NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: తల్లిని నిలదీసిన మురారి.. ముకుంద భయం.. కృష్ణ నిజం చెప్పనుందా?

Krishna Mukunda Murari Today Episode December 11 2023 Episode 336 Highlights

Krishna Mukunda Murari:నిన్నటి ఎపిసోడ్ లో కృష్ణ భర్త ఎవరో కనుక్కోవడానికి మధు ని అడుగుతాడు మురారి. మధు నిజం చెబుదామనుకునే టయానికి ముకుంద కాల్ చేసి, మధు ని బెదిరిస్తుంది. ఈ నిజం కనుక నువ్వు మురారి కి చెప్తే భవానీ దేవి అత్తయ్యకి నీ గురించి చెప్పేస్తాను నువ్వే నిజం చెప్పావు అన్న విషయం బయటకు వస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని ముకుందా మధుని బెదిరిస్తుంది మధు అంతటితో నిజం చెప్పకుండా మురారిని అక్కడి నుంచి తీసుకొని బయటికి వస్తాడు. మురారి కాపట్నుంచి అనుమానంగా ఉంటుంది ముకుంద ఫోన్ చేసిన తర్వాత మధు నాకు నిజం చెప్పలేదు అంటే ఏదో దాస్తున్నారు అని అర్థం అవుతుంది. మురారి వచ్చే టయానికి నందు మురారి రూమ్ లో ఉంటుంది మురారితో నేను పర్సనల్ గా మాట్లాడాలి నువ్వు బయటికి వెళ్ళు అని నందుతో ముకుందా చెప్పేస్తుంది. మురారి ముకుందని కూడా కృష్ణ భర్త ఎవరు అని తెలుసుకోవడానికి అడుగుతాడు. ముకుంద కృష్ణ భర్త ఎవరో నాకు తెలియదు. నేను తెలుసుకోవాలని కూడా అనుకోవట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. మురారి ఆలోచనలో పడతాడు.

Krishna Mukunda Murari Today Episode December 11  2023 Episode 336 Highlights
Krishna Mukunda Murari Today Episode December 11  2023 Episode 336 Highlights

ఈరోజు ఎపిసోడ్ లో కృష్ణ, వాళ్ల చిన్నమ్మ తో మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడ కోపంగా కృష్ణని తిడుతూ ఉంటుంది నీకు జరిగే అన్యాయం గురించి నువ్వు ఎటువంటి కనీసం నన్ను కూడా మాట్లాడొద్దు అంటున్నావు నేను ఇప్పుడే వెళ్లి వాళ్ళ ఇంటికి వాళ్ళకి చెప్పాల్సింది చెప్పేసి వస్తాను. అని అంటూ ఉండగా కృష్ణ వద్దు అని వాదిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి రేవతి వస్తుంది. ఏంటి వదిన మా కోడలు ఏదో అంటున్నట్టున్నావు అని అంటుంది ఏమంటే ఏముందిలే వదినా మీరంతా ఉండి కూడా దాన్ని అనాధం చేస్తున్నారు అని అంటుంది. ఆ మాటకు రేవతి మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది.

Nuvvu Nenu Prema: కృష్ణ ఆనందానికి చెక్ పెట్టిన అరవింద.. రివైంజీ డోస్ పెంచిన ఆర్య.. రేపటి ట్విస్ట్..?

Krishna Mukunda Murari Today Episode December 11  2023 Episode 336 Highlights
Krishna Mukunda Murari Today Episode December 11  2023 Episode 336 Highlights

శకుంతల బాధ..

రేవతి నాకు మాత్రం జరిగేదంతా బాగుంది అని మీరు అనుకుంటున్నారా వదిన. అన్నయ్య జైలుకి వెళ్లడంతో మా అక్కయ్య అదంతా నిజం అని నమ్మి, ఇప్పుడు పెళ్లి దాకా తీసుకొచ్చింది. ఇప్పుడు నేను కూడా ఏమీ చేయలేకపోతున్నాను అని అంటుంది రేవతి వెంటనే కృష్ణ చిన్నమ్మ నువ్వు లోపలికి వెళ్ళు అని అంటుంది. చూసావా వదిన మీతో మాట్లాడుతున్నాను అని నన్ను లోపలికి వెళ్ళమంటుంది. అని కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. నేనుండి మాత్రం ఏం చేస్తాను నేను బయటకు వెళ్తున్నాను లే, మీ చిన్నాయన చేసినదానికి నువ్వు మాట్లాడేదానికి, నేను ఏమన్నా గానీ మీకు అర్థం కావట్లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్తయ్య మా చిన్నమ్మ మాట్లాడిన మాటలు మీరు ఏమీ అనుకోకండి అని అంటుంది కృష్ణ రేవతి తో, శకుంతల అన్నమాటలకి నేనేం ఫీల్ అవ్వట్లేదు ఎందుకంటే ఆవిడ మాటల్లో నిజం ఉంది. ఆవిడ బాధపడేది నీ గురించే కదా అని అంటుంది రేవతి. ఇంకా భవాని అక్కయ్య అన్నమాట గురించి ఆవిడకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతుందో అని అంటుంది దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటుంది కృష్ణ. చెప్తే నువ్వు కూడా బాధపడతావు కృష్ణ అని అంటుంది. నా కొడుకు కూడా బాధపడుతున్నాడు అని అంటుంది. ముందు విషయం ఏంటో చెప్పండి అత్తయ్య అని అంటుంది కృష్ణ.

Krishna Mukunda Murari Today Episode December 11  2023 Episode 336 Highlights
Krishna Mukunda Murari Today Episode December 11  2023 Episode 336 Highlights

నిజం చెప్పిన రేవతి..కృష్ణ ఆలోచన..

ఇక రేవతి కృష్ణ అడిగిన దానికి, భవాని దేవి అత్తయ్య అన్న మాటలు వింటే నువ్వు చాలా బాధపడతావు అని అంటుంది. విషయం ఏంటో చెప్పండి అని అనగానే, నువ్వు కోనేట్లో దీపాలు వదలడానికి వెళ్తాను అని అన్నావు కదా అప్పుడు భవానీ దేవి అక్కయ్య, కోనేట్లో దీపాలు వదిలితే వాళ్ల భర్తలకు మంచి జరుగుతుందని అలా చేస్తారు అని అంటుంది వెంటనే, మురారి కి నీకు పెళ్లి అయిన విషయం అర్థం అవుతుంది పెళ్లయింది కాబట్టి నీ భర్త ఎవరు అయినా నువ్వు, తనకు ఎక్కడ దూరం అయిపోతున్నావు అన్న ఆలోచనలతో వాడు సతమతమవుతున్నాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుంది రేవతి. పెద్ద అత్తయ్య ఏదో, చాలా తెలివిగలది అని అనుకున్నాను కానీ ఇలాంటి పని చేస్తుందని అనుకోలేదు అత్తయ్య అని అంటుంది కృష్ణ ఏం మాట్లాడుతున్నావ్ కృష్ణ నువ్వు అని అంటుంది రేవతి. ముందరకాళ్ళకి బంధం వేసింది మా అక్క, మురారిని నిన్ను దూరం చేయడానికి అలా చెప్పింది అని అంటుంది రేవతి. అలా చెప్పడం వల్ల మనకి ఒక విధంగా మంచే జరుగుతుంది అత్తయ్య, ఇప్పుడు ఏసీబీ సార్ కి గతంలో జరిగిన, విషయాలన్నీ గుర్తుకు వస్తాయి అప్పుడు ఏదో ఒక్క విషయం నాతో కనెక్ట్ అయ్యేది కనుక గుర్తు వస్తే చాలు మనకి అంత అనుకున్నట్టుగా జరుగుతుంది అని అంటుంది కృష్ణ రేవతి తో, అంటే మురారి కి గతం గుర్తొస్తుంది అంటావా అని అంటుంది రేవతి. కచ్చితంగా గుర్తొస్తుంది అత్తయ్య, ఇది ఒక కోడలిగా చెప్పట్లేదు డాక్టర్ గా చెప్తున్నాను. ఆవిడ అన్న మాటలకి మీ అబ్బాయి ఏమి పట్టనట్టు కూర్చోవట్లేదు కదా కుదురుగా ఉండకుండా ఆలోచిస్తున్నాడు కదా అలాంటప్పుడు ఆలోచనలో నేను గుర్తుకొస్తాను. ఆవిడ మనకి చాలా హెల్ప్ చేసినట్టు ఇప్పుడు నాకు పెళ్లయింది అని తెలిసి ఆ భర్త ఎవరు అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. మీరు దీని గురించి ఆలోచించమాకండి అని అంటుంది కృష్ణ రేవతి తో, ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత నా ప్రాణం హాయిగా ఉంది నేను ఇప్పుడే వెళ్లి నీకు కాఫీ తీసుకొస్తాను అని అంటుంది. మీరు కూర్చోండి నేనే కాఫీ తీసుకొస్తాను అని అంటుంది కృష్ణ రేవతి తో ఇద్దరు సంతోషపడతారు.

Krishna Mukunda Murari: కృష్ణ కోసం మురారి.. భవాని, ముకుంద వెనక్కి తగ్గుతారా.?

Krishna Mukunda Murari Today Episode December 11  2023 Episode 336 Highlights
Krishna Mukunda Murari Today Episode December 11  2023 Episode 336 Highlights

మురారి ఆలోచన..

మురారి ఆలోచిస్తూ తన రూమ్లో కృష్ణ భర్త ఎవరు? ఎవరు ఎందుకు చెప్పట్లేదు నాతో అని అనుకుంటూ ఉంటాడు. అదే టైం కి మధు రూమ్ ముందు నుంచి వెళ్తూ ఉంటాడు. మధుని లోపలికి రమ్మని పిలుస్తాడు కృష్ణ మధు మనసులో ఇప్పుడు కచ్చితంగా కృష్ణ భర్త గురించి అడుగుతాడు చెప్తే ముకుంద బతకనివ్వదు ఏం చేయాలో అని అనుకుంటూ ఉంటాడు. మురారి లోపలికి రా మధు అని అంటాడు వెంటనే మధు లోపలికి వెళ్తాడు. నేను నిన్ను కృష్ణ భర్త గురించి అడిగితే తెలుసు అన్నావు కదా ఎవరో చెప్పు అని అంటాడు మధు తో మురారి. చెబుదామా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా మధుని ప్రసాద్ పిలుస్తాడు. ఇప్పుడే పిలవాలా వీలు కూడా నేను అసలు తన భర్త ఎవరో తెలుసుకుందాం అని అనుకుంటే, వీళ్లంతా కావాలని ఇలా చేస్తున్నారా నిజంగానే పనుండి పిలిచాడా అని అనుకుంటూ ఉంటాడు. గతంలో కృష్ణ, మురారి జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు.

Krishna Mukunda Murari Today Episode December 11 2023 Episode 336 Highlights
Krishna Mukunda Murari Today Episode December 11  2023 Episode 336 Highlights

మధు ఆవేశం..

ఇక మధు ఆవేశంగా వచ్చి మందు తాగుతూ ఉంటాడు. అసలు వేనీ భర్త ఎవరు అని మురారి అన్ని సార్లు అడుగుతున్నప్పుడు నువ్వే అని చెప్తే ఏమవుతుంది ఒక్క మాట చెప్తే వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే అక్కడికి వాళ్ళ నాన్న ప్రసాదు వచ్చి ఏంట్రా నాకు మందుపొయ్య కుండా నువ్వు ఒక్కడివే తాగుతున్నావు అని అంటాడు. నిన్ను చూస్తుంటే నాకు ఒక విషయం చెప్పాలని ఉంది నాన్న చెప్తే ఇప్పుడు నువ్వు బాధ పడతావు అని అంటాడు మధు. మందు పై కొండ ఏం చెప్తావ్ రా నువ్వు అని అంటాడు ప్రసాదు మీ ఊర్లో అందరూ నీలానే దద్దమ్మలే ఉంటారా అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ రా మాటలు తిన్నగా రా అని అంటాడు ప్రసాద్. ఇంట్లో జరిగేదంతా మీరు చూస్తూ సైలెంట్ గా ఉంటే నాకు మిమ్మల్ని పొడిచిపడేయ్యాలనిపిస్తుంది. అసలేంటి రా నీ బాధ అని అంటాడు ప్రసాద్ బాధ కాదు నాన్న నా మీద నాకే అసహ్యంగా ఉంది. నిన్ను చూస్తుంటే చంపేయాలనిపిస్తుంది అని అంటాడు మధు. పాపం మురారిని చూస్తే బాధేస్తుంది మీ వదిన కృష్ణ కి పెళ్లయింది అన్న విషయం చెప్పేసింది. ఎంత బాధ పడుతున్నాడో మీకు తెలుసా ఈ విషయం నేను ఇప్పుడే వెళ్లి చెప్పేస్తాను అని ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి వాళ్ళ అమ్మ వచ్చి ఏమిట్రా చెప్పేది ఇంట్లో లేని పని గొడవలు పెట్టకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రసాద్ కూడా మధుని తిట్టేసి వెళ్లిపోతాడు మధు ఆవేశంగా ఎలాగే నిజం బయటపడుతుందా అని ఆలోచిస్తూ ఉంటాడు.

మురారి కోపం..

ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటారు. మురారిని తీసుకు రమ్మని నందు గౌతమ్ తో చెప్తుంది గౌతమ్ మురారిని పిలుచుకొస్తాడు ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ముకుందతో అమ్మ రావట్లేదా అని నందు అంటుంది. అత్తయ్య పాలు తాగి పడుకుంటా అన్నారు అని అంటుంది ముకుందా అప్పుడే అక్కడికి మురారి కూడా వస్తాడు మురారి పక్కనే ముకుంద కూర్చుంటుంది కావాలని, అది చూసి రేవతి నందు ఇద్దరు ఈ ముకుంద కావాలనే చేస్తుంది అని అనుకుంటారు. నేను వడ్డిస్తాను అత్తయ్య అని అంటుంది నేనే వడ్డిస్తాను అని అంటుంది రేవతి. కావాలనే ముకుందా మురారి కి అన్నం వడ్డిస్తూ, ఇంకొంచెం తిను మురారి ఇంకొంచెం పెట్టనా అని అడుగుతూ ఉంటుంది చాలు అని అంటాడు అయినా ఇంకా వేస్తూ ఉంటుంది ఏం నాకు తెలియదా అని పెద్దగా అరుస్తాడు మురారి. నేనేమన్నా చిన్న పిల్లలనుకుంటున్నావా అని అంటాడు ఆ మాటలకి ముకుంద షాక్ అవుతుంది ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు. రేవతి మాత్రం ఆనందపడుతూ ఉంటుంది. ఏమైంది అన్నట్టు నందు గౌతమ్ వైపు చూసి అంటుంది. మధు ప్రసాద్ తో ఇదే కరెక్ట్ టైం నాన్న చెప్పేద్దాం అని అంటాడు. నువ్వు నోరు మూసుకొని తిను అని అంటాడు ప్రసాద్. మురారి చాలా కోపంగా ఉంటాడు. కృష్ణ కోనేటిలో దీపాలు వదులుతాను, అన్నమాటలు భవానీ దేవి వాళ్ళ భర్త కోసం కృష్ణ ఆడవాళ్లు అలా చేస్తారు అని చెప్పడం అదంతా గుర్తు చేసుకుంటూ భోజనం చేయకుండా ఆలోచిస్తూ ఉంటాడు. రేవతి ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు అని అంటుంది మురారితో నీ గురించే అమ్మ అని అంటాడు. నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నేను బానే ఉన్నాను కదా అని అంటుంది. వెంటనే ముకుంద కి ఇప్పుడు నన్ను అడిగినట్టుగానే రేవతి అయిన కూడా కృష్ణ భక్త ఎవరు అని అడుగుతాడు. ఈవిడ ఏం చెప్తుందో అని కంగారు పడుతూ ఉంటుంది.

Brahmamudi December 08 2023 Episode 274: ఊహించని ట్విస్టులతో కళ్యాణ్ అనామికల నిమ్మ మొక్క.. ఇంతకీ పెళ్లి జరుగుతుందా.?

తల్లి నిలదీసిన మురారి..

ఇక ప్రసాదు మురారి ముందు అన్నం తిను తర్వాత మాట్లాడుకుందాం అని అంటాడు ఒక్క పూట అన్నం తినకపోతే ఏం చచ్చిపోము కదా అని అంటాడు. వెంటనే మధు,బాగా చెప్పావు బ్రో అని అంటాడు. నువ్వు నోరు మూసుకొని తిను అని మధుని అరుస్తాడు ప్రసాదు. మధు అలా అక్కడ ఏవైనా గొడవ జరుగుతుందేమోనని వాళ్ళ అమ్మ కంగారు పడుతూ ఉంటుంది. మురారి వాళ్ళ అమ్మతో అమ్మ నేను నిన్ను ఒకటి అడుగుతాను, నిజం చెప్పాలి అని అంటాడు. వెంటనే రేవతి ఇప్పుడు ఏమి అడుగుతాడు అని కంగారు పడుతూ ఉంటుంది ముకుంద కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది నేను అడిగినదానికి నువ్వు కచ్చితంగా నిజం చెప్పాలమ్మా అని కృష్ణ భర్త ఎవరు అని అడుగుతాడు. ఆయనెవరు ఎక్కడ ఉంటాడు అని అడగ్గాని రేవతి కంగారు పడుతూ ఉంటుంది సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది మురారి కి కోపం వచ్చి ఒక్కసారిగా లేచి అమ్మ నీకు నిజం తెలిసింది కూడా తెలీదని మాత్రం చెప్పొద్దు అని అరుస్తూ ఉంటాడు. రేవతి ఏం చెప్తుందో అని ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు మురారి కోపంగా, డైనింగ్ టేబుల్ మీద ఉన్న ప్లేట్ తీసి కిందపడేస్తాడు. రేవతి మనసులో నిజం చెప్తే అక్క చంపేస్తుంది నిజం చెప్పకపోతే వీడు నా గురించి ఏమనుకుంటాడో అని అనుకుంటూ ఉంటుంది. మురారి కోపాన్ని చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. చెప్పవు నువ్వే కాదు ఇక్కడ ఎవ్వరూ నిజం చెప్పారు నాకు, ఎందుకు మరి అంత కోప్పడుతున్నావు. అనే ప్రసాదు అంటాడు వెంటనే మధు, అసలు ఈ గొడవ అంతా ఎందుకు బ్రో? నీకు వేణి తెలుసు వేణి గారి ఇంటికి వెళ్లి అసలు నువ్వే డైరెక్ట్ గా ఆవిడని అడుగు, అని మధు అంటాడు. వెంటనే ఆ మాటలకు ఇంట్లో వాళ్ళు కూడా షాక్ అవుతారు ఎక్కడ మురారి కృష్ణ దగ్గరికి వెళ్లి అడుగుతాడు అని, మధు అవును బ్రో నీకు వేణి గారి ఇల్లు తెలుసు కదా వెళ్లి ఆవిడనే నిలదీవ్వు మమ్మల్ని అందరినీ ఎందుకు అరుస్తున్నావు అని అంటాడు. కరెక్ట్ ఇప్పుడే వేణి గారి ఇంటికి వెళ్లి ఆవిడని అడుగుతాను అని అంటాడు మురారి. కంగారుగా ముకుందా? ఎందుకు ఇప్పుడు ఆవిడ భర్త గురించి అని అంటుంది. వాళ్లకి వాళ్లకి ఏవైనా మనస్పర్ధలు ఉన్నాయేమో ఇప్పుడు ఎందుకు, ముకుంద అనగానే, మురారి నేను అడగాలనుకుంటున్నాను అడిగి తీరుతాను అంటాడు మురారి అయితే నేను కూడా వస్తాను అంటుంది ఎవరు అవసరం లేదు నేను ఒక్కడినే వెళ్లి అడుగుతాను అని అంటాడు. ఈ విషయంలో నేను ఎవరిని నమ్మాలి అనుకోవట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెంటనే మధు ఇది కదా కావాల్సింది ఎందుకు ముసుగులో గుద్దులాట మీ అందరికీ ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే నేను తీసిన సినిమా 100 రోజులు ఆడినట్టుగా సంబరంగా ఉంది అని అంటాడు మధు. అందరూ కంగారు పడుతూ ఉంటారు.

రేపటి ఎపిసోడ్ లో, మురారి తో కృష్ణ, ఏంటి సార్ ఏదో కొత్త విషయం చెప్తాను అని అన్నారు. అని అనగానే కృష్ణ నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉంటున్నావు కదా నీ భర్త ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. ఆ మాటలకి కృష్ణ షాక్ అవుతుంది నేను బానే ఉన్నాను వేణి గారు మీరు నిజం చెప్పండి అని అంటాడు. ఇక కృష్ణ ఏం చెప్తుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం..

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu