటు నుంచి ఆ నిజం తెలుసుకున్న కృష్ణ వెంటనే దేవుడి గుడికి వెళ్లి మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేస్తుంది.
Nuvvu nenu prema: విక్కీ- పద్మావతిల రొమాన్స్.. అరవిందను చంపడానికి కృష్ణ ప్లాన్..
ఇక ఏసీబీ సార్ భార్య అని తెలుసుకున్న ఆ పంతులుగా వెంటనే మురారి కి ఫోన్ చేసి గుడికి రమ్మని చెబుతాడు. అప్పటికే కృష్ణ మెట్ల గుడిలోకి వెళ్తుంది. ఎవరో పక్కగా వెళ్తున్న ఆవిడ చేతి కలిగి పువ్వులన్ని వచ్చి మురారి కాళ్ళ ఎదుట నా పడతాయి . కృష్ణ మురారి కాళ్ళకు దండం పెడుతుంది. మురారి కృష్ణ తప్పుని క్షమించి ఇద్దరు ఒకటైపోతారా వీళ్ళిద్దరూ ఒకటే పోతే ముకుంద ఏం చేస్తుందో చూడాలి.