NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

Paluke Bangaramayenaa Today Episode April 16 2024 Episode 203 highlights

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203:  రేపు మాత్రం నువ్వు నాతో రావట్లేదు పెళ్లి చేసుకోక ముందు ఎంత ఆనందంగా ఉన్నాను రేపటి నుంచి అంతే ఆనందంగా ఉంటాను పిల్లమనే గొళ్ళెం నుంచి విడిపోయి ఆనందంగా ఉంటాను అని అభిషేక్ అంటాడు. ఒరేయ్ అభి ఏంట్రా నువ్వు చేస్తుంది అని బామ్మ అంటుంది. నువ్వు చెప్పు బామ్మ భర్త తప్పు చేశాడని లోకమంతా అన్న భర్తకి సపోర్ట్ చేసి తప్పు చేయలేదని పెళ్ళాం ఉంటుంది కానీ భర్తే తప్పు చేశాడని ప్రతి క్షణం నిందించే భార్య ఉంటుందా దాన్ని పెళ్ళాం అంటారా విడిపోయిన గొల్లమంటారా అని అభిషేక్ అంటాడు. చెప్పు అమ్మమ్మ పెళ్లయిన మొదటి రోజు శోభనం గదిలో నుంచి వెళ్ళిపోయి నా తండ్రి చావుకి కారణమయ్యాడు అలాంటివాడు భర్త అంటారా లేకపోతే యముడు అంటారా అని స్వర అంటుంది. మీరిద్దరూ ఇలా గొడవ పడుతూ ఉంటే మికేం చెప్పాలి అని బామ్మ అంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా ఇది మాత్రం పచ్చి నిజం బామ్మ రేపు నేను ఒక్కడినే ట్రాన్స్ఫర్ అయి వెళ్తున్నాను ఆ ట్రాన్స్ఫర్ నాకు వరం అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode April 16 2024 Episode 203  highlights
Paluke Bangaramayenaa Today Episode April 16 2024 Episode 203 highlights

నాకు మాత్రం అభి శాపం అని స్వర అంటుంది. అభి శాపం అంటే ఏంటి బామ్మ అభి కి శాపమిచ్చిందా లేదంటే అభి  తనకు శాపమా అని అభిషేక్ అంటాడు. స్వర కోపంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,  నాకు బెల్ కావాలి అని వైజయంతి అంటుంది. అప్పుడు వద్దన్నారు కదా మేడం అని ఎస్ఐ అంటాడు.అప్పుడు వద్దన్నాను అప్పుడు  వద్దన్నాను కానీ ఇప్పుడు జైలు వద్దు బేలే ముద్దుఅంటున్నాను ఆ స్వర జీవితం నాశనం అయిపోవాలి అది చూసి నేను సంతోషించాలి ఇమీడియట్ ఇప్పుడే నాకు బెల్ కావాలి అని వైజయంతి అంటుంది. అలాగే మేడం అని ఎస్సై అంటాడు. స్వరని చూస్తుంటే నాకు వాళ్ళిద్దరూ కలవరి ఏమో అనిపిస్తుంది ఎందుకు అలా చేస్తుంది స్వర అభిని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని యశోద ఆలోచిస్తుంది. ఏంటి యశోద ఏం ఆలోచిస్తున్నావ్ అని బామ్మ అడుగుతుంది. ఏముంది అత్తయ్య మనం ఎంత చెప్పినా స్వర అభితో వెళ్ళనంటుంది ఎలా అని యశోదఅంటుంది.నీ కొడుకుతో మాట్లాడడం లేదని తిట్టడం మానేసి స్వర గురించి ఇంకా ఆలోచిస్తున్నావా నువ్వు గొప్ప అతవే బాబు అని బామ్మ అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode April 16 2024 Episode 203  highlights
Paluke Bangaramayenaa Today Episode April 16 2024 Episode 203 highlights

అత్తయ్య స్వర చాలా మంచి అమ్మాయి తన ప్రవర్తన మాట తీరు చాలా బాగుంటుంది అందుకే తనను తిట్టాలనిపించదు లేదంటే శంకినీ పిల్ల అయితే ఎందుకే నా కొడుకుని ఇలా ఇబ్బంది పెడుతున్నావ్ అని చెడమడ వాయించేదాన్ని కానీ అలా చేయట్లేదు అంటే స్వర చాలా మంచి అమ్మాయి అత్తయ్య ఏదో అపార్థం వల్ల ఇలా అయిపోయింది అని యశోద అంటుంది.ఇప్పుడు తను మంచిదా కాదా అనేది పక్కన పెట్టి అభి తో వెళ్లేలా ప్రయత్నించాలి లేదంటే  వాళ్ల మధ్య దూరం పెరుగుతుంది అని భామ్మ అంటుంది. అలాగే అత్తయ్య ఇప్పుడే వెళ్లి స్వర తో మాట్లాడుతాను అని యశోద అంటుంది. కట్ చేస్తే, స్వర అభిషేక్ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది.అమ్మ స్వర ఇలా అంటున్నానని నువ్వు ఏమీ అనుకోకు నీకు బాధ ఉంటుంది కాదనడం లేదు కానీ పెళ్లయిన మగాడిని దూరం పెడితే వేరే అలవాట్లకి అలవాటు పడిపోతాడు అలాంటి అవకాశం నువ్వు ఇవ్వద్దు నీకు మాట ఇచ్చి వాడు మందు తాగుతున్నాడు అని కోపం ఉండొచ్చు కానీ నువ్వే సర్దుకుపోవాలి కళ్ళ ముందు కనిపించే వన్ని నిజాలు కావు కనిపించని వన్ని అబద్ధాలు కావు కొన్ని మనసుతో చూస్తే తప్ప అర్థం కావు ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో అభి తో పాటు నువ్వు కూడా రేపు వెళ్ళిపోమా అని యశోద అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode April 16 2024 Episode 203  highlights
Paluke Bangaramayenaa Today Episode April 16 2024 Episode 203 highlights

స్వర ఏమీ మాట్లాడకుండా కోపంగా వెళ్ళిపోతుంది. అవైజయంతి స్వరని ఏం చేస్తుంది అని నేను భయపడుతుంటే తను మొండిగా రానని కూర్చుంది ఏం చేయాలి అని అభిషేక్ ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే, అభి బట్టలు సర్దుకుంటూ ఉంటాడు.స్వర అన్నయ్య వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు అని కీర్తి అంటుంది. చూస్తున్నాను అని స్వర అంటుంది. అక్క నువ్వు కూడా బావతో వెళ్లొచ్చు కదా అని ఆర్య అంటాడు. బంగారం నువ్వు కూడా వెళ్లి హెల్ప్ చేయచ్చు కదా మీ అన్నయ్య స్వరని ఇక్కడే వదిలేసి మనకి హెల్ప్ చేస్తున్నాడు అని రవీంద్ర అంటాడు. చందన వెళ్లి అభికి బట్టలు సద్దడంలో సహాయం చేస్తుంది. భర్త ఇష్ట ఇష్టాలు ఏంటో తెలుసుకుని మసులుకోని ఉండమని మా అత్తయ్య చెప్పింది కొన్ని నచ్చిన నచ్చకపోయినా మనం సర్దుకుపోవాలి భార్యాభర్తలు అంటే అలాగే ఉండాలి అని యశోద అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode April 16 2024 Episode 203  highlights
Paluke Bangaramayenaa Today Episode April 16 2024 Episode 203 highlights

మీ అత్త అనడం ఏంటే బుద్ధున్న ఏ ఆడదైనా అలాగే చెబుతుంది అని బామ్మ అంటుంది. నేను మాత్రం అలా చెప్పను స్వర ఇష్టం లేకుండా అన్నయ్య వెంట పంపించాలని ఎందుకు చూస్తున్నారు స్వర ఇప్పుడు నచ్చితేనే వెళ్ళు లేదంటే ఇక్కడే ఉండు బలవంతంగా వెళ్లాల్సిన పనిలేదు అని చందన అంటుంది. స్వర కోపంగా వెళ్ళిపోతుంది. నీకు అసలు బుద్ధుందా మేమింత మంది అభితో స్వరని పంపించాలని చూస్తుంటే స్వరకి అభి కి మధ్యలో దూరం పెంచాలని చూస్తావా అని యశోద అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode April 16 2024 Episode 203  highlights
Paluke Bangaramayenaa Today Episode April 16 2024 Episode 203 highlights

మీరు ఎన్ని చెప్పినా స్వరకి ఆలోచించేది ఒక గుణం ఉంటుంది కదా అమ్మ తను నచ్చితేనే వెళ్తుంది అని చందన అంటుంది. అభి ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్పినా తను వినడం లేదు ఏం చేస్తాం ఇక్కడే ఉండనివ్వు అని బామ్మ అంటుంది. స్వరకి ఎన్ని విధాలుగా చెప్పిన వినడం లేదు వాళ్ళ నాన్నని చంపానని బలంగా నమ్ముతుంది అని అభిషేక్ ఆలోచిస్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

siddhu

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

siddhu

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

siddhu

Madhuranagarilo: రుక్మిణిని నమ్మించడానికి శ్యామ్ ఏం చేయనున్నాడు..

siddhu

Paluke Bangaramayenaa: ముడుపు దొంగతనం చేశారంటున్న వైజయంతి, చందనని రవీంద్రాని అనుమానిస్తున్న బామ్మ..

siddhu

Prabhas: ప్రభాస్ “స్పిరిట్” కోసం ఆ ఇద్దరి హీరోయిన్లను లైన్ లో పెట్టిన సందీప్ రెడ్డి వంగా..?

sekhar

Thandel OTT Rights: కళ్ళు చెదిరే ధరకు అమ్ముడుపోయిన నాగచైతన్య ” తండెల్ ” ఓటీటీ హక్కులు.. చైతు కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్..!

Saranya Koduri

Shaitan OTT Release: నాలుగు రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ హర్రర్ మూవీ.. ఈ రూ. 211 కోట్ల సినిమాను ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri