Pooja Hegde: నా కెరీర్‌లోనే అదో చెత్త సినిమా..దాని వ‌ల్లే ఆఫ‌ర్లు రాలేదు: పూజా హెగ్డే

Share

Pooja Hegde: పూజా హెగ్డే.. ఈ బ్యూటీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఒక లైలా కోసం` మూవీతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. త‌న‌దైన టాలెంట్‌తో అన‌తి కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ సౌత్ తో పాటు నార్త్‌లోనూ న‌టిస్తూ కెరీర్ ప‌రంగా జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది.

అయితే ఇటీవల పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్‌, బీస్ట్‌, ఆచార్య చిత్రాలు భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై.. బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డ్డాయి. అయిన‌ప్ప‌టికీ బుట్ట‌బొమ్మ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గలేదు. ప్ర‌స్తుతం ఈ భామ విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న `జ‌న‌గ‌ణ‌మ‌న‌` అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో న‌టిస్తోంది.

అలాగే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కు జోడీగా `కభీ ఈథ్‌ కభీ దివాలీ`, `సర్కస్‌` వంటి చిత్రాల్లో న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే త‌న సినీ కెరీర్‌కు సంబంధించి ఎన్నో విష‌యాల‌ను షేర్ చేసుకుంది. పూజా హెగ్డే మాట్లాడుతూ.. `తెలుగులో నేను చేసిన ఆరు సినిమాలు వరుసగా హిట్‌ అవ్వడం కెరీర్ లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌. ఇక లోయేస్ట్‌ పాయింట్‌ వచ్చేసి నా డెబ్యూ(మొహంజోదారో) చిత్రమే.

నా కెరీర్‌లో అది ఒక చెత్త సినిమాగా నిలిచింది. ఆ సినిమా వల్ల నాకు ఏడాది పాటు ఆఫర్స్‌ రాలేదు. పైగా ఐరన్‌ లెగ్‌ అనే పేరు కూడా వచ్చింది` అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి. కాగా, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన మొహంజోదారో చిత్రం 2012లో విడుద‌లైంది. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ఈ మూవీ ఫ్లాప్‌గా నిలిచింది.


Share

Recent Posts

పాపం.. అఖిల్‌ ఆ క‌ష్టం నుండి ఎప్పుడు బ‌య‌ట‌ప‌డ‌తాడో?

నాగార్జున వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ఫ్లాపుల‌ను మూడ‌గ‌ట్టుకున్నాడు. ఈయ‌న నుండి వ‌చ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…

3 mins ago

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

1 hour ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

1 hour ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago