Krishna Mukunda Murari: నందిని టాబ్లెట్స్ వేసుకోకపోవడంతో ఇంట్లో అందరూ కలిసి బలవంతంగా టాబ్లెట్స్ వేస్తారు. నందిని పెద్దపెద్దగా కృష్ణ మురారి రండి అంటూ అరుస్తుంది. ఆ మాటలకు మురారి కృష్ణ కి ఎందుకు వస్తారు. అత్తయ్య ఈ టాబ్లెట్ వేయకూడదు తనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని కృష్ణ చెబుతుంది.. నందిని కూడా నాకు ఈ టాబ్లెట్ వేసుకుంటే తల పగిలిపోతున్నట్టు త్వరలో నరాలు చిట్లిపోతున్నట్లు ఉంటాయి అని చెబుతుంది. ఈ టాబ్లెట్ వేయడం వల్ల నందిని కి మీరందరూ కలిసి తనకు స్లో పాయిజన్ ఇస్తున్నట్లే ఇవ్వద్దు అని అంటుంది కృష్ణ..

ఇక ఈ విషయంలో ముకుందా కల్పించుకొని నువ్వేమీ పెద్ద డాక్టర్ వి కాదు ఈ మందులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇంట్లో ఎవ్వరూ వాడారు కదా అయినా పెద్ద అత్తయ్యకి అడ్డు వెళ్ళెంత పెద్దదానివి అయిపోయావా అని ముకుందా పుల్లలు పెట్టేవారు చేస్తుంది. ఇక ఆ మాటలకు కోపం వచ్చినా మురారి నా భార్యను అంత తేలిగ్గా తీసిపారేయకు తను ఎంబిబిఎస్ లో దిష్టి టాపర్ అని మురారి గుర్తు చేస్తాడు అయినా కానీ భవాని నందినీకి టాబ్లెట్లు వేయబోతుండగా అడ్డుపడి నందిని నువ్వు రూమ్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకోమని కృష్ణ తనని అక్కడి నుంచి పంపించేస్తుంది. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి పది రోజుల్లో తనని నేను మామూలు మనిషిని చేస్తాను అని కృష్ణ అంటుంది..
భవాని ఈ విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా తన దగ్గరికి ఈశ్వర్ ప్రసాద్ ఇద్దరు వస్తారు మాకే నందిని గురించి బాధగా ఉందంటే నీకు ఇంకా ఎంత బాధగా ఉంటుందో అర్థమవుతుంది వదిన ఏం చేద్దాము అని అడుగుతారు . కృష్ణ కూడా నందినిపై మన అందరికంటే కాస్త ఎక్కువ ప్రేమలే చూపిస్తోంది. నందినీకి తగ్గిపోయి మామూలు మనిషి కావాలని అందరం కోరుకుంటున్నాము.. ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు వదిన అంటూ ఈశ్వర్ భవానీ తో అంటాడు..
నాకు కూడా అదే అనుమానంగా ఉంది మొన్న నందిని సిద్దు గురించి చెప్పింది కదా ఆ మాట నోట్ చేసుకొని.. కృష్ణ నందిని గుర్తు తెలుసుకోవడానికి ఇదంతా చేస్తుందని కృష్ణ పై అనుమానం పడుతుంది. ఏది జరిగినా సరే ఈ ఇంటి గుట్టురట్టు కాకుండా చూసుకునే బాధ్యత నాది అని భవాని మనసులో అనుకుంటుంది. ఇక కృష్ణ వంట చేయడానికి కిందకు వస్తుంది. నేను చేస్తానులే అని రేవతి అంటుండగా.. అసలు నండి మీకు ఏమైంది అత్తయ్య అని మాటల్లో అడుగుతుంది.
కృష్ణ తనకి మతిస్థిమితం లేదమ్మా అని చెప్పి రేవతి అంటుంది మీరెవరు తన గురించి చెప్పరని నాకు తెలుసు .. తనకి తన కండిషన్ నార్మల్గా చేసి నేనే అసలు విషయాన్నీ తెలుసుకుంటాను అని కృష్ణ అంటుంది .. ఇక కృష్ణ వెళ్ళిపోగానే రేవతి మనసులో ఇప్పటివరకు నేను చేయని పనిని నువ్వు చేసావు కృష్ణ. నాకు చాలా గర్వంగా ఉంది నిన్ను చూస్తుంటే అని రేవతి మనసులో కృష్ణను మెచ్చుకుంటుంది. ఇక మురారి కి కాఫీ తీసుకెళ్లడం ఇద్దరి మధ్య సంభాషణలు జరుగుతుండగా .. ముకుందా చాటుగా వాళ్ళిద్దర్నీ గమనించడం , వాళ్ళిద్దరూ దగ్గరవుతుండగా ముకుందా చూసి తట్టుకోలేకపోవటం, ఇద్దరు కలిసి బయటకు వెళ్తే వాళ్ళిద్దరి మధ్య ఏకాంతాన్ని డిస్టర్బ్ చేయడానికి ముకుందా అక్కడకి కూడా వెళ్తుంది.