NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Tillu Square OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న టిల్లు గాడు.. అనుకున్న దానికంటే ముందుగానే స్ట్రీమింగ్..!

Tillu Square OTT: సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ” టిల్లు స్క్వేర్ “. ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయి మూడు వారాలైన బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతుంది. ఇక తాజాగా ఈ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ పై మరోసారి బజ్ వినిపిస్తుంది. ఇప్పటివరకు అనుకున్న దానికంటే వారం ముందే ఈ మూవీ ఓటిటి లోకి వస్తుందని భావిస్తున్నారు. టిల్లు స్క్వేర్ మూవీ ఓటిటి హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఓటిటి రిలీజ్ మే మూడవ తేదీ నుంచి ఉండనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఈ మూవీ వారం ముందుగానే అంటే ఏప్రిల్ 26 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

Tillu Square OTT release updates
Tillu Square OTT release updates

ఇక దీనిపై అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సిద్దు, అనుపమ నటించిన టిల్లు స్క్వేర్ మూవీ మార్చ్ 29న రిలీజ్ అయింది. కొన్ని నెలల పాటు ఊరించి మొత్తానికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. అయితే తొలి షో నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడం మొదలైంది. దీంతో మంచి వసూళ్లు సైతం నమోదయ్యాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 125 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ను రాబట్టిందని మేకర్ స్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 18 రోజుల్లో రూ.125.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను సాధించిందని మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ” డబల్ బ్లాక్ బస్టర్ టిల్లు స్క్వేర్ కొత్త ల్యాండ్ మార్క్ చేరింది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.125 కోట్ల గ్రాస్ మార్క్ను దాటింది.

ఇంత భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చినందుకు థాంక్స్ ” అంటూ సితార ఎంటర్టైన్మెంట్ ఓ ట్వీట్ షేర్ చేసింది. టిల్లు స్క్వేర్ మూవీతో తొలిసారి రూ. 100 కోట్ల క్లబ్ లోకి సిద్ధూ అడుగు పెట్టాడు. 9 రోజుల్లోనే ఈ మూవీ ఆ మార్క్ క్రాస్ చేసింది. ఇక 100 కోట్ల సినిమా కొడతానని మూడేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సిద్దు.. లక్ష్యం కంటే ముందే దాన్ని కొట్టేశారు. టిల్లు స్క్వేర్ మూవీకి స్క్రిప్ట్ కూడా రాసింది సిద్దు నే. ఈ మూవీకి పెద్ద పోటీ లేకపోవడం కూడా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. టిల్లు స్క్వేర్ రిలీజ్ అయిన మరుసటి వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫ్యామిలీ స్టార్ బోల్తా పడింది.

Tillu Square OTT release updates
Tillu Square OTT release updates

మలయాళ మూవీ మంజుమ్మల్ బాయ్స్ మాత్రమే కాస్త పోటీ ఇచ్చింది. 2022లో వచ్చిన డీజే టిల్లు మూవీకి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ మొదటి భాగాన్ని మించిపోయింది. టిల్లు స్క్వేర్ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానులకి తగిన న్యాయం చేసింది. ఇక ఈ మూవీ పై భారీ అంచనాలు ఉండడంతో ఈ సినిమా రూ. 32 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అటు నెట్ఫ్లిక్స్ కూడా ఏకంగా రూ. 35 కోట్లకు ఈ మూవీ డిజిటల్ హక్కులను దక్కించుకుంది. ఇప్పుడు థియేటర్లలో మూవీ సూపర్ హిట్ కావడంతో ఓటీడీలో సహజంగానే ఈ మూవీకి మంచి డిమాండ్ ఉండనుంది. మరి నెట్ఫ్లిక్స్ తాము పెట్టిన భారీ మొత్తానికి ఈ మూవీ ఏ మాత్రం న్యాయం చేయగలదో చూడాలి.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella