Salaar On Hotstar: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా “సలార్” సినిమా గత ఏడాది సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేసింది. 2023లో హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా “సలార్” నిలిచింది. వరుసపరాజయాలలో ఉన్న ప్రభాస్ కి “సలార్” మంచి బ్రేక్ ఇవ్వటం జరిగింది. గత ఏడాది డిసెంబర్ 22వ తారీకు పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలయ్యి అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఈ సినిమా రిలీజ్ అయి నెల రోజులు కాకముందే జనవరిలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కావడం జరిగింది.
కాగా ఇప్పుడు మరో ఓటిటి సంస్థ హాట్ స్టార్ లో “సలార్” హిందీ వర్షన్ జనవరి 16వ తారీకు నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. నెట్ ఫ్లిక్స్ ఓటిటి సంస్థలో “సలార్” అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. దీంతో ఇంగ్లీష్ వర్షన్ కూడా విడుదల చేశారు. కాగా ఇప్పుడు మరో ఓటిటి సంస్థ హాట్ స్టార్ లో హిందీ వర్షన్ ఫిబ్రవరి 16 నుండి స్ట్రీమింగ్ కాబోతుండటం విశేషం. ఫ్రెండ్షిప్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ నీ చాలా అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో.. ఎలివేషన్స్ ఓ రేంజ్ లో అభిమానులను అలరించాయి.
దీంతో ఎప్పటినుండో విజయం కోసం ఎదురు చూస్తూ ఉండటంతో సలార్ భారీ హిట్టు కావడం జరిగింది. మొదటి భాగం హిట్ కావడంతో ఇప్పుడు “సలార్” సెకండ్ పార్ట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఓటిటి హవా రోజు రోజుకి పెరిగిపోతోంది. థియేటర్లలో సినిమా నడుస్తూ ఉండగానే మరోపక్క ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీంతో సిని వ్యాపారం పూర్తిగా స్టార్టింగ్ కలెక్షన్ల పై ఆధారపడిన పరిస్థితి నెలకొంది. ఇటీవల సంక్రాంతి పండుగకు వచ్చిన సినిమాలు కూడా వరుసగా ఇప్పుడు ఓటీటీ బాట పట్టాయి. “సలార్” ఆల్రెడీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుండగా ఇప్పుడు మరో ఓటిటి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి రెడీ కావడం విశేషం.