Krishna Mukunda Murari: నిన్నటి ఎపిసోడ్ లో కృష్ణ మురారితో సంతోషంగాగడపాలి అని అనుకుంటుంది.ఇక ముకుంద కి కృష్ణ తన ప్రేమ విషయం తెలిసే ఇంట్లో ఉంటుంది అని అర్థం అవుతుంది. ఇక అలేఖ్య తో కలిసి కృష్ణ ని దెబ్బ కొట్టాలి అనుకుంటుంది. అలేఖ్య సరే అని ముకుంద కి హెల్ప్ చేయడానికి ఓకే అంటుంది. భర్తల దినోత్సవం అని కృష్ణ చేసిన ప్లాన్లోకృష్ణని ఇరికించాలనుకుంటుంది ముకుంద.ఇంట్లో అందరికీ ప్రసాదం పెడుతుంది రేవతి కృష్ణ కూడా ప్రసాదం పెట్టి ఇది భార్యాభర్తలిద్దరూ తినాలి అని అంటుంది. ఇక ముకుంద ప్లాన్ తో ఆ ప్రసాదాన్ని కింద పడేలా చేస్తుంది.

ఈరోజు271 వ ఎపిసోడ్ లో కృష్ణ తన చేతిలో ప్రసాదం కింద పడినందుకు చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అది గమనించి ముకుందా చాలా సంతోషపడుతుంది. మధు సారీ కృష్ణ నావల్లే ప్రసాదం కింద పడింది అని అంటాడు. ముకుంద అలేఖ్య నువ్వు బాగా చేశావు నీ మీద తప్పించుకోకుండా మధు మీద అనుకునేలాగా చాలా సూపర్ గా ప్లాన్ చేసి కృష్ణ ప్రసాదాన్ని కింద పడేసావు అని మనసులో అనుకుంటుంది. వెళ్లి మళ్లీ ప్రసాదం తెచ్చుకోమ్మా అని అంటాడు ప్రసాదు. లేదు మావయ్య చిన్న అత్తయ్య మొత్తం నాకే పెట్టేసింది అంటుంది ముకుంద. ఇక కృష్ణ ఎలాగూ అని ఆలోచిస్తుంటే, ముకుంద పర్వాలేదు నా దగ్గర ప్రసాదం ఉంది కదా,అప్పుడే అక్కడికి వచ్చిన మురారి ఏమైంది అని అడుగుతాడు.ప్రసాదం నావల్ల కింద పడిపోయింది అంటాడు మధు. ఇట్స్ ఓకే మధు ఇప్పుడేం చేద్దాం కృష్ణ అంటాడు. కృష్ణ అప్పటికే ఏడుస్తూ ఉంటుంది. నీకు అభ్యంతరం లేదంటే నా దగ్గర ఉన్న ప్రసాదం మీరిద్దరూ తినండి అంటుంది ముకుంద. ఆదర్శ లాగు ఇక లేడు కాబట్టి ఇది నేను ఒక్కదాన్నే తిన్న ఫలితం ఉండదు కదా అదే మీకు ఇష్టముంటేఈ ప్రసాదాన్ని మీరిద్దరూ తినండి అంటుంది ముకుంద.కృష్ణ ముకుంద దగ్గర ప్రసాదం తీసుకొని,మురారి కి పెడుతుంది మురారి చాలా సంతోష పెడతాడు. ఇక మురారి తినంగల్ని వెంటనే ప్రసాదాన్ని ముకుంద తింటుంది. భారత తిన్న తర్వాత భార్య తినాలి అని రేవతి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంది కృష్ణ కావాలనే ఇదంతా ముకుంద చేసినట్టు తనకే అర్థమవుతుంది. వెంటనే మనసులో కృష్ణ నిన్ను నమ్మి చాలా తప్పు చేశాను ముకుంద ఇక ఇప్పుడు చెప్తాను నీకు నేనంటే ఏంటో చూపిస్తాను దీనికి తగినట్టు నీ మీద ఇంతకి ఇంత వడ్డీతో సహా చెల్లిస్తాను అని అనుకుంటుంది. ముకుంద మనసులో నేను అనుకున్నది సాధించగలిగాను అని అనుకుంటుంది.
Krishna Mukunda Murari: ముకుంద కి బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలంటే ఈ క్వాలిటీస్ ఉండాలంట..!

మురారి కి సన్మానం..
ఇక ఇంట్లోనే స్టేజి ఏర్పాటు చేసి అక్కడ కృష్ణ మైక్ లో మాట్లాడుతూభర్తల దినోత్సవం నాడు నేను నా భర్తకు సన్మానం చేసి తన గురించి రెండు మంచి మాటలు చెప్తాను అని అంటుంది.ఇక మురారిని స్టేజ్ మై కి పిలుస్తుంది కృష్ణ మురారి కి దండ వేసి, శాలువా కప్పి, మురారి గురించి చెప్పడం మొదలు పెడుతుంది. ఏ భార్య అయినా తన భర్తతో ఫ్రెండ్లీగా ఉండాలి అని కోరుకుంటూ నేను కూడా అలానే కోరుకుంటున్నాను. మేము అలానే ఉంటాం కూడా, కానీ నేను ఒక విషయంలో చాలా అదృష్టవంతురాలిని ఎందుకంటే ఎసిపి సార్ పేరుకే పెద్ద పోలీస్ ఆఫీసర్ కానీ ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం. నేను అందుకే అయింది ఏబిసిడిలు అబ్బాయి అని పిలుస్తుంటాను. ఇక ఏసీబీ సార్ కి ఇష్టమైంది క్రికెట్, ఇష్టమైన హీరో రజనీకాంత్, ఇక తనకి అసలు ఆర్మీలో చేరాలన్న కోరిక ఉండేది ఆదర్శ కోసం పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. ఆదర్శ అంటే తనకి ప్రాణం.ఇలాంటి భర్త దొరకడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని అంటుంది. అలాగే ఈరోజు నేనుమురారి సార్ కి ఒక ప్రామిస్ చేస్తున్నాను.నేను ఎప్పటికీ తనతోనే ఉంటాను అని మురారి చేతిలో చేయి వేసి చెబుతుంది కృష్ణ. మిమ్మల్ని ఎప్పటికీ నేను దూరం చేసుకోను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా మిమ్మల్ని మాత్రం దూరం చేసుకోను అని అంటుంది ఆ మాటకి రేవతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చప్పట్లు కొడుతూ తన ఆనందాన్నిఅందరికీ తెలిసేలా చేస్తుంది రేవతి. ఇక కృష్ణ అన్న మాటలకి ముకుందా చాలా రగిలిపోతుంది మనసులో, తర్వాత మురారి కోసం కృష్ణ పాట పాడుతుంది. మనసున ఉన్నది చెప్పాలని ఉన్నది అని పాటని కృష్ణ మురారి కోసం పాడుతుంది.

ముకుంద మనసులో మాట..
ఇక కృష్ణ ఇప్పుడు ముకుంద వచ్చి స్టేజి మీద ఆదర్శ్ గురించి రెండు మాటలు చెప్పి తనకి ఇష్టమైనవి గురించి మాట్లాడుతుంది. అని ముకుందని స్టేజ్ పైకి రమ్మంటుంది. ముకుందా స్టేజ్ పైకి వెళ్లి, ఆదర్శ్ కి ఇష్టమైనది అంటూ ఏదైనా ఉంటే అది మురారి మాత్రమే, మురారి కోసమే తను అన్ని చేశాడు. ఆదర్శకిష్టమైన సినిమా మురారి. ఎందుకంటే ఆ సినిమాలో మురారి అన్న పేరు ఉంది కాబట్టే ఆదర్శంగా సినిమా ఇష్టం. అసలు మురారి ఆదర్శ ఇద్దరు వేరు కాదు, ఒకటే రెండు ఆత్మలు కలిసి ఒకటిగా ఉంటున్నదే మురారి. ఇలా ప్రతి మాటకి ముందు వెనక మురారి మురారి అని చెప్పడంతో, మధు ఫాదర్ కి డౌట్ వస్తుంది. ఏంటి ముకుందా ఆదర్శ గురించి చెప్తుందా లేదా మురారి గురించి చెప్తుందా అని అంటాడు. వెంటనే మీరు కాస్త ఆపుతారా అంటుంది మధు మదర్. ఇక ముకుందా మురారిని ఊహించుకొని ఆదర్శ కోసం నేను ఇప్పుడు డాన్స్ చేస్తాను అని మురారి ఏ స్టేజ్ మీదకి వచ్చినట్టు అనుకొని డాన్స్ వేస్తుంది. ఇక తర్వాత ముకుందా మురారిని చూస్తూ క్లాప్స్ కొట్టి నేను మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాను ఆదర్శ కోసం ఆదర్శ్ వచ్చిన తర్వాత మురారి ముందు ఆదర్శ్ కి ఒక మాట ఇస్తాను అని అంటుంది.

మధుకి సన్మానం..
అలేఖ్య మధు కి సన్మానం చేస్తుంది. మధు అంటే నాకు చాలా ఇష్టం. తనకి సినిమాలంటే చాలా ఇష్టం. ఇదిగో ఈ నగలు చేయించింది మధు చార్మినార్లో, ఈ జుంకాలు తీసుకుంది జాతరలో, మీరందరూ మధు నాకు తక్కువ కాస్ట్ పెట్టుకొని ఇచ్చాడు అని అనుకుంటున్నారా కాదు తను నా మీద చూపించిన ప్రేమ గురించి చెప్తున్నాను అని అంటుంది. అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీ అందరి ముందు నేను ఒక ప్రామిస్ చేస్తాను అదేంటంటే మధు నెక్స్ట్ బర్త్డే రోజు కల్లానాకు వడ్రాణం చేయిస్తాడు.అని మధు ని చూసే నవ్వుతూ చెప్తుంది అలేఖ్య. మధుఇంట్లో అందరూ నవ్వుకుంటూ ఉంటారు.చాలు నీ భర్త గురించి నువ్వు బాగా చెప్పావు కదా అంటాడు మధు. మధు ఫాదర్ కి సన్మానం చేయమని చెప్తుంది కృష్ణ. చిన్న అత్తయ్య చిన్న మామయ్యఇప్పుడు స్టేజ్ మీదకు వస్తారు అంటుంది కృష్ణ.ఇక ప్రసాద్ కి సన్మానం చేస్తుంది.అదేంటి మా ఆయన గురించి చెబుదామంటే మైక్ పని చేయట్లేదు అని అంటుంది. ఇక అందరూ నవ్వుకొని కిందకు దిగుతారు.

భర్తల దినోత్సవం ఫైనల్ టాస్క్..
ఇక అంతా అయిపోయింది కదా అంటుంది భవానీ దేవి. లేదు పెద్ద అత్తయ్య ఇంక ఒకే ఒక చివరి టాస్క్ మిగిలింది అంటుందికృష్ణ.అదేంటో చెప్పు అంటుంది భవానీ దేవి ఇప్పుడు జల్లెడలో నిండు చందమామని చూసి తరువాత తన భర్తలను చూస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు అని అంటుంది.ఇప్పుడు టెర్రస్ మీదకి వెళ్తారా అంటుంది భవాని దేవి లేదు బయటికి వెళ్లి చూస్తాను అని అంటుంది. సరే మీరు కానివ్వండి నేను రెస్ట్ తీసుకుంటాను కాసేపు అని భవాని దేవి వెళ్ళిపోతుంది ఇక అందరూ బయటికి వస్తారు. ముకుంద ఇప్పుడు నేను జల్లెడలో ఆదర్శం ఫేస్ కాదు చూసేది మురారి ఫేస్ చూడాలి అని అనుకుంటుంది.కృష్ణ మురారిని ఎదురుగా నిల్చోపెట్టి జల్లెడలో చంద్రుని చూసి మురారిని చూస్తుంది.ముకుంద రగిలిపోతూ ఉంటుంది కృష్ణ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ మురారిని చూస్తుంది. తర్వాత చిన్న అత్తయ్య చిన్న మావయ్య మీరు కూడా కానివ్వండి అంటుంది వాళ్లు కూడా అయిపోయిన తర్వాత ఇక మధు వచ్చి ఆదర్శ్ ఫోటో తీసుకువచ్చాను దాముకుందా నువ్వు ఇప్పుడు చంద్రుడిని చూసి ఆదర్శ ఫోటో ని చూడు అని అంటాడు. అలేఖ్య కావాలని మధు నువ్వు ఆదర్శ ఫోటో పెట్టుకుంటే బాగోదు మురారి ఆదర్శ్ కి ఇష్టం కాబట్టి మురారినే పట్టుకుంటాడు అని అంటుంది. ఒకసారిగా కృష్ణ షాక్ అవుతుంది కావాలనే ఇదంతా చేస్తున్నారని కృష్ణకు అర్థం అవుతుంది. ముకుంద హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రసాదు మురారినే పట్టుకోమనురా ఏముంది అందులో అంటాడు కృష్ణ అడ్డుపడుతుంది కానీ నువ్వు వెళ్లి పట్టుకో మురారి అని అంటాడు ప్రసాదు. ముకుందని నువ్వు వెళ్లి చూడమ్మా అని అంటాడు. ముకుందా కావాలని మురారినే చూస్తుంది ఆదర్శ ని చూడకుండా, అది గమనించి కృష్ణ చాలా బాధపడుతుంది.

రేపటి ఎపిసోడ్ లో,మురారినీకు తాళి కట్టక ముందే నాకు ప్రియుడు అని అంటుంది కృష్ణతో ముకుంద. ఆ మాట చెప్పడానికి నీకు ఎలా ఉన్నా వినడానికి నాకు అస్సలు బాగాలేదు నా భర్త నాకే సొంతం అంటుంది కృష్ణ. అది నేను ఉండంగా జరగనివ్వను అని అంటుంది చూద్దాం ఎలా జరగనివ్వవో నీ కళ్ళ ముందే అంతా జరుగుతుంది అని విజిల్ వేస్తుంది కృష్ణ. అప్పుడే ప్రభాకర్ ఈ సీరియల్ లోకి ఎంట్రీ ఇస్తాడు చూడాలి ప్రభాకర్ క్యారెక్టర్ ఏంటో రేపు ఎలా ఉండబోతుందో..