Monkey Man OTT: మంకీ మాన్ మూవీ తో హాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్లమ్‌డాగ్ మిలీనియర్ సేమ్ దేవ్ పటేల్ హీరోగా నటిస్తు దర్శకత్వం వహించిన ఈ మూవీలో వేశ్య పాత్రలో శోభిత నటించింది. ఏప్రిల్ 5న అమెరికా, కెనడా తో పాటు మరికొన్ని దేశాల్లో ఈ మూవీ విడుదలైంది. ఇండియాలో ఏప్రిల్ 19 థియేటర్లలో రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇండియాలో థియేటర్లలో విడుదలైన రెండు వారాల తరువాత మంకీ మాన్ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. మంకీ మాన్ వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మే 10 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది.
మే ఫస్ట్ వీక్ లో మంకీ మ్యాన్ ఓటిటి రిలీజ్ డేట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. భారతీయ పురాణాల నుంచి స్ఫూర్తి పొందుతూ దేవ్ పటేల్ మంకీ మాన్ కథను రూపొందించాడు. నైట్ క్లబ్ లో ఫైటర్ ద పని చేసే ఓ యువకుడు జీవితం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. జీవితంలో తనకు ఎదురైన ఘటనలు, అవమానాలకు అతడు ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనే ది యాక్షన్ సీక్వెన్స్ తో రూపొందించాడు డైరెక్టర్. హీరో రివేంజ్ కు సాయపడే ఓ బోల్డ్ పాత్రలో శోభిత నటించింది. లెంగ్త్ పరంగా చిన్న క్యారెక్టర్ అయినా తన గ్లామర్ మరియు యాక్టింగ్ తో హాలీవుడ్ ఫ్యాన్స్ ని మైమరిపించింది శోభిత.
10 మిలియన్ల బడ్జెట్‌తో రూపొందిన మంకీ మాన్ మూవీ 25 మిలియన్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ తోనే దర్శకుడిగా దేవ్ పటేల్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీకు ఓ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాడు. ఈ హాలీవుడ్ మూవీ లో చాలామంది భారతీయ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. 2016లో అనురాగ్ దర్శకత్వంలో రూపొందిన రామణ్ రాఘవ్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శోభిత. 8 ఏళ్ల కెరీర్లో కేవలం 12 సినిమాలు మాత్రమే చేసింది. యాక్టింగ్ కంటే గ్లామర్ తోనే అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్‌కు పరిమితం కాకుండా దక్షిణాదిలో తెలుగు, తమిళ్, మలియాల్ భాషల్లో తన లక్‌ని పరీక్షించుకుంది.
ఇక ఈమెకి టాలీవుడ్ హీరో నాగచైతన్యకి రిలేషన్ ఉందని గత కొంతకాలంగా అనేక వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సందర్భంలోనే శోభిత పేరు మరింత వైరల్ గా మారింది. చైతు మరియు శోభిత కలిసి కనిపించడం మరియు ఇతర ప్రాంతాలకి పార్టీలకి తిరగడంతో విరి అనుమానాలు కాస్త మారింత బలపడ్డాయి. ఇక అలా శోభిత పేరు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం శోభితకి మ్యారేజ్ కావడంతో ఈ వార్తలకి అడ్డుకట్టబడింది. ఇక మంకీ మ్యాన్ తో హాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ రానున్న రోజుల్లో ఇంకెన్ని అవకాశాలు అందుకుని ఏ రేంజ్ పాపులారిటీ సంపాదించుకుంటుందో చూడాలి.