Krishna Mukunda Murari: ప్రస్తుతం స్టార్ మా చానల్లో ప్రసారమవుతూ గత ఆరు నెలలకు పైగా ప్రేక్షకులను అలరిస్తున్న లేటెస్ట్ సీరియల్ కృష్ణ ముకుంద మురారి.. ఈ సీరియల్ ఆద్యంతం ట్విస్టులతో కొనసాగుతూ ప్రేక్షకులను టీవీకే కట్టిపడేస్తోంది. ఇప్పటికే ఈ సీరియల్ లో నటిస్తున్న నటీనటులు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని.. తమ నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇకపోతే ఈ సీరియల్లో ముకుంద క్యారెక్టర్ లో నటిస్తున్న యష్మీ గౌడ కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుందని చెప్పాలి.

చూడ చక్కని మోము.. అంతకు మించిన అందం.. నటనతో .. యువతను సైతం మంత్రముగ్ధులను చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తన అద్భుతమైన డ్రెస్సింగ్ సెన్స్ తో అమ్మాయిలకు మరింతగా నచ్చేసింది అని చెప్పాలి. చాలావరకు ఈమె ధరించే ట్రెడిషనల్ వేర్ ను అమ్మాయిలు ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలోనే కాస్త సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో వాలిపోయే యష్మీ గౌడ తాజాగా మరొక లేటెస్ట్ ఫోటోషూట్ ను ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది. ఇక ఈమె షేర్ చేసిన ఈ ఫోటో షూట్ చూసి యువత సైతం మంత్రముగ్ధులవుతున్నారు.
శ్రేహ డిజైనర్స్ వారు డిజైన్ చేసిన లంగా వోణీలో కనిపించి అద్భుతంగా ఆకట్టుకుంది. కలంకారీ డిజైనింగ్ లో ఉన్న ఈ లంగా..అందుకు తగ్గట్టుగా మ్యాచింగ్ పింక్ కలర్ ఓనీ ధరించి మరొకసారి తన అందంతో మంత్రముగ్ధుల్ని చేసింది. పచ్చటి మొక్కల మధ్య.. రాతిపై కూర్చుని తన అందాలతో అందరినీ ఆకట్టుకుంది

అసలే వర్షాకాలం పైగా వాతావరణం కూడా చల్లగా ఉండడంతో ఇలాంటి సమయంలో ఈమె తన ముగ్ద మనోహరమైన అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పవచ్చు. మొత్తానికైతే లంగా వోనిలో యువతను కట్టిపడేస్తున్న ఈ ముద్దుగుమ్మ తన డ్రెస్సింగ్ సెన్స్ తో మరొకసారి అమ్మాయిలకు తెగ నచ్చేసింది అని చెప్పాలి. ప్రస్తుతం యష్మీ గౌడ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram